
తెలుగులో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. మధ్యలో హిందీలో సినిమా చేశాడు. చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ఇక్కడ 'భైరవం' చిత్రం చేశాడు. మే 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో పాల్గొన్న ఇతడు.. ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
'హిందీలో సినిమాలు చేసిన తెలుగు హీరోలు పెద్దగా లేరు. ప్రస్తుతం రానా, రామ్ చరణ్ మాత్రమే చేశారు. చరణ్ చేసింది 'జంజీర్' రీమేక్. హిందీ మూవీని మళ్లీ హిందీలో చేయడం వల్ల ప్రేక్షకులు అలా తీసుకున్నారేమో తెలియదు. నేను చేస్తున్నది సౌత్ మూవీ కదా అనుకున్నాను. రాజమౌళి హిట్ సినిమా, ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతారని అనుకున్నాం'
'పైగా సవతి తల్లి, బిడ్డల సెంటిమెంట్ లాంటివి హిందీలో పెద్దగా ఉండవని నిర్మాత భరోసా ఇచ్చారు. దీంతో వర్కౌట్ అవుతుందేమోనని అనుకున్నాం. కానీ ఛత్రపతి మూవీని రీమేక్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికే సౌత్ సినిమాల్ని హిందీ ప్రేక్షకులు బాగా చూసేశారు. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుందా? అనే టెన్షన్ వల్ల పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: 'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి)