
రీతూ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'దేవిక అండ్ డానీ'. ఈ సిరీస్‌కు బి.కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను ఫుల్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలోనే విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే దేవిక అండ్ డానీ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరెకెక్కించినట్లు అర్థమవుతోంది. 'ఎవడు భయపెట్టినా.. ఎంత ప్రమాదమైనా రానీ.. వెనకడుగు వేసేదే లేదు'.. అని రీతూ వర్మ చెప్పే డైలాగ్ అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెంచేసింది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో సూర్య వసిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వైవా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనిక రెడ్డి, ఐశ్వర్య కీలక పాత్రలు పోషించారు.
One holds her hand and the other... her soul. 🤍 https://t.co/zTcVhoqYg3
Devika & Danny streaming from 6th June only on #JioHotstar 💌
Directed by @im_kishorudu #DevikaAndDanny #SuryaVashistta @iam_shiva9696 @actorsubbaraju #SoniyaSingh #MounikaReddy #IshwaryaVullingala… pic.twitter.com/OUiWshV7FW— Ritu Varma (@riturv) May 20, 2025