
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చేనెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.