
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌తో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయనకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా ఇప్పటి వరకు మంచు విష్ణు కానీ, మోహన్ బాబు కానీ మనోజ్‌కు విష్ చేయలేదు.
కానీ మంచు మనోజ్ అంటే అక్క మంచు లక్ష్మీకి విపరీతమైన ప్రేమ. గతంలో తానే పక్కనుండి మనోజ్- మౌనికల పెళ్లిని జరిపించింది. ఇవాళ తమ్ముడి పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. భైరవం మూవీలోని ధమ్ ధమారే అంటూ సాగే పాటకు పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. అందరికంటే కాస్తా వెరైటీగా విష్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ కావడంతో సూపర్బ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన మంచు మనోజ్ ఫుల్ ఖుషీ అయ్యారు. లవ్ సింబల్స్‌తో వీడియోకు రిప్లై కూడా ఇచ్చారు. థ్యాంక్యూ యూ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా.. మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ ఈనెల 30న థియేటర్లలో సందడి చేయనుంది.