
సరిగ్గా ఓ వారం క్రితం తమిళ హీరో విశాల్.. ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్లాడు. వచ్చిన వాళ్లతో మాట‍్లాడుతూ సడన్ గా కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. కానీ శరీరంలో ఫుడ్ లేకపోవడంతో శక్తి లేకనే కళ్లు తిరిగి పడిపోయారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)
ఇది జరిగి ఎన్ని రోజులూ కాలేదు. తాజాగా విశాల్ ఆరోగ్యంగా కనిపించాడు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతితో దిగిన ఫొటోని పోస్ట్ చేశాడు. చాలారోజుల తర్వాత తన డార్లింగ్ ఫ్రెండ్ ని కలిశానని, కాసేపు తనతో మాట్లాడానని చెప్పుకొచ్చాడు. ఈ ఫొటోలో విశాల్ ని చూస్తుంటే బాగానే కనిపించాడు.
కొన్నాళ్ల క్రితం కూడా ఇలానే ఓ ఈవెంట్ కి వచ్చిన విశాల్ గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కి కనిపించాడు. ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఆరోగ్యం పర్వాలేదనిపించేలా ఉంది. ప్రస్తుతానికైతే విశాల్ చేతిలో 'తుప్పరివాలన్ 2' తప్పితే మరో ప్రాజెక్ట్ లేదు. ఇది కూడా చాన్నాళ్ల నుంచి తీస్తున్నారు. దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడంతో హీరో, నిర్మాతగా విశాలే చేస్తున్నాడు. మరి దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)