అల్లు అర్జున్‌ మనసులో రాఘవేంద్రరావు స్థానం.. ఫోటో వైరల్‌ | Allu arjun Honor To Director Raghavendra Rao | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ మనసులో రాఘవేంద్రరావు స్థానం.. ఫోటో వైరల్‌

May 23 2025 9:20 PM | Updated on May 23 2025 9:21 PM

Allu arjun Honor To Director Raghavendra Rao

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ తన తొలి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారిపట్ల ఎంతో గౌరవం, కృతజ్ఞతతో ఉంటాడు. తనను హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును నిత్యం తలచుకునేలా, తన సినీ ప్రయాణం ప్రారంభమైన దశను ప్రతిరోజూ గుర్తు చేసుకునేలా, అల్లు అర్జున్ తన కార్యాలయ ప్రవేశద్వారంలో రాఘవేంద్రరావు ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా దర్శకుడిపై తన గౌరవాన్ని చాటుకున్నారు.

అల్లు అర్జున్ కెరీర్ విజయాలమీద మాత్రమే కాకుండా, తనకు మద్దతుగా నిలిచిన వారిపట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే విషయంలో కూడా ఎంతో విలువలతో ఉంటాడు. ఈ విషయంలో ఆయన  వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రత్యేకమైనది.  రాఘవేంద్రరావు తనను సినిమారంగంలోకి పరిచయం చేసిన తొలి దర్శకుడిగా, ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

"అల్లు అర్జున్ తన కెరీర్‌ ఎదుగుదలకు తోడ్పడిన దర్శకుల విషయంలో ఎంతో జెన్యూన్‌ ప్రేమతో ఉంటాడు. వాళ్ల పట్ల ఎప్పుడూ ఆయన మనసులో ఎంతో గౌరవం ఉంటుంది.  అందులో రాఘవేంద్రరావుకు బన్నీ జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.  తన దర్శకులు, సాంకేతిక నిపుణులు, చిత్రబృందంలోని ఇతర సభ్యుల పట్ల అల్లు అర్జున్ గల గాఢమైన భావోద్వేగ బంధం గురించి ఆయన తరచూ మాట్లాడుతుంటారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలిదశలో ఆయనకు సహాయపడిన వారిని ఆయన ఎప్పటికీ మరిచిపోరు అని పలువురు అంటున్నారు.

అల్లు అర్జున్ కార్యాలయం ప్రవేశద్వారంలో ఉన్న రాఘవేంద్రరావు చిత్రపటం ఆయనలో ఉన్న కృతజ్ఞత, గౌరవం, భావోద్వేగ సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విలువలే ఆయన విజయాలకు పునాది మాత్రమే కాకుండా, స్టార్‌గా కాకుండా వ్యక్తిగా కూడా ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి అని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement