Jayashankar
-
‘వంటావార్పు’ను విజయవంతం చేయాలి
మొగుళ్లపల్లి: భూపాలపల్లి సర్కిల్ ఆఫీస్ ఎదుట నేడు (గురువారం) నిర్వహించనున్న వంటావార్పు కార్యక్రమాన్ని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు అన్మ్యాన్డ్, స్పాట్ బిల్డర్స్, పీస్ రేటు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని టీవీఏఈ విద్యుత్ జేఏసీ భూపాలపల్లి డివిజన్ జాయింట్ సెక్రటరీ వేముల కిరణ్‌గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఏప్రిల్ 8 నుంచి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: గత ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాకు 46.54 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 74 శాతం బొగ్గు ఉత్పత్తిని వెలికితీశారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 55 వేల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. ఏరియాకు మొత్తం 46.54 లక్ష టన్నుల లక్ష్యానికి 34.22 లక్ష టన్నులు మాత్రమే సాధించి 74 శాతంలో నిలిచామన్నారు. కేటీకే–1 గని 71 శాతం, కేటీకే–5, కేటీకే–6 గనులు 49 శాతం చొప్పున, కేటీకే–8 గని 44 శాతం సాధించాయి. కేటీకే ఓసీ–2 గని 97 శాతం, ఓసీ–3 గని 69 శాతం సాధించాయన్నారు. గతేడాదిలో ఏరియాకు రూ.703 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. ఓపెన్ కాస్ట్–2, 3 గనుల్లో ఉత్పత్తి పూర్తి స్థాయిలో రాకపోవడంతో రూ.149 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్దేశించిన 46 లక్షల టన్నుల లక్ష్యాలను చేరుకోవాలంటే కార్మికులు ఉద్యోగులు సమష్టిగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, ఐఈడీ జ్యోతి, డీజీఎం ఫైనాన్స్ రాజేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ శ్యాంప్రసాద్, డీవైపీఎం శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: టీపీసీసీ సాంస్కృతిక సేన జిల్లా కమిటీని జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నియామక పత్రం అందించారు. అధ్యక్షుడిగా గడ్డం రమేశ్ చంద్ర, ప్రధాన కార్యదర్శి రజినికాంత్, ఉపాధ్యక్షుడు దేవేందర్, కోశాధికారి ప్రతాప్, కార్యదర్శులుగా నరేశ్, రాజ్‌నాయక్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. భూపాలపల్లి అర్బన్: జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గత నెలలో జరిగిన కోల్ ఇండియా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1వ గనికి చెందిన పోగుల శంకరయ్య విశిష్ట ప్రతిభ కనబరిచారు. 45 ఏళ్ల వయో విభాగం డబుల్స్‌లో పాల్గొని మొదటి స్థానం సాధించి బంగారు పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి శాలువా, బహుమతులతో శంకరయ్యను ఘనంగా సన్మానించారు. కోల్ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి సంస్థకు ప్రథమ స్థానం తీసుకురావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, ఏజీఎం జ్యోతి, డీజీఎం రాజేశ్వర్, పర్సనల్ మేనేజర్ సల్ల శ్యామ్‌సుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రవణ్‌కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగి వరి సాగు చివరి దశకు చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పటిలాగే ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత యాసంగిలో 97,570 ఎకరాల్లో వరి సాగైంది. మరో 15 రోజుల్లో వరికోతలు ప్రారంభం కానుండటంతో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దిగుబడి అంచనా.. జిల్లాలో యాసంగి సీజన్లో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 80 శాతం దొడ్డు ధాన్యం, 20 శాతం సన్నధాన్యం రానున్నట్లు అధికారులు అంచనా వేశారు, పెరగనున్న కొనుగోలు కేంద్రాలు యాసంగి సీజన్లో దిగుబడి అధికంగా వస్తున్నందున దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం 160 కొనుగోలు కేంద్రాల వరకు ఏర్పాటు చేయగా ఈసారి 185 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి ఎక్కడైతే ధాన్యం అధికంగా వస్తుందో అక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ప్రధాన శాఖల అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. యాసంగి కొనుగోళ్లలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లులకు ధాన్యం లేదు.. జిల్లాలో మూడు మిల్లులు బ్లాక్ లిస్టులో ఉన్నందున ఆ మిల్లులకు పోయే ధాన్యాన్ని ఇతర మిల్లులకు మళ్లించి కొనుగోళ్లు చేపట్టనున్నారు. ధాన్యం రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మిల్లుల ఎంపిక, లారీల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించనున్నారు. తూకం యంత్రాలతో పాటు టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, టెంట్లు, ఇతర పరికరాలను సమకూర్చుతున్నారు. జిల్లాకు 3 లక్షల వరకు వరకు గన్నీ బ్యాగులు అవసరం ఉంటాయని అంచనా వేశారు. అందులో ఇప్పటికే జిల్లాలో 20 లక్షల వరకు గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నా యి. మిగతా వాటిని సమకూర్చుకునే కార్యాచరణపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. 185 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు 1.60 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం -
అభివృద్ధి పనుల పరిశీలన
పలిమెల: మండలంలోని చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి బుధవారం పరిశీలించారు. పలిమెల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి జూన్ 2వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ నర్సరీని సందర్శించి పలు సూచనలు చేశారు. పలిమెల పల్లె దవాఖానాను సందర్శించి ప్రారంభోత్సవానికి 99 రోజుల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే నీలంపల్లి గ్రామ పంచాయతీలోని సబ్ సెంటర్ నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ సాయిలు, ఎంపీడీఓ రవీంద్రనాథ్, మెడికల్ ఆఫీసర్లు కల్యాణి, రఘురాం, ఏపీఎం రాజలింగం తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ తనిఖీ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్పల్లి లోని పీహెచ్‌సీని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం పీహెచ్‌సీలోని వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆమె వెంట జిల్లా వైద్యాధికారి మధుసూదన్, డాక్టర్ కల్యాణి, జగదీష్ కన్నా త దితరులు ఉన్నారు. -
పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సరస్వతి అంత్య పుష్కరాల పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఘాట్ల అభివృద్ధి, రహదారుల మరమ్మతు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ, దేవాదాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు కేటాయించిన పనులను సమన్వయంతో నిర్వహించి, నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఇరిగేషన్, పీఆర్, విద్యుత్, మిషన్ భగీరథ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
నల్లబ్యాడ్జీలతో నిరసన
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే నాలుగు లేబర్ కోడ్స్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (ిసీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని కేటీకే–5 గనిలో నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య మాట్లాడుతూ నూతనంగా కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్ల అమలుతో కార్మికులకు, కార్మిక సంఘాలకు ఎటువంటి చట్టపరమైన హక్కులు లేకుండా పోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, బాబురావు, రమేష్‌లు పాల్గొన్నారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ) డిమాండ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఏరియాలోని ఓపెన్‌కాస్ట్–2, 1వ గనుల్లో కార్మికులకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం గనుల మేనేజర్లకు వినతి పత్రాలు అందించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, డివిజన్ అధ్యక్షుడు సమ్మయ్య, కార్యదర్శి నర్సింగ్, నాయకులు నవీన్, దుర్గం సమ్మయ్య, అర్జున్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ సందడి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో ‘సంస్థాగత’ సందడి కొనసాగుతోంది. ప్రభుత్వం, ప్రజలకు వారధిగా ఉండేలా కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పాత కమిటీలను రదు చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులు.. వార్డు, డివిజన్ కమిటీలనుంచి పూర్తిస్థాయి జిల్లా కమిటీలను వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో సీనియర్ కాంగ్రెస్ నాయకులను పరిశీలకులుగా నియమించారు. హనుమకొండ జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ మాసాంతానికల్లా అన్ని స్థాయిల్లో సంస్థాగత కమిటీలు వేయాలన్న హైకమాండ్ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను సంప్రదించి కమిటీలను రూపొందిస్తున్నారు. జిల్లా కమిటీల్లో 31 నుంచి 51 మందికి ప్రాతినిధ్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కమిటీ కార్యవర్గం ఈ నెలాఖరుకు ఖరారు కానుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తవగా... పూర్తిస్థాయి కమిటీలను వేయలేదు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 14 జిల్లాల్లో పూర్తి స్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృత స్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో పెండింగ్‌లో ఉండగా.. ఇటీవల కసరత్తు మొదలైంది. ఈ క్రమంలోనే వా ర్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు మొదలు పూర్తి స్థా యి జిల్లా కమిటీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన జరుగుతోంది. చాలా జిల్లాల్లో జిల్లా కమిటీలు జెంబోజెట్లుగా ని యామకాలు చేశారన్న ఆరోపణలు ఉండగా.. ఉమ్మడి జి ల్లాలో మాత్రం చిన్న జిల్లాలుంటే 31.. పెద్ద జిల్లాలైతే 51 మందికి మించకుండా ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించా రు. ఇందుకోసం డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లను సంప్రదించి జాబి తాలు రూపొందించే పనిలో ఉండగా.. ఈ నెల 8న కీలక స మావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేలా పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పారదర్శకంగా జరుగుతోంది. అన్ని స్థాయిల కమిటీల్లో సామాజిక ప్రాతినిధ్యం ఉంటుంది. మహిళలకు 30 శాతం అవకాశాలు తప్పనిసరి చేశాం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం మార్గదర్శకాల మేరకు కమిటీలు పని చేస్తాయి. పార్టీ సిద్ధాంతాల పునశ్చరణ, గాంధీజీ ఆశయాల సాధన, క్రమశిక్షణ కలిగిన నాయకత్వ నిర్మాణం కోసం వారం వారం ‘సర్వోదయ చరక అభ్యాస్’ ప్రత్యేక శిక్షణ అన్ని స్థాయిల నాయకులకు ఉంటుంది. – ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, హనుమకొండ జిల్లావార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీల తర్వాత జిల్లా కమిటీలను పూర్తిస్థాయిలో నియమించనున్నారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత దక్కేలా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండేలా, పార్టీ బలోపేతం దృష్ట్యా మండల స్థాయి కార్యవర్గాల్లో 35 సంవత్సరాల పైబడిన వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు కనీసం మూడేళ్లపాటు పార్టీకి చురుకై న సేవలు అందించిన వారికి కూడా తగిన గుర్తింపు ఇవ్వనున్నారు. జిల్లా పరిధిలోని రెండేళ్లు పూర్తి చేసుకున్న మండల, మునిసిపల్, కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులను ఈసారి తప్పనిసరిగా మార్చాలని నిబంధన పెట్టుకున్నారు. ఈ మేరకు వార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇదివరకున్న కమిటీలను రద్దు చేసిన డీసీసీలు గ్రామస్థాయి నుంచి కమిటీలు.. మండలాల వారిగా పరిశీలకులు జిల్లా కమిటీలో 31 నుంచి 51 మందికి ప్రాతినిధ్యం పల్లెల్లో మొదలైన కాంగ్రెస్ కమిటీల సందడి ఏప్రిల్ మాసాంతానికల్లా పూర్తిస్థాయి కమిటీలు? -
మున్సిపల్ బడ్జెట్ రూ.100.87 కోట్లు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంస్థ 2026–27 సంవత్సరపు ముసాయిదా బడ్జెట్‌ను మంగళవారం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టారు. అదనపు ఇన్చార్జ్ కలెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చైర్మన్ బుర్ర కొమురయ్య, కమిషనర్ ఉదయ్‌కుమార్ సమక్షంలో కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. అంచనా బడ్జెట్ రూ.100.87కోట్లు నిర్ణయించి ప్రకటించారు. సాధారణ ఆదాయం రూ.11.32కోట్ల 50 వేలు, గ్రాంట్ల నిధుల ఆదాయం రూ.88.28కోట్లుగా నిర్ణయించారు. ఏప్రిల్ 1, 2026 నాటికి మిగులు బడ్జెట్ కింద ప్రారంభ విలువ రూ.7కోట్ల 1లక్ష 99వేలు చూపించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ గతేడాది రూ.31.17కోట్ల 64 వేలుగా అంచనా వేయగా, మార్చి 31నాటికి అయిన ఖర్చు రూ.21.04కోట్ల 64వేలుగా వివరించారు. ఆదాయం రూ.11.32కోట్లు మున్సిపల్ పన్నులు, ఇతరత్రాల రూపంలో రూ.11,32కోట్ల 50వేల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో పన్నుల రూపంలో రూ.7.74 కోట్లు, కేటాయించిన ఆదాయాలు అద్దె ద్వారా రూ.51.50లక్షలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య విభాగం రశీదుల ద్వారా రూ.68లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం రశీదుల ద్వారా రూ.1.92కోట్లు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.46.50లక్షలు, మొత్తం రూ.50.37 కోట్ల ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు. వీటితో పాటు కాపిటల్ ఫండ్ (సీపీఎస్) నాన్ ప్లాన్ నిధులు రూ.88,28 కోట్లు, డిపాజిట్లు రుణాలు రూ.1.26కోట్లు మొత్తంగా పన్ను వనరులు, కాపిటల్ ఫండ్ నిధులన్ని కలిపి రూ.10.087కోట్ల బడ్జెట్‌గా అంచనా వేశారు. వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ వ్యయం, ఇంజినీరింగ్ విభాగాల నిర్వహణ, సాధారణ పరిపాలన, పట్టణ ప్రణాళిక విభాగం, వసతులు, వార్డులవారీగా నాన్‌ప్లాన్, ప్రణాళిక, ఇతర నిధుల ఖర్చు అంచనా వేశారు.ఆదాయ వనరులు పెంచాలి.. మున్సిపల్ అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులు సహకరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదాయ వనరులపై పాలకవర్గ సభ్యులు దృష్టిసారించాలన్నారు. పట్టణంలో వనరులను సృష్టించుకోవడం వలన అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని సవరించాలని అధికారులకు, వచ్చే సమావేశంలో సభలో చర్చించాలని కౌన్సిలర్లకు సూచించారు. శానిటేషన్ విభాగానికి నిధులు పెంచాలని, వినియోగంలోని సులబ్ కాంప్లెక్స్‌లకు నిధులు ఎందుకు కేటాయించారని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. -
ఎక్స్పైరీ అమ్మకాలు
భూపాలపల్లి అర్బన్: ప్రజారోగ్యం గాలికి వదిలేసి, కాసులే పరమావధిగా కొందరు వ్యాపారులు బరితెగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కాలంచెల్లిన ఆహార పదార్థాలు, పానీయాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలో ఎక్స్పైరీ తేదీ ముగిసి రెండు నెలలవుతున్నా దానిని వినియోగదారులకు అంటగడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. చూసి కొనాల్సిందేనా.. సాధారణంగా ఏదైనా ఆహార వస్తువు కొనే ముందు వినియోగదారులు దానిపై ఉన్న తయారీ, గడువు తేదీలను గమనించాలి. నమ్మకంతో కొనే వారిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు జిల్లాలో పాత స్టాక్‌ను విక్రయిస్తున్నారు. తాజాగా జిల్లాకేంద్రంలోని జయశంకర్ సెంటర్లోని ఓ కిరాణం దుకాణంలో లభ్యమైన బిస్కెట్ ప్యాకెట్లకు 2026 జనవరి వరకు మాత్రమే గడువు ఉంది. పలు బిస్కెట్ ప్యాకెట్లు, కూల్‌డ్రింక్స్ బాటిళ్ల గడువు ముగిసిపోయినవి దుకాణంలో ఉన్నాయి. ఏప్రిల్ నెల వచ్చినా ఇంకా పాత వస్తువులను దుకాణాలలో ఉంచి విక్రయించడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిస్తుంది. మరో సూపర్మార్కెట్లో 2025 అక్టోబర్ 28వ తేదీతో గడువు ముగిసిన బ్రూ కాఫీ ఫౌడర్ దర్శనమిస్తుంది. గడువు ముగిసిన పదార్థాలు, పానియాలు సేవించడంతో ఫుడ్ పాయిజన్, వాంతులు, విరేచనాలు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో చిన్నారులు యువత కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇంత జరుగుతున్నా సంబంధింత ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు జిల్లాకేంద్రంలో కిరాణా దుకాణాలు, సూపర్మార్కెట్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్ విక్రయాలు చేపడుతున్నారని వరల్డ్ కన్సుమర్ రైట్ సభ్యులు సోమవారం కలెక్టర్ రాహుల్‌శర్మకు ఫిర్యాదు చేశారు. విచ్చల విడిగా గడువు ముగిసిన వస్తువులను అమ్మకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గడువు ముగిసిన బిస్కెట్ ప్యాకెట్లు, కూల్‌డ్రింక్స్ బాటిళ్ల ఫొటోలను ఆధారాలతో కలెక్టర్‌కు అందించారు. అధికారులు స్పందించేనా.. ఎక్స్పైరీ ముగిసిన వస్తువులను అమ్ముతున్నా.. ఫిర్యాదులు వస్తేనే అధికారులు స్పందిస్తారా లేదా విధి నిర్వహణను నెరవేరుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ, తనిఖీ అధి కారులు ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గడువు తేదీ ముగిసిన వస్తువులను వినియోగదారులకు అమ్మడం నేరం. తేది ముగిసిన వస్తువులు అమ్మకాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పలు దుకాణదారులకు నోటీసులు జారీ చేశాం. మరోసారి జరిగితే చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు గమనించి ఫిర్యాదు చేయాలి. – జి.వరుణ్‌రెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కిరాణా షాపులు, హోటళ్లు, కూల్ డ్రింక్ ఏజెన్సీలలో నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు కార్యాలయానికే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాఽధికారులు స్పందించి జిల్లాకేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు -
బాధితులకు న్యాయం చేయాలి
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: ప్రతీ కేసులో నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలోని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. విచారణలో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. వెంకట్‌రెడ్డి సేవలు మరువలేనివి.. గంట వెంకట్‌రెడ్డి 36 ఏళ్ల పాటు పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డి మంగళవారం ఉద్యోగ విరమణ పొందగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
● అకాల వర్షంతో రైతులకు నష్టం కాళేశ్వరం/చిట్యాల: మంగళవారం తెల్లవారుజామున మహదేవపూర్, చిట్యాల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం జరిగింది. కాళేశ్వరం, అన్నారం, పలుగుల, చండ్రుపల్లి గ్రామాల్లో చేతికొచ్చిన పంటలు నేలమట్టమయ్యాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. కొన్ని చోట్ల మిర్చిపై పట్టాలు కప్పివేయడంతో వర్షపు నీరు నిలిచింది. చిట్యాల మండలం గుంటురుపల్లి, గోపాలపూర్తో పాటు పలు గ్రామాల శివారులలో మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. వరి పంట కోతకు వచ్చే సమయంలో ఈదురుగాలులు వీచి పంట నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుంటురుపల్లి శివారులో వీరవేని గణేష్ ఏడెకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా.. నాలుగెకరాల పంట నేలమట్టమైంది. గోపాలపూర్‌లో బోగం నర్సయ్య మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. అధికారులు పంటలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. -
అరవింద్‌సాయికి జాతీయ అవార్డు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు రామగిరి అరవింద్‌సాయి ప్రతిష్టాత్మకమైన అండర్ 25 జాతీయ అవార్డును అందుకొని జిల్లా ప్రతిష్టను పెంచాడు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ‘యువ భారత్ రన్’ కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్ ట్రైబ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) ద్వారా సమాజానికి చేసిన విశేష సేవలు, యువతకు ప్రేరణగా నిలిచే కార్యక్రమాలను గుర్తిస్తూ అవార్డును అందించారు. ఈ అవార్డును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సినీ నటుడు శర్వానంద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ ఘనత సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, స్వర్ణకార సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి కృషి
భూపాలపల్లి: ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షిస్తూ సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు అందించిన వివరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన 353 కేసులు పరిష్కారం అయినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన జిల్లాలోని పోలీసు అధికారులు, కోర్టు, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
‘కాళేశ్వరం’ ట్రస్టుబోర్డు నియామకం
కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ రెండేళ్ల కాలపరిమితితో ఉత్తర్వులు జారీచేశారు. 12 మంది సభ్యులతో పాలకవర్గం ఏర్పడనుంది. సభ్యులుగా దొడ్ల అశోక్, కుంభం పద్మ, అడ్డూరి శ్రీధర్‌రావు, బీసుల నర్సయ్య, మంచినీళ్ల దుర్గయ్య, గంధెసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, అవధాని మోహన్‌శర్మ, జలవంచ సీతారాం, కె.సత్తయ్య, డి.శ్యాంసుందర్ నియమితులయ్యారు. ఎక్స్అఫీషియోగా ఉప ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మను నియమించారు. చైర్మన్‌గా అవధాని మోహన్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. సభ్యుల కుదింపు.. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 15 మంది సభ్యులతో పాలకవర్గం ఉండగా, ప్రస్తుతం 12 మందికే పరిమితం చేయడంతో కొంతమంది ఆశావహులు నిరాశకు గురయ్యారు. గతేడాది నవంబర్ 15న నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, పలుమార్లు వాయిదాల తర్వాత చివరకు నియామక ఉత్తర్వులు వెలువడటంతో ఎంపికై న వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. 27 నెలలుగా పాలకవర్గం లేకపోవడం గమనార్హం. కాళేశ్వరంపై మంత్రి చూపు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేసి కాళేశ్వరం రూపురేఖలు మార్చేందుకు బృహత్తర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కాళేశ్వరం పర్యటన సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు జరిగే ప్రాంతాలకు రూ.500కోట్ల నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఆ నిధులతో పలు అభివృద్ధి జరుగనుంది.ట్రస్టుబోర్డుకు రెండు పుష్కరాలు.. ట్రస్ట్ బోర్డు ముందున్న ముఖ్య బాధ్యతల్లో ఈ ఏడాది మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు, వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 6 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ ప్రధానంగా ఉన్నాయి. దేవస్థానం అభివృద్ధికి ఈ కొత్త పాలకవర్గం కీలకంగా మారనుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
జన గణన సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు: జన గణన–2027 మొదటి విడతలో భాగంగా చేపట్టనున్న జన గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్, జనగణన సంచాలకులు భారతి హోళీకేరి సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్‌లో జన గణన, ఇళ్ల గణన, మ్యాప్ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల గణన ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులందరూ పూర్తి అవగాహనతో పని చేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గణన చేపట్టాలని సూచించారు. దేశంలో తొలిసారిగా జన గణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతీ కుటుంబానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. సన్నాహక చర్యలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాప్ నిర్వహణలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని, గణన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం చేపట్టాలని తదితర అంశాలపై సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో జన గణన–2027 మొదటి విడత ఇళ్ల గణన కార్యక్రమాన్ని సమన్వయంతో సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకేరి -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
● జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి ప్రేమలత ఏటూరునాగారం/కన్నాయిగూడెం: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి ప్రేమలత అన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలల హక్కులను పరిరక్షించేందుకు సంబంధిత చట్టాలపై సోమవారం అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రైతులు, భవన నిర్మాణ కార్మిక యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం(డీసీపీయూ), చైల్డ్‌హెల్ప్‌లైన్ (సీహెచ్ఎల్), ఉమెన్ హబ్ సంయుక్తంగా ప్రత్యేక బృందాలుగా విడిపోయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు. బాలల హక్కుల పరిరక్షణకు కలెక్టర్ దివాకర ఆదేశాల ప్రకారం మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య సిబ్బంది వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. రైతులకు నోటీసులు జారీ చేశారు. 14 నుంచి 18ఏళ్ల బాలలను పనుల్లో పెట్టుకోవద్దని తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా సుమారు వంద మంది రైతులకు నోటీసులు అందజేసినట్లు వెల్లడించారు. బాలల హక్కులపై అవగాహన కల్పించినట్లు వివరించారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బాలలు తప్పకుండా విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ అబ్బనబోయిన నరేశ్, సూపర్వైజర్ సుదర్శన్, బాలల పరిరక్షణ విభాగం అధికారులు సంజీవ, జ్యోతి, మహిళా శక్తి సాధికారిత జిల్లా అధికారి రమాదేవి పాల్గొన్నారు. -
మక్కల కొనుగోళ్లలో జాప్యం
మహబూబాబాద్ రూరల్ : మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మక్కలను మార్కెట్ యార్డులో విక్రయానికి తీసుకువస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్క్‌ఫెడ్ అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో మక్కలకు మద్దతు ధర రూ.2,400 అందడంలేదని, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి క్వింటాకు ధర రూ.1,800 చెల్లిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. కాగా, ఆందోళనతో మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచిపోగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ ప్రమోద్కుమారును నిర్బంధించారు. ఆగ్రహించిన అన్నదాతలు ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ నిర్బంధం -
ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటులో నిర్లక్ష్యం వద్దు
భూపాలపల్లి: ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు పురోగతిపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, ప్రణాళిక, వైద్య, టీజీఎంఐడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అవసరమైన పరికరాల కొనుగోలుకు అడ్వాన్స్ మంజూరు చేశామని, పనుల్లో జాప్యం జరిగితే సహించమన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, జిల్లా అధికారులు, జిల్లా ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి.. ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామసభలకు ఏర్పాట్లు చేయాలి.. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని దివ్యాంగులు సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నూతన సదరం, యూడీఐడీ కార్యాలయాన్ని జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరం శిబిరాలకు వచ్చే దివ్యాంగుల కోసం ఆస్పత్రిలో మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సులభంగా సదరం, యూడీఐడీ సర్టిఫికెట్లు పొందడంతో పాటు వాటి ద్వారా లభించే ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, డీపీఎం రవి, సదరం ఆపరేటర్ పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రం ఇన్చార్జ్ ఈఓగా వీరస్వామి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి(ఈఓ)గా వీరస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రేవెల్లి మహేశ్ స్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థానం ఇన్చార్జ్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న వీరస్వామిని మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఇన్చార్జ్ ఈఓగా నియమిస్తూ దేవాదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు వీరస్వామి సోమవారం హేమాచలుడిని దర్శించుకుని ఆయన బాధ్యతలను స్వీకరించినట్లు తెలిపారు. -
రూ. 396.69 కోట్లు
కేయూ అంచనా బడ్జెట్కేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13 కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్‌లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47 కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ 126.52 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్‌ను ప్లానింగ్, నాన్‌ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొ త్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10 లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50 లక్షలు, అకడమిక్, ట్యూషన్ ఫీజుల రూ పంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్.. బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్ కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది.కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభా గాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపంగా నివాళులర్పిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది.దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఒరియెంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ‘ఐ’ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫె ల్లోలుగా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పా టు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీక్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిటలీకరణ, క్యాంపస్‌లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. –కె. ప్రతాప్‌రెడ్డి, వీసీ అకడమిక్ సెనెట్‌లో ఆమోదం -
ఆర్టిజన్లు సమ్మెకు వెళ్తే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఇనుగాల శ్రీధర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్లు న్యాయమైనవన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించి అర్హతను బట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మన్నె శశికుమార్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, టీఎస్‌ఈఈయూ–327 నాయకులు పి.మహేందర్ రెడ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, టీఆర్వీకెఎస్ నాయకులు బండారి ప్రభాకర్, నరేందర్ పాల్, టీఆర్‌పీఈయూ నాయకులు రావుల రమణారెడ్డి, కడెం మహేశ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ సికిందర్, ట్రాన్స్ కోవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు ఎన్.రాంబాబు, పూర్ణాచారి, సతీశ్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సృజన, రాకేశ్, శ్రీధర్ పాల్గొన్నారు. టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
ప్రైవేట్ సంస్థలను తరిమికొడతాం
హన్మకొండ: ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేట్ సంస్థలను పంపించకపోతే తామే తరిమికొడతామని.. ఆ రోజు తప్పక వస్తుందని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేట్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండలోని వరంగల్–2 డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ రవాణ సంస్థలుండగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేట్‌కు అప్పగించడంలో అర్థం లేదన్నారు. ప్రైవేట్ సంస్థలకు రాయితీ లబ్ధిచే కూర్చడానికే ఈ విధానం అవలంబిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా తమ విధానాలను మార్చుకుని ఆర్టీసీలకే విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి అప్పగించాలన్నారు. -
తగ్గిన విద్యుత్ అంతరాయాలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ అంతరాయాలు తగ్గాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో అవుటేజి మేనేజిమెంట్ సిస్టం ఎంతో దోహపడుతుందన్నారు. స్కాడా కంట్రోల్ రూమ్ నుంచి అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల అంతరాయాల లోకేషన్ తెలుసుకోవచ్చని, తద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టొచ్చన్నారు. పొడవు లైన్లలో, అడవుల్లో కవర్డ్ కండక్టర్‌తో చెట్లు కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఉండవన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, వెంకట రమణ, జీఎంలు సామ్య నాయక్, శ్రీనివాస్, వేణు మాధవ్, వాసుదేవ్, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి దూరం
భూపాలపల్లి: రేపటితో మార్చి నెలాఖరు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కూడా గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల వసూలు నూరుశాతం కాలేదు. జిల్లావ్యాప్తంగా ఇంటి పన్నులు, నల్లా బిల్లులు పేరుకుపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులపై ప్రభావం పడనుంది. జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల నుంచి ఈ ఏడాది ఆస్తి, నల్లా పన్ను రూపేణా రూ. 4.25 కోట్ల వసూలు కావాల్సి ఉండగా.. రెండు రోజుల క్రితం వరకు రూ. 2.93 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా సుమారు రూ.1.32 కోట్లు బకాయి ఉంది. రేపటితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఒక్కరోజే ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేయడం అధికారులకు శక్తికి మించిన పనిలా మారింది. అంతగా పెరగని డిమాండ్.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి అంతంత మాత్రంగానే డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో పాత పెంకుటిళ్ల స్థానంలో కొత్త భవనాలు వెలిశాయి. అయినప్పటికీ చాలా గ్రామాల్లో రికార్డుల్లో మాత్రం పాత ఇళ్లే ఉన్నాయి. ఆన్లైన్ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులు పొంతన లేకపోవడంతో పన్ను డిమాండ్ పెరగలేదు. ఉన్న డిమాండ్‌ను వసూలు చేయడమే కష్టంగా మారిన తరుణంలో, కొత్తగా అసెస్మెంట్ చేయకపోవడం ఆదాయానికి గండి కొడుతోంది. పని ఒత్తిడిలో కార్యదర్శులు.. పంచాయతీ కార్యదర్శులు కేవలం పన్నుల వసూళ్లకే పరిమితం కాకుండా పారిశుద్ధ్యం, ఉపాధి హామీ తదితర పనుల పర్యవేక్షణలో నిమగ్నమై ఉంటున్నారు. దీంతో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారు. అంతేకాక ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడంతో కార్యదర్శులంతా ఎన్నికల బీజీలో ఉండటం కూడా పన్నుల వసూళ్లపై ప్రభావం పడింది. వసూలు రూ.2.93 కోట్లు మాత్రమే -
గుట్టలు గుటకాయ స్వాహా!
మైనింగ్ మాఫియా విచ్చలవిడితనానికి గుట్టలన్నీ గుల్ల అవుతున్నాయి. అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట చేపట్టి అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టారు. అనుమతుల పేరిట పరిమితికి మించి, హద్దులు దాటి గుట్టలను కరిగించారు. భువనగిరి–ఆరెపల్లి బైపాస్ పక్కన.. నగరాన్ని ఆనుకుని ఉన్న కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. నిబంధనలు పక్కనబెట్టి రూ.కోట్లాది విలువైన మట్టిని, రాళ్లను యథేచ్ఛగా తరలించారు. మైనింగ్ దందాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు.. జీవవైవిధ్యం, నగర ప్రశాంతతను దెబ్బతీసే విధంగా గుట్టలను గుల్ల చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారం రెవెన్యూ శివారులోని కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. ఈ గుట్ట మొరం క్వారీగా మారింది. అనుమతికి మించి యథేచ్ఛగా గుట్టను కొల్లగొట్టారు. విచ్చలవిడిగా సాగిన ఈ వ్యవహారంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒకరు భాగస్వామిగా ఉండి.. తన స్నేహితుడి కుమారుడికి లీజు ఇచ్చినట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా మొరం తరలించి గుట్టను గుల్ల చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే విచారణకు ఆదేశించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. కోమటిపల్లి గుట్టే కాదు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ‘విజిలెన్స్’ రంగంలోకి దిగనుండడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా మైనింగ్.. విచ్చలవిడిగా తరలింపు.. 2017లో క్వారీకి అనుమతి పొందిన ఓ వ్యాపారి మరో ప్రాంతంలో మొరం తవ్వకాలు చేపట్టాడు. దీంతో అప్పుడు ఉన్న మైనింగ్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఆ క్వారీ రెన్యువల్ కాలేదు. ఏడాదికోసారి పర్యావరణం, కార్మిక శాఖల అనుమతులు పొందాల్సి ఉంది. ఇవేమీ లేకుండా క్వారీ నిర్వహణ సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. 50 నుంచి 60 ఫీట్ల లోతు వరకు మొరం గుట్టను తవ్వారు. అయితే బండరాళ్లు రావడంతో వదిలివేసి.. మరో ప్రాంతంలో తవ్వుతున్నారు. ఇలా 20 నుంచి 30 ప్రాంతాల్లో గుట్టను బ్లాస్టింగ్ చేసి చీల్చారు. లీజు కాలం ముగిసినా ఈ గుట్టపై 2023 వరకు యథేచ్ఛగా తవ్వకాలు సాగాయి. వరంగల్ నగరం శివారుతో పాటు నగరంలో సాగుతున్న వందలాది కొత్త నిర్మాణాల కోసం ఇక్కడి మొరం సరఫరా చేశారు. ఆ సమయంలో ఒక హెక్టారు లీజుకు ఏడాదికి లక్ష రూపాయలతో పాటు మొరం రవాణా కోసం పర్మిట్ అవసరం. క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున సర్కారు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఒక ట్రాక్టర్ బయటికి వెళ్లిందంటే రూ.210 చెల్లించాలి. ఒక ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్ల మొరాన్ని తరలించవచ్చు. ప్రతి రోజు ఇక్కడి నుంచి వెయ్యి ట్రిప్పుల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. రోజుకు సర్కారు రూ.2.10 లక్షల ఆదాయాన్ని కోల్పోయిందంటే.. అధికారుల అండతో కోమటిపల్లి గుట్టపై మొరం మాఫియా ఏ మేరకు అక్రమార్జన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్‌లో ఓ ఉదాహరణ మాత్రమే.. ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. కాగా అక్రమ మైనింగ్‌పై శనివారం అ సెంబ్లీలో ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించడంతో పలుచోట్ల మై నింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదీ కోమటిపల్లి గుట్ట బాగోతం.. హసన్‌పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్ 340లో సుమారు 57 ఎకరాల్లో కోమటిపల్లి గుట్ట ఆక్రమించుకుని ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్టేడియానికి కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. అయినా అప్పటి సర్కారు 341/1 సర్వేనంబర్ పేరిట 3.260 రెండున్నర హెక్టార్ల భూమిని క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి ఐదేళ్ల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్‌అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. ఈ క్వారీని గతంలో కీలక ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, సన్నిహితుడు తన కుమారుడి పేరిట కేటాయించారు. అయితే ఇందులో సదరు ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్‌గా ఉన్నట్లు తనిఖీలకు వెళ్లిన సందర్భంగా అధికారుల విచారణలో వెల్లడి కావడం గమనార్హం. లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట రూ.కోట్లాది విలువైన మట్టి, రాళ్ల తరలింపు కోమటిపల్లి గుట్టను కొల్లగొట్టిన అక్రమార్కులు ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగిన దందా మైనింగ్ దందాపై విచారణకు ప్రభుత్వం ఆదేశం -
సమృద్ధిగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు
● కలెక్టర్ రాహుల్ శర్మభూపాలపల్లి: జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని.. కొరత లేదని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ సంకీర్త్‌తో కలిసి కలెక్టర్ జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై పటిష్ట పర్యవేక్షణ కొనసాగాలని ఆదేశించారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం లక్షా 20 వేల మంది గ్యాస్ వినియోగిస్తున్నారని చెప్పారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు యధావిధిగా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ అత్యవసర సేవలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల్లో డీటీలు, ఎస్సైలు పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. వాహనాలు తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలని ఆర్డీఓకు సూచించారు. ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్, అనధికార రీఫిల్లింగ్ సెంటర్లు, అక్రమ నిల్వలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దు గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మి ఆందోళన చెందొద్దని ఎస్పీ సంకీర్త్ సూచించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించామని చెప్పారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అసత్య ప్రచారాలపై పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రద్దీ లేకుండా పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్ల వద్ద పటిష్ట నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖల అధికారులు, హెచ్‌పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ అమర్త్యదాస్ పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
అటకెక్కిన రాజీవ్ యువ వికాసం ● పథకం అమలుపై నీలినీడలు ● పరిశీలన పూర్తయినా తప్పని నిరీక్షణవిద్యార్థులకు వైద్యపరీక్షలు మల్హర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య బృందం జనరల్ సర్జన్ డాక్డర్ సాయికుమార్, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ రవి, డాక్టర్ దీప్తి వారి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు వి.కుమారస్వామి పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని టెన్త్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్‌శర్మ శనివారం పరిశీలించారు. విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, సమయపాలన కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. డీఈఓ రాజేందర్ చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సోషల్ వెల్ఫేర్ పాఠశాల, టేకుమట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొట్లపల్లి పాఠశాలలను సందర్శించి పరీక్షా నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిశీలకులు జనార్దన్‌రావు, డిప్యూటీ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గణపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,544 మంది విద్యార్థులకు గాను ఐదుగురు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ తెలిపారు. -
రాజీమార్గంలో వివాదాల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్బాబుభూపాలపల్లి అర్బన్: నైతిక విలువలు పాటిస్తూ రాజీమార్గంలో ముందుకు సాగితే వివాదాలకు తావులేకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోదరభావంతో కలిసి జీవిస్తే వివాదాలు తలెత్తవని తెలిపారు. చిన్నచిన్న విభేదాలను పెంచుకుని కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే సమయం, డబ్బు, మనశ్శాంతి నష్టమవుతాయని హెచ్చరించారు. ప్రజలు రాజీమార్గాన్ని ఎంచుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల అంగీకారంతో కేసులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్‌నాయక్, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ పాల్గొన్నారు. బాలుడికి న్యాయం, రూ.15 లక్షల పరిహారం చిట్యాల మండలం చింతకుంటరామయ్యపల్లెకు చెందిన మోత్కూరి మణిదీప్ అనే ఆరు సంవత్సరాల బాలుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఘటనలో లోక్ అదాలత్ ద్వారా న్యాయం జరిగింది. మొగుళ్లపల్లి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో అతని తాతయ్య మరణించగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసును పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు బాలుడికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించారు. ఏడేళ్ల భూ వివాదం పరిష్కారం టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు అంతటి స్వామి, అంతటి తిరుపతి మధ్య భూమి పంపకాలపై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదం లోక్ అదాలత్‌లో పరిష్కారమైంది. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్‌నాయక్ సమక్షంలో ఇరువురు రాజీకి వచ్చి కేసును ముగించారు. -
ఇప్పట్లో లేనట్లేనా?
భూపాలపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందాలనుకున్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి. గత జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయితీ రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూలుగుతున్న దరఖాస్తులు దరఖాస్తులు సమర్పించి సుమారు ఏడాది గడుస్తున్నా పథకం అమలు కాకపోవడంతో మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు కంప్యూటర్లకే పరిమితమయ్యాయి. రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షల నుంచి రూ 4లక్షల వరకు రుణాలు పొందేందుకు జిల్లాలోని 12 మండలాల్లో వివిధ గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కులం, నివాసం, ఆదాయం, తదితర సర్టిఫికెట్ల కోసం వేలాది రూపాయలు ఖర్చుపెట్టి, వారాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి, కోటి ఆశలతో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకొని ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఈ పథకం గురించి ఊసే ఎత్తడం లేదని, దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం ఆరంభంలో బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ ఉన్నవారికి రుణం మంజూరు చేయాలని, నిబంధనను ప్రభుత్వం మొదట ప్రవేశపెట్టింది. దీంతో యువతీ యువకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సిబిల్ స్కోర్ అనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల్లో ఆశలు చిగురించాయి. అయినప్పటికీ ప్రభుత్వం పథకం గురించి ఊసే ఎత్తకపోవడంతో తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పట్లో కేటాయింపులు లేనట్లేనా? అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. రూ.50వేల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారికి యూనిట్లను కేటాయించాలనుకున్న ప్రభుత్వం వెనకడుగు వేసింది. యూనిట్ల కేటాయింపు ప్రక్రియను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటినుంచి దరఖాస్తుదారులు యూనిట్ల కేటాయింపు కోసం నిరీక్షిస్తున్నారు. నూతన బడ్జెట్ అమలయ్యేనా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.6వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. గతంలో కార్పొరేషన్ రుణాలకు కేటాయించిన నిధులను సైతం అమలు చేయకపోవడంతో నిరుపేద నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. రాజీవ్ యువ వికాసానికి కేటాయించిన బడ్జెట్ సైతం అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణాలు అందించాలి.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకొని ఏడాది కావస్తుంది. అధికారులు విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. గతంతో కార్పొరేషన్ రుణాలకు సైతం అనేక మార్లు దరఖాస్తులు చేసుకున్నాం. రుణాలు మాత్రం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి సకాలంలో రుణాలు అందించి ఆదుకోవాలి. – మత్స్య శ్రీకాంత్, దరఖాస్తుదారుడు టేకుమట్లదరఖాస్తుల సంఖ్య.. ఎస్సీలు 6,711 బీసీలు 11,225 మైనారిటీలు 749 ఈబీసీలు 401 క్రిస్టియన్లు 9 -
