
ఒకప్పటితో పోలీస్తే సీనియర్ హీరోలు.. ప్రస్తుతం యువ దర్శకులతో పనిచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కి తగ్గ స్టోరీలతో మూవీస్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అలా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ తెలుగు యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)
ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చేస్తున్న రజినీకాంత్.. మరోవైపు నెల్సన్ తీస్తున్న 'జైలర్ 2' కూడా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అలానే తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర రజినీ డేట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వివేక్ ఆత్రేయ వెళ్లి ఆయనకు కథ చెప్పాడని తెలుస్తోంది.
2017లో 'మెంటల్ మదిలో' అనే సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'బ్రోచేవారెవరురా' తీశాడు. నానితో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం చిత్రాల‍్ని తెరకెక్కించాడు. కేవలం నాలుగే సినిమాలు తీసిన అనుభవమున్న వివేక్.. ఒకవేళ రజినీతో మూవీ చేస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే.
(ఇదీ చదవండి: కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి)