
జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్‌కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్‌లను దాటుకుంటూ విరుచుకపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్‌ను ఆల్‌రౌండర్ అంటారు.. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి. క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే.. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా.. అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్రపరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20).. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..

తారక్ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్'
ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్‌కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌తో తిరిగొచ్చాడు.
తారక్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం
🎥 తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
🎥 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.
🎥ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.
🎥 యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.
🎥 జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్‌షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.
🎥 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
🎥 నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.
🎥 మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.
🎥 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.
🎥 పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
🎥సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.
🎥 2016లో వచ్చిన జనతా గ్యారేజ్‌తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు
🎥కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్
🎥 బాల రామాయణము,ఆది నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందకున్నాడు
🎥తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట
🎥 తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.
🎥 జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు
🎥అమ్మ (శాలనీ) చిరకాల కలను తీర్చిన తారక్.. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలనే ఆమె కోరికను కొడుకుగా తీర్చాడు.