
అప్పట్లో తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన పూనమ్ కౌర్.. ప్రస్తుతం రాజకీయాలు అంటూ తిరుగుతోంది. ఇది కాకుండా ఎప్పుడో ఏదో ట్వీట్ వేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని, అందువల్లే ఇలా మారిపోయానని చెప్పుకొచ్చింది.
తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి పూనమ్ కౌర్.. ఆయనకు ఓ బహుమతిని అందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసి.. తన హెల్త్ ప్రాబ్లమ్ గురించి కూడా బయటపెట్టింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
'గత రెండు రోజులుగా ఫుడ్ ఎలర్జీతో బాధపడుతున్నాను. దీని వల్ల ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కూడా వచ్చింది. అందుకే శరీరం ఇలా ఉబ్బిపోయింది. యాంటీ బయోటిక్స్ కూడా వాడుతున్నా కదా. అందుకే ఇలా' అని పూనమ్ కౌర్ ట్విటర్ లో రాసుకొచ్చింది.
పూనమ్ కౌర్ ఎప్పుడూ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ పై సెటైర్స్ వేస్తూ ట్వీట్స్ పెడుతూ ఉంటుంది. ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనూ త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసింది. కానీ ఇదెక్కడ వరకు వచ్చిందో తెలీదు. ప్రస్తుతానికైతే పూనమ్.. నటిగా ఎలాంటి సినిమాలు చేయట్లేదు. కాకపోతే అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)
