
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన 42వ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలతో కలిసి ఈ పుట్టినరోజును ఆస్వాదించారు. కాగా.. మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య మౌనిక ఇప్పటికే శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. తన భర్త ప్రేమను తలచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.
కాగా.. మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చాలా రోజుల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై మంచు మనోజ్ సందడి చేయనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మే 30న ప్రేక్షకుల థియేటర్లలో సందడి చేయనుంది.
#TFNExclusive: Some lovely visuals of Rocking Star @HeroManoj1 celebrating his birthday with his kids and fans!!😍📸#ManchuManoj #Bhairavam #TeluguFilmNagar pic.twitter.com/bgEMWTV8Sp
— Telugu FilmNagar (@telugufilmnagar) May 20, 2025