'షష్టి పూర్తి' ట్రైలర్‌.. మంచి ప్రయత్నం | Shashtipoorthi Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

'షష్టి పూర్తి' ట్రైలర్‌.. మంచి ప్రయత్నం

May 24 2025 8:36 PM | Updated on May 24 2025 8:50 PM

Shashtipoorthi Movie Trailer Out Now

'షష్టి పూర్తి' సినిమా ట్రైలర్‌ తాజాగా వచ్చేసింది. మంచి కంటెంట్‌తోనే ఈ సినిమాను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. 'లేడీస్‌ టైలర్‌' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి  'షష్టి పూర్తి' మూవీలో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ మూవీని పవన్‌ ప్రభ దర్శకత్వంలో రూపేష్‌ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. మంచి లవ్‌ ట్రాక్‌తో పాటు కుటుంబ విలువలకు పెద్ద పీఠ వేసినట్లు ట్రైలర్‌లో చూస్తే అర్థం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్‌, అర్చన జంటతో పాటు రూపేష్, ఆకాంక్షా సింగ్‌ యంగ్‌ జంటగా మెప్పించనున్నారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement