
గతేడాది బిగ్‌బాస్ సీజన్‌లో అభిమానులను అలరించిన టాలీవుడ్ నటి రోహిణి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్‌లో దాదాపు 9 వారాల పాటు హౌస్‌లో ఉండి ఫ్యాన్స్‌ను అలరించింది. మొదటిసారి కంటే రెండోసారి బిగ్‌బాస్ ఛాన్స్ వల్ల రోహిణికి మరింత ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ షోతో రోహిణి దాదాపు రూ.18 లక్షల వరకు పారితోషికం అందుకుంది. రోహిణి టాలీవుడ్‌లో పలు సినిమాల్లో తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అయితే తాజాగా రోహిణి తన సొంతింటి కలను నేరవేర్చుకుంది. హైదరాబాద్‌లో శివారు ప్రాంతంలో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేస్తూ వెల్లడించింది. తాను కొనుగోలు చేసిన విల్లా అత్యాధునిక వసతులు ఉన్నాయని వెల్లడించింది. ఈ విల్లా ధర రూ.1.7 కోట్లు అని రోహిణి తెలిపింది. మై న్యూ ఛాప్టర్ స్టార్ట్స్ నౌ అంటూ వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ రోహిణికి అభినందనలు చెబుతున్నారు.