breaking news
moles
-
నల్లటి వలయాలు, పుట్టుమచ్చలను మాయం చేద్దాం ఇలా..!
సాధారణంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, కంప్యూటర్స్ లేదా ఫోన్స్ ఎక్కువగా చూడటంతో కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్), వాపు, ముడతలు ఏర్పడుతుంటాయి. వాటిని తగ్గించుకోవాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పవు. ఇందుకోసం ఈ మెటల్ టూల్ అయిన కళ్ళ మసాజర్ లేదా క్రీమ్ స్పూన్ ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ టూల్‌కి ఒకవైపు బాల్ లాంటి భాగం మరోవైపు స్పూన్ లాంటి ఆకారం ఉంటాయి. క్రీమ్స్, సీరమ్స్ వంటివి వేళ్లతో కాకుండా ఈ టూల్‌తో అప్లై చేసుకుంటే చర్మంపై బాక్టీరియా చేరే అవకాశం తగ్గుతుంది. ఈ స్పూన్.. జింక్ అలాయ్‌తో తయారైంది. ఇది చాలాకాలం మన్నుతుంది. కళ్ళకు వాడే క్రీములు, ఫేస్‌కి వాడే క్రీమ్స్, డ్రై మాస్క్‌లు, లోషన్లు, ఇతర సౌందర్య ఉత్పత్తులు అప్లై చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వచ్చు. ఈ మసాజర్‌తో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది, డబుల్ చిన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు, బ్యాగ్స్ కూడా తగ్గుతాయి. ముఖ కండరాలు రిలాక్స్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ టూల్ చాలా తేలికైనది, చిన్నది కాబట్టి హ్యాండ్‌బ్యాగ్‌లో లేదా జేబులో సులభంగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. క్రమం తప్పకుండా దీనితో మసాజ్ చేయడంతో, ఇది చర్మాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.బెస్ట్ బ్యూటీ ట్రీట్మెంట్!కొన్ని పుట్టుమచ్చలు అందాన్ని తెచ్చిపెడితే, మరికొన్ని పుట్టుమచ్చలు గడ్డల్లా కనిపిస్తూ, ఉన్న అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి వాటిని తొలగించడానికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో షేవ్ ఎక్సిషన్ ట్రీట్మెంట్ ఒక సాధారణ వైద్య పద్ధతి. చర్మంపై ఉన్న పులిపిర్లు, పుట్టుమచ్చలు లేదా చిన్న చిన్న గడ్డలు తొలగించడానికి ఈ చికిత్స సహకరిస్తుంది. ఈ ప్రక్రియలో, ఒక పదునైన బ్లేడుతో చర్మం పైపొరలో ఉన్న పెరుగుదల భాగాన్ని జాగ్రత్తగా ‘షేవ్’ చేస్తారు. ఇది లోతైన కోత కాదు, కాబట్టి సాధారణంగా కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ప్రక్రియ ఎలా జరుగుతుందంటే.. ముందుగా, ఆ ప్రాంతానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, కాబట్టి నొప్పి తెలియదు. అనంతరం ఒక ప్రత్యేకమైన బ్లేడుతో చర్మంపై ఉన్న గడ్డను జాగ్రత్తగా షేవ్ చేస్తారు. కొద్దిగా రక్తం కనిపించే అవకాశం ఉంటుంది, దాన్ని ఆపడానికి విద్యుత్తు లేదా రసాయనాలను ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ఆ ప్రాంతాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ వైద్య నిపుణుడి సమక్షంలోనే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం. (చదవండి: World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..) -
ఈ చికిత్సతో..పుట్టుమచ్చలకు చెక్..!
