స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా 'గుర్తింపు'.. తెరపైకి రియల్‌ స్టోరీ | Gurthimpu Telugu Movie Poster Launch | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా 'గుర్తింపు'.. తెరపైకి రియల్‌ స్టోరీ

May 24 2025 8:15 PM | Updated on May 24 2025 8:21 PM

Gurthimpu Telugu Movie Poster Launch

స్వస్తిక్ విజన్స్ సమర్పణలో  గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కేజేఆర్ హీరోగా తెన్‌పతియాన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘గుర్తింపు’. స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెన్‌పతియాన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో  కేజేఆర్, సింధూరి విశ్వనాథ్ జంటగా నటిస్తుండగా విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్, రమా, మోహన్ రామ్, ఆంటోనీ, అజిత్ ఘోషి, విమల్, ఇజబెల్లా, షాన్, దీపిక, జానకి, అరుల్ జ్యోతి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

గుర్తింపు  సినిమా పోస్టర్‌ విడుదల తర్వాత నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ.. " పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు క్రీడా రంగంలో ఎదిగిన తీరు, క్రీడా రంగంలో గుర్తింపు కోసం పడిన శ్రమ, చేసిన ప్రయాణం ఎలా ఉంటుందో ఇందులో చూపాం. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లను అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఎమోషనల్ డ్రామాగా ‘గుర్తింపు’ సినిమాను రూపొందిస్తున్నాo. ఇప్పటికి 85 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంతకు ముందు మా సంస్థలో శివ కార్తికేయన్ చిత్రాన్ని 'వరుణ్ డాక్టర్' పేరుతో అనువదించి మంచి విజయాన్ని అందుకున్నాo. ఇటీవల అశ్విన్ బాబు హీరోగా ‘శివం భజే’ చిత్రం నిర్మించాను' అని ఆయన తెలిపారు.  ఈ చిత్రానికి సంగీతం  జిబ్రాన్ అందిస్తున్నారు. కెమెరామెన్‌గా ఎ. విశ్వనాథ్ పనిచేస్తున్నారు. యాక్షన్ ఏపిసోడ్స్‌ పీటర్ హెయిన్ రూపొందించనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement