
‘భగవంత్ కేసరి’ని దళపతి విజయ్ వదిలిపెట్టలేదు. అంతలా ఈ చిత్రానికి ఆయన కనెక్ట్ అయ్యారు. బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భగవంత్ కేసరి’. గతేడాదిలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను జననాయగన్ పేరుతో తమిళ్‌లో విజయ్ దళపతి రీమేక్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇదే చివరి సినిమా అని కూడా తెలుస్తోంది. అయితే, ఈ రీమేక్ అంశం గురించి తాజాగా మరో కొత్త విషయం బయటకొచ్చింది.
విజయ్ కొత్త సినిమా 'జన నాయగన్' కోసం ‘భగవంత్ కేసరి’లోని ఒక ముఖ్యమైన సన్నివేశానికి సంబంధించి హక్కులను పొందారట. ఈ సినిమాలో 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' గురించి అందరికీ అవగాహన ఉండాలని బాలకృష్ణతో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇప్పుడు అదే సీన్‌ను జన నాయగన్‌లో విజయ్ రీక్రియేట్ చేశాడని సమాచారం. ఈ సీన్ మాత్రమే రీమేక్ అని, మిగతాది అంతా భగవంత్ కేసరితో జన నాయగన్ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని విజయ్ అభిమానులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బాలయ్య పాత్ర ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది. అందుకే ఈ సినిమాపై విజయ్ ఆసక్తి చూపాడని తెలుస్తోంది. 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' సీన్ కోసం జగ నాయగన్ టీమ్ హక్కులు కూడా పొందిందని సమాచారం. అందుకోసం సుమారు రూ. 4 కోట్లు చెల్లించినట్లు టాక్. ఈ సీన్ మహిళలకు బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ భావించాడట. పొలిటికల్‌గా కూడా తనకు కొంతమేరకు ఉపయోగపడొచ్చని తెలుస్తోంది.
#JanaNayagan : Just to use a single episode, the makers have acquired the remake rights of #BhagavanthKesari film.
Overall, there is no other connection between Jana Nayagan and Bhagavanth Kesari#JanaNayagan pic.twitter.com/sthnxzv4Q1— 𓃰TVK✘BALA𓃰 (@TvkSouthWing) May 19, 2025