గులాబీలతో పుష్పార్చన
● ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు అమ్మవారికి గులాబీపూలతో పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు గులాబీపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు ఎండతాకిడితో ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకు అయ్యే ఖర్చు రూ.10లక్షలు విరాళంగా ఇస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఆలయ ధర్మకర్తలు పది రోజుల్లో పనిపూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో టెంట్లు ఏర్పాటు పనులను పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. -
అడవిలో మంటలు
● రక్షణ చర్యలు పాటించని అటవీశాఖ ● వృక్ష సంపద అగ్నికి ఆహుతి ● క్విక్ రెస్పాన్స్ టీం అలసత్వం..– మరిన్ని ఫొటోలు 9లోuకోదండరామాలయంలో కల్యాణం నిర్వహిస్తున్న పండితులుకాళేఽశ్వరం: వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కాటారం డివిజన్ పరిధిలోని పలు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఎండిన ఆకులు, గడ్డి, చెత్తాచెదారం వెంటనే అంటుకొని అడవంతా మంటలు చెలరేగుతున్నాయి. దీంతో అటవీ జీవరాశులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మంటలు వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి మంటలు ఎగిసిపడుతున్నా అధికారులు ఆలస్యంగా చేరడం వల్ల భారీగా అటవీ నష్టం జరుగుతుంది. రాత్రి వేళల్లో పొగతో రోడ్లంతా నిండిపోతున్నాయి. అడవిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. డివిజన్లో ఇలా.. కాటారం డివిజన్లో మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం అటవీ ప్రాంతాల్లో నిత్యం మంటలు చెలరేగుతున్నాయి. అదుపు చేసేందుకు ఒక్కో రేంజ్‌కు ఐదుగురితో కూడిన క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నప్పటికీ అవి సమర్థవంతంగా పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అడవిలో జీవించే కొద్ది పాటి జంతువులు దుప్పులు, కుందేలు, కొండగొర్రెలు, నక్క, పక్షులు తదితర జీవరాశులు ప్రమాదాలబారిన పడుతున్నాయని సమాచారం. దీనికితోడు విలువైన అటవీ సంపద కూడా అగ్నికి ఆహుతి అవుతుంది. వీటికి రక్షించడంతో అటవీశాఖ అధికారులు వెనుకంజలో ఉన్నారు. వేసవి కాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నందున అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, తగిన సిబ్బందిని నియమించి మంటలు మొదలైన వెంటనే అదుపులోకి తీసుకొచ్చే విధంగా ఉన్నతా ధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. యాత్రస్థలం కావడంతో.. కాటారం నుంచి కాళేశ్వరం ప్రధాన రహదారిపై నిత్యం వేలల్లో వాహనాలు తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో పాటు ముఖ్యంగా కాళేశ్వరం దేవస్థానానికి వచ్చే భక్తులు సైతం రోడ్లపై వాహనాలు నిలిపి వంట చెరుకు తెస్తుంటారు. ఆ క్రమంలో కూడా నిప్పు అంటుకుంటుంది. వంటలు చేస్తుండడంతో కూడా నిప్పుతో మంటలు ఎగసి పడుతున్నాయి. అటవీశాఖ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మంటలు అదుపులోనే..అడవిలో ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయి. మా క్విక్‌రెస్పాన్స్ టీం తరుచూ పెట్రోలింగ్ చేస్తున్నాయి. ఎలాంటి సమాచారం వచ్చినా నిమిషాల్లోనే మంటలు ఆర్పుతున్నారు. అడవిలో మంటలు పెట్టినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు. – రవికుమార్, అటవీశాఖ రేంజర్, మహదేవపూర్ -
ఆపద్బాంధవులు
ములుగు: అడవులు, కొండలు, రహదారి సరిగా లేని మారుమూల గ్రామాలు, అడవుల్లో నివాసముంటున్న గొత్తికోయల ఆవాసాలు. దూరప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాలతో కూడిన జిల్లా ములుగు. ఇక్కడ అత్యవసర వైద్యసేవలు అందించడం సవాల్‌తో కూడిన సహవాసం. వర్షాకాలంలో పొంగి ప్రవహించే వాగులు, వంకలు, గిరిజన గ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్ లేక అవస్థలు పడుతున్న ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు. ప్రాంతం ఏదైనా పల్లె ఎక్కడ ఉన్నా.. అత్యవసర సమయాల్లో వచ్చే ప్రతీ కాల్‌కు స్పందిస్తూ రాత్రింబవళ్లు నిరంతరం సేవలు అందిస్తూ ప్రతీ ప్రాణాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తూ పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలుగా నిలుస్తున్న 108 సిబ్బందిపై సాక్షి ప్రత్యేక కథనం. 10 మండలాలు..14 అంబులెన్స్‌లు ములుగు జిల్లా 10 మండలాల పరిధిలోని 171 గ్రామ పంచాయతీలతో పాటు, ములుగు మున్సిపాలిటీ పరిధితో కలిపి 14 అంబులెన్స్‌ల సిబ్బంది నిరంతరం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. 108 అంబులెన్స్‌లో పైలట్ (డ్రైవర్)తో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉంటారు. 108కు కాల్ రాగానే సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స చేయడం, రోగిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో అనేక మంది ప్రాణాలు నిలుస్తున్నాయి. అంబులెన్స్‌లో ప్రసవాలు అనేకం డెలివరీ కేసులపై 108 సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గర్భిణులు నొప్పులు మొదలు కావడంతో కుటుంబసభ్యులు 108కి కాల్ చేయడం, వెంటనే అక్కడకు చేరుకొని ఆస్పత్రికి తరలించే సమయం లేకపోవడంతో అనేక మంది గర్భిణులకు 108 అంబులెన్స్‌లోనే సిబ్బంది పురుడు పోసి తల్లి, శిశువు క్షేమంగా ఉండేలా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏడాదిలో సుమారు 60 మందికి పైగా గర్భిణులకు పురుడు పోసి తల్లీబిడ్డలు క్షేమంగా ఉండేలా సేవలందించారు. రోడ్డు ప్రమాదం జరిగిన, గుండెపోటు వచ్చిన ఆస్పత్రికి వెళ్లేలోపు గోల్డెన్ ఆవర్‌లