తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా 'థాంక్యూ డియర్' ఫస్ట్ లుక్ లాంచ్! | Tammareddy Bharadwaja Launched Thank You Dear Movie Poster | Sakshi
Sakshi News home page

తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా 'థాంక్యూ డియర్' ఫస్ట్ లుక్ లాంచ్!

May 23 2025 8:46 PM | Updated on May 23 2025 8:46 PM

Tammareddy Bharadwaja Launched Thank You Dear Movie Poster

టాలీవుడ్‌లో యువ కథానాయకుడు ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్ యూ డియర్’ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందానికి ఆశీస్సులు అందజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. ఇందులో హెబ్బా పటేల్, రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ - శ్రీనివాస్ నాయుడు తదితరులు నటిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. ‘థాంక్ యూ డియర్’ తన రెండో చిత్రమని, తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తమ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో కీలకమైనదని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందని, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement