
హిందీ బిగ్‌బాస్ షోలో ఫ్యాన్స్‌ను మెప్పించిన బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్. హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌లో టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె వంద రోజుల తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. ఈ షో ద్వారా శిల్పా మరింత ఫేమస్ అయ్యారు.
అయితే శిల్పా శిరోద్కర్ తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు స్టే సేఫ్.. టేక్ కేర్ మేడమ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్‌పై ఆమె సిస్టర్, మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ సైతం స్పందించింది. గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చింది.