ఈ చికిత్సతో..పుట్టుమచ్చలకు చెక్‌..! | Beauty Tips: Non-Cancerous Mole Removal Beaumont Minor Surgeries | Sakshi
Sakshi News home page

ఈ చికిత్సతో..పుట్టుమచ్చలను ఈజీగా తొలగించుకోవచ్చు..!

May 25 2025 11:05 AM | Updated on May 25 2025 11:15 AM

Beauty Tips: Non-Cancerous Mole Removal Beaumont Minor Surgeries

పుట్టుమచ్చ అంటే జీవితాంతం ఉండే మచ్చ అన్నట్లుగా ఫీలవుతుంటాం. కానీ పుట్టుమచ్చ నచ్చకుంటే ‘సర్జికల్‌ ఎక్సిషన్‌ ట్రీట్‌మెంట్‌’తో తొలగించవచ్చు. నిజానికి ఈ ట్రీట్‌మెంట్‌ సాధారణంగా వైద్య ప్రక్రియలో చర్మ క్యాన్సర్‌లకు వినియోగించే చికిత్స. అయితే దీన్ని సౌందర్య కారణాల కోసం కూడా వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో, మొదట తొలగించాల్సిన పుట్టుమచ్చ దగ్గర మత్తు ఇంజెక్షన్‌ చేస్తారు. 

దాంతో ఆ భాగం తిమ్మిరిగా మారి, నొప్పి తెలియకుండా అవుతుంది. తర్వాత, ప్రత్యేకమైన శస్త్రచికిత్స పరికరాన్ని ఉపయోగించి పుట్టుమచ్చను, దాని చుట్టూ ఉన్న కొద్ది చర్మాన్ని తొలగిస్తారు. ఇలా చేయడంతో పుట్టుమచ్చ పూర్తిగా పోతుంది. 

తిరిగి వచ్చే అవకాశం 99 శాతం తగ్గుతుంది. తొలగించిన చర్మానికి కుట్లు వేస్తారు. చికిత్స జరిగిన ప్రదేశాన్ని బట్టి కొన్ని రోజుల నుంచి వారాల వరకు ఆ కుట్లు ఉంచుతారు. శస్త్రచికిత్స తర్వాత, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచు కోవడం, వైద్యుడు ఇచ్చిన సూచనలను పాటించడం చాలాముఖ్యం. 

(చదవండి: ఈ డివైజ్‌తో అవాంఛిత రోమాలు మాయం..!)

Advertisement
 
Advertisement
Advertisement