
ఎస్వీ కృష్ణారెడ్డి, జనార్ధన్, రమేష్ ప్రసాద్, బలుసు రామారావు
‘‘ఎన్‌టీఆర్‌గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ‘మాయాబజార్’ సినిమాని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ రోజున చూసేందుకు రెండు టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్స్‌లోనే చూడండి’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌వీ రంగారావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయాబజార్’.
కేవీ రెడ్డి దర్శకత్వంలో విజయాప్రోడక్షన్స్పై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ సినిమా 1957 మార్చి 27న విడుదౖలñ ంది. ఈ నెల 28న ఎన్‌టీఆర్ 102వ జయంతి సందర్భంగా ‘మాయాబజార్’ చిత్రాన్ని బలుసు రామారావు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాయాబజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ‘ఎన్‌టీఆర్ లిటరేచర్ కమిటీ’ చైర్మన్ టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘రీ రిలీజ్‌లోనూ ‘మాయాబజార్’ గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ–‘‘మా నాన్న ఎల్వీ ప్రసాద్, రామారావుగారు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు’’ అని తెలిపారు. ‘‘అలనాటి క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల చేయడం మన బాధ్యత’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. ఈ వేడుకలో వీర శంకర్, భగీరథ, త్రిపురనేని చిట్టి, బలుసు రామారావు తదితరులు పాల్గొన్నారు.