
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది సేపటి క్రితం తన పెద్ద కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరణకు కారణం శనివారం ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ సోషల్ మీడియా పోస్టే లాలూ కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.
निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमज़ोर करता है। ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण तथा गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्यों और संस्कारों के अनुरूप नहीं है। अतएव उपरोक्त परिस्थितियों के चलते उसे पार्टी और परिवार…
— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 25, 2025
శనివారం తేజ్ ప్రతాప్ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలో తేజ్ ప్రతాప్ ఓ యువతితో సన్నిహితంగా ఉన్నారు. ఆ యువతి పేరు అనుష్క యాదవ్ అని, తాము గత 12ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఆ పోస్టుపై దుమారం చెలరేగడంతో కొద్ది సేపటికే దానిని డిలీట్ చేశారు. తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్ చేశారన్నారు. ఆ పోస్టు తాను చేయలేదని స్పష్టం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. గతంలో, తేజ్ ప్రతాప్ యాదవ్, అనుష్క యాదవ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలో వెలుగులోకి వచ్చాయి.
ये वीडियो भी फेक है? 🤔 pic.twitter.com/XdTgZHbZ8b
— Ankur Singh (@iAnkurSingh) May 24, 2025
దీంతో తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటనపై లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం పార్టీ (ఆర్జేడీ) సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తోంది. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని ఎక్స్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తుంది. పెద్ద కుమారుడి కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, పైన పేర్కొన్న పరిస్థితుల కారణంగా, నేను అతన్ని ఆరేళ్ల పార్టీ పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాను. నేటి నుంచి పార్టీకి, కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నాను’ అని లాలూ యాదవ్ హిందీలో రాసిన పోస్ట్‌లో తెలిపారు.
కాగా, తేజ్ ప్రతాప్ 2018లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.