సల్మాన్ ఖాన్ ఇల్లు మరోసారి టార్గెట్‌ అయిందా..? | Salman Khan Follower Illegally Entered Into His Galaxy Apartment, More Details Inside | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ ఇల్లు మరోసారి టార్గెట్‌ అయిందా..?

May 22 2025 3:12 PM | Updated on May 22 2025 3:35 PM

Salman Khan Follower Illegally Enter His Galaxy Apartment

బాలీవుడ్ స్టార్ ‍హీరో సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో ఎప్పుడూ పలు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన ఇంట్లోకి చొరబడిని ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన జరిగిన రెండురోజుల తర్వాత పోలీసులు ప్రకటించారు. అయితే, తనని విచారిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలుమార్లు సల్మాన్‌ ఇంటి వద్ద ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.

ముంబైలోని సల్మాన్‌కు చెందిన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోకి  చొరబడిన వ్యక్తి పేరు  జితేంద్ర కుమార్‌ సింగ్‌ అని పోలీసులు ప్రకటించారు. అయతే, తను సల్మాన్‌ను కలిసేందుకు వెళ్లినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు ఇలా తెలిపారు. ' రెండురోజుల క్రితం సల్మాన్‌ ఇంటిముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న జితేంద్రను భద్రతా సిబ్బంది మొదట హెచ్చరించించి. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బందితో గొడవపెట్టుకుని తన ఫోన్‌ను విసిరేశాడు. 

అయితే, అదేరోజు సాయింత్రం మళ్లీ సల్మాన్‌ ఇంటి వద్ద అతను మరో వ్యక్తితో కనిపించాడు. ఒకరు బయట ఉన్న సిబ్బందితో వాగ్వాదం పెట్టుకుంటన్నట్లు గేమ్‌ ప్లాన్‌ చేయగా సల్మాన్‌ ఇం​ట్లోకి జితేంద్ర వెళ్లే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ తనను అడ్డుకుని ముంబై పోలీసులకు అప్పజెప్పారు.' అని వారు తెలిపారు. అయితే, పోలీసుల విచారణలో  సల్మాన్‌ఖాన్‌ను కలవాలనుకుంటున్నానని జితేంద్ర చెప్పాడు. అడిగితే అనుమతి లేదని చెప్పడంతో ఇలాంటి పనిచేశానని తెలిపాడు. జితేంద్రపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

కొంతకాలంగా సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు పలుమార్లు సల్మాన్‌ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్‌కు భద్రత కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement