
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) , రష్మికా మందన్నా(Rashmika ) జంటగా నటించిన సికందర్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైంది. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నడియాద్‌వాలా ఈ మూవీని నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో రూ. 210 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు.
బాలీవుడ్‌లో విడుదలైన సినిమాలు కొన్ని 8వారాలకు ఓటీటీలో విడుదలౌతున్నాయి. ఇదేబాటలో సికందర్ చిత్రం కూడా స్ట్రీమింగ్‌కు రానుంది. మే 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. అయితే, కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

కథ
కథ చాలా పాతదే.. దర్శకుడు చెప్పిన తీరు అంతే స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా ఈ సినిమా కనెక్ట్ కాలేదు. రాజ్‌కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్‌కోట్‌కు రెండు పేర్లు ఉంటాయి. సికందర్, రాజాసాబ్ (సల్మాన్ ఖాన్), రాణి సాయిశ్రీ (రష్మిక మందన్న) అన్యోన్య దంపతులుగా ఉంటారు. తమ రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకొంటారు. ఈ క్రమంలో ఒకరోజు మంత్రి ప్రధాన్ (సత్యరాజ్)తో మొదలైన వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది. ఆమె చివరికోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేయాలని కోరుతుంది. అయితే, ఎవరైతే రాణి నుంచి అవయవదానం పొందుతారో వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముగ్గురి జీవితాల్లోకి సికందర్ ఎలా ఎంటర్ అవుతాడు. మంత్రి ప్రధాన్ అనుచరుల నుంచి వారిని సికందర్ ఎలా కాపాడుతాడు..? ఇంతకీ సాయిశ్రీ ఎలా మరణించింది? అవయవదాన గ్రహీత వైదేహీ (కాజల్ అగర్వాల్)కు ఉన్న సమస్య ఏమిటి..? అనేది సినిమాలో తెలుసుకోవాల్సిందే.