
చాలా రోజుల విరామం తర్వాత మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే ఇటీవల ట్రైలర్ ఈవెంట్‌లో సందడి చేసిన మంచు మనోజ్ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య భూమా మౌనిక తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు మనోజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మౌనిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను ప్రేమించే నా సోల్‌మేట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా జీవితాల్లో వచ్చి.. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ ప్రపంచాన్ని మధురమైన ప్రదేశంగా మార్చారు. మీ చేయబోయే అన్ని మంచి పనులను బాగా జరగాలి. మీ ప్రేమ, ఆనందాన్ని పంచడానికి మీ హృదయం వెయ్యేళ్లు బతకాలి. ఈ ఏడాది మాత్రమే అన్ని సంవత్సరాలు మీరు గొప్పగా ఉండాలి. మేము నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాం.. మీరు జీవితం మరింత ఎదగాలని కోరుకుంటున్నాం. మా ముగ్గురి ప్రేమ మీ కోసం మాత్రమే. మీరు నిజంగా మా రాకింగ్ స్టార్. ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి పునర్జన్మలో నా స్నేహితుడిగా, భర్తగా మిమ్మల్నే ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.