
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, ఇ.రామ శంకర్ నిర్మించారు. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తోంది. తేజ కూనూరు సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘జిందగీ బిలాలే...’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్‌ని నటుడు ప్రియదర్శి రిలీజ్ చేసి, మాట్లాడుతూ–‘‘బద్మాషులు’ టీజర్ వినోదాత్మకంగా ఉంది.
‘జిందగీ బిలాలే...’పాటని చరణ్ అర్జున్, విహ చక్కగాపాడారు. ఈ సినిమా చక్కని విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇది మన ఊరి కథ అనేలా ఈ సినిమాలోనిపాత్రలు సహజంగా ఉంటాయి. ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించాలనే ఉద్దేశంతో శంకర్ చేగూరి ఈ సినిమాని తెరకెక్కించారు’’ అని యూనిట్ పేర్కొంది.