
హీరోల పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల జోష్ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో నటిస్తున్న సినిమాల నుంచి కొత్తపోస్టర్, టైటిల్, టీజర్... ఇలా ఏదో ఒక అప్‌డేట్ వస్తుందని ఆశిస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ హీరో నటిస్తున్న తెలుగు సినిమా అప్‌డేట్ ఏమీ ఉండదు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్).
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్టీఆర్ నీల్’ నుంచి అప్‌డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. ఆ రోజు ఎటువంటి అప్‌డేట్ ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ అప్‌డేట్ రానుండటంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్‌డేట్‌నిపోస్ట్΄ోన్ చేసినట్లు ప్రకటించారు. ఇక ‘వార్’ ఈ ఏడాది ఆగస్టు 14న, ‘ఎన్టీఆర్ నీల్’ 2026 జూన్ 25న రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్, ప్రియమణి జంటగా, మోహన్‌బాబు, మమతా మోహన్‌దాస్ కీలకపాత్రల్లో రూపొందిన చిత్రం ‘యమదొంగ’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని నేడు రీ రిలీజ్ చేస్తున్నారు.