పుట్టుమచ్చ అంటే జీవితాంతం ఉండే మచ్చ అన్నట్లుగా ఫీలవుతుంటాం. కానీ పుట్టుమచ్చ నచ్చకుంటే ‘సర్జికల్ ఎక్సిషన్ ట్రీట్మెంట్’తో తొలగించవచ్చు. నిజానికి ఈ ట్రీట్మెంట్ సాధారణంగా వైద్య ప్రక్రియలో చర్మ క్యాన్సర్లకు వినియోగించే చికిత్స. అయితే దీన్ని సౌందర్య కారణాల కోసం కూడా వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో, మొదట తొలగించాల్సిన పుట్టుమచ్చ దగ్గర మత్తు ఇంజెక్షన్ చేస్తారు. దాంతో ఆ భాగం తిమ్మిరిగా మారి, నొప్పి తెలియకుండా అవుతుంది. తర్వాత, ప్రత్యేకమైన శస్త్రచికిత్స పరికరాన్ని ఉపయోగించి పుట్టుమచ్చను, దాని చుట్టూ ఉన్న కొద్ది చర్మాన్ని తొలగిస్తారు. ఇలా చేయడంతో పుట్టుమచ్చ పూర్తిగా పోతుంది. తిరిగి వచ్చే అవకాశం 99 శాతం తగ్గుతుంది. తొలగించిన చర్మానికి కుట్లు వేస్తారు. చికిత్స జరిగిన ప్రదేశాన్ని బట్టి కొన్ని రోజుల నుంచి వారాల వరకు ఆ కుట్లు ఉంచుతారు. శస్త్రచికిత్స తర్వాత, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచు కోవడం, వైద్యుడు ఇచ్చిన సూచనలను పాటించడం చాలాముఖ్యం. (చదవండి: ఈ డివైజ్‌తో అవాంఛిత రోమాలు మాయం..!) -
పుట్టుమచ్చలు చూపాలంటూ వేధింపులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/తనకల్లు: పుట్టుమచ్చలు చూపాలంటూ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడి లీలలు ఆలస్యంగా వెలుగుచూశాయి. విచారణ జరిపిన అధికారులు ఆయనను గురువారం సస్పెండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లగుట్లపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవీ ఆదినారాయణ ఇన్చార్జ్ హెడ్మాస్టర్. పుట్టుమచ్చలు చూపాలంటూ కొన్ని రోజులుగా 8, 9, 10 తరగతి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారు. ఆయనకు భయపడిన విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పలేకపోయారు. కాగా, జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధితో పాఠశాలకు చెందిన ఓ బాలిక తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో ఆ ప్రతినిధి ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ ఉపాధ్యాయుడి వ్యవహారశైలిని పరిశీలించి, అతడి అకృత్యాలు నిజమేనని నిర్ధారించుకున్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపి జీవీ ఆదినారాయణను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆదినారాయణపై పోక్సో కేసు నమోదు చేయాలని ఎంఈవో లలితమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల రాజీ యత్నం ఉపాధ్యాయుడు జీవీ ఆదినారాయణ భార్య రామలక్ష్మి గతంలో టీడీపీ ఓబుళదేవర చెరువు మండలం జెడ్పీటీసీగా పనిచేశారు. ఇప్పటికీ టీడీపీలో క్రియాశీలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును నీరుగార్చేందుకు శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ ముఖ్యనేత ఒకరు తీవ్రంగా యత్నిస్తున్నారు. జీవీ ఆదినారాయణ వయసు ప్రస్తుతం 61 ఏళ్లు కావడం, కేసు బలంగా ఉంటే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు రావన్న ఉద్దేశంతో కేసు నీరుగార్చేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బాలికల తల్లిదండ్రులతోనూ రాజీ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్స్‌గా మారే అవకాశం!
ప్రతి మనిషికీ పుట్టుమచ్చలు ఉండనే ఉంటాయి. సాధారణంగా పుట్టుమచ్చలేవీ ప్రమాదకరం కాదు. అయితే కొన్నిసార్లు అవి కూడా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అలా అవి ఎప్పుడు ప్రమాదకరంగా మారతాయి అనే విషయంలో ఓ కొండగుర్తు ఉంది. అదే... పుట్టుమచ్చల తాలూకు ‘ఏ, బీ, సీ, డీ’లు. వాటి గురించి తెలుసుకుందాం. ►ఏ అంటే ఎసిమెట్రీ – చర్మంపైన మచ్చ సౌష్ఠవాన్ని (సిమెట్రీని) కోల్పోవడం. ►బీ అంటే బార్డర్ – మచ్చ అంచులు మారడం. అవి ఉబ్బెత్తూగా ఉండటం. ►సీ అంటే కలర్ వేరియేషన్ – మునుపు ఉన్న రంగు మారడం. ►డీ అంటే డయామీటర్ – దాని వ్యాసం ఆరు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అలాంటి కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్స్‌గా మారే అవకాశాలు ఎక్కువ. అంటే పై ఏ, బీ, సీ, డీల జాగ్రత్తలను గమనించి ఆ మేరకు తేడాలుంటే వెంటనే డాక్టర్ / డర్మటాలజిస్ట్‌ను కలవాలి. -
రాహుల్ రేప్‌లను ఆహ్వానిస్తున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు చేసిన ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై లోక్‌సభ దద్దరిల్లింది. యావత్ భారతదేశాన్ని, ఆర్థిక ప్రగతిని కించపరిచేలా ఆయన వ్యాఖ్యానించారంటూ సభలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. రాహుల్ రేప్‌లను ఆహ్వానిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపిస్తే, పార్లమెంటులో కొనసాగే నైతిక హక్కు రాహుల్‌కి లేదని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారరాహుల్ గాంధీ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే భారత్ ‘రేప్ ఇన్ ఇండియా’గా మారుతోందని అన్నారు. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మహిళా ఎంపీలు రాహుల్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఓం బిర్లా రెండు సార్లు సభని వాయిదా వేసినా పరిస్థితి చక్కబడలేదు. దీంతో ఆయన సభని నిరవధికంగా వాయిదా వేశారు. శుక్రవారంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభలో రాహుల్‌ని గట్టిగా నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలు చూస్తే దేశంలో మహిళలపై అత్యాచారం చేయాలని పిలుపునిస్తున్నట్టుగా ఉందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్మృతి ఇరానీకి మద్దతు నిలిచారు. రాహుల్‌కు మద్దతుగా కనిమొళి.. బీజేపీ సభ్యులు సభలో తీవ్రంగా దాడి చేయడంతో రాహుల్‌కు ఎంపీ కనిమొళి మద్దతు పలికారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడడానికి స్పీకర్ అనుమతించకపోవడంతో ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. బీజేపీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని తాను క్షమాపణ చెప్పనని అన్నారు. ఈసీకి బీజేపీ ఫిర్యాదు రాహుల్ అత్యాచార వ్యాఖ్యల్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో బీజేపీ మహిళా ఎంపీలు కేంద్ర ఎన్నిక సంఘాన్ని సంప్రదించారు. రాహుల్ అత్యాచారాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. వీలైనంత మేర ఆయనకు కఠిన శిక్ష విధించాలని ఈసీని కోరారు. చట్టబద్ధమైన పక్రియలన్నీ పూర్తయ్యాక తాము తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చినట్టు ఇరానీ వెల్లడించారు. -
ధనుష్ సర్టిఫికేట్లు ఫేక్!
ఆయన కోర్టుకు సమర్పించిన జన్మధ్రువపత్రంలో పేరు లేదు వృద్ధ దంపతుల లాయర్ స్పష్టీకరణ ప్రముఖ తమిళ హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ వృద్ధ దంపతులు వేసిన కేసు కొత్త మలుపుతిరిగింది. పుట్టుకతో శరీరంపై వచ్చిన మచ్చలను వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ.. లేజర్ చికిత్సతో పుట్టుమచ్చలను మాయం చేయవచ్చునని, ఇప్పుడు తమిళ హీరో ధనుష్ ఆ పనే చేశాడని వైద్యులు కోర్టులో స్పష్టం చేయడంతో రజనీకాంత్ అల్లుడైన ఈ హీరోకి కోర్టులో చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. లేజర్ చికిత్సతో ధనుష్ తన పుట్టుమచ్చలు తొలగించుకున్నాడని డాక్టర్లు కోర్టుకు సమర్పించిన నివేదికతో స్పష్టమైందని వృద్ధ దంపతుల తరఫు న్యాయవాది మంగళవారం మీడియాకు తెలిపారు. కోర్టులో ధనుష్ సమర్పించిన జన్మధ్రువపత్రం జీరాక్స్ లో అతని పేరు లేదని, కాబట్టి ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ కాదేమోనని అనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ధనుష్ తమ కొడుకేనంటూ తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వృద్ధ దంపతుల వాదనల్లో నిజం లేదని ధనుష్ పేర్కొనడం కోర్టుకు తెలిపాడు. పలుమార్లు విచారణ జరిపిన అనంతరం కదిరేశన్ దంపతులు కోరినట్టు ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్ చికిత్స ద్వారా పుట్టుమచ్చలను రూపుమాపారని సోమవారం కోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. దీంతో కదిరేశన్ దంపతుల వాదన నిజమే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. -
పుట్టుమచ్చలు చెరిపేశాడు
పుట్టుకతో శరీరంపై వచ్చిన మచ్చలను మాయం చెయ్యొచ్చా? అనడిగితే... చేసేయొచ్చు. వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ... లేజర్ చికిత్సతో పుట్టుమచ్చలను మాయం చేయవచ్చు. ఇప్పుడు తమిళ హీరో ధనుష్ ఆ పనే చేశాడని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అతడికి కోర్టులో చిక్కులు తప్పేట్లు కనిపించడం లేదు. ధనుష్ తమ కుమారుడేనని తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం... వాళ్ల వాదనల్లో నిజం లేదని ధనుష్ పేర్కొనడం తెలిసిన విషయాలే. పలుమార్లు విచారణ జరిపిన అనంతరం కదిరేశన్ దంపతులు కోరినట్టు ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్ చికిత్స ద్వారా పుట్టుమచ్చలను రూపుమాపారని సోమవారం కోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. దీంతో కదిరేశన్ దంపతుల వాదన నిజమే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.