చరిత్రలో మరిచిపోలేని జలియన్ వాలాబాగ్ ఉదంతం.. ట్రైలర్‌ చూశారా? | Jallianwala Bagh massacre Web series trailer Out Now | Sakshi
Sakshi News home page

The Waking Of A Nation: ఓటీటీకి జలియన్ వాలాబాగ్ ఉదంతం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Feb 24 2025 9:28 PM | Updated on Feb 24 2025 9:31 PM

Jallianwala Bagh massacre Web series trailer Out Now

భారతీయుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని దారుణ ఉదంతం జలియాన్ వాలాబాగ్ ఊచకోత. అప్పటి బ్రిటీశ్ పరిపాలన కాలంలో 1919 ఏప్రిల్‌ 13న ఈ మారణహోమం జరిగింది. ఈ అత్యంత పాశవిక ఘటన ఆధారంగా వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ది వాకింగ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌ పేరుతో రామ్‌ మాద్వానీ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.

తారుక్‌ రైనా, నిఖితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ వచ్చేనెల మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. యధార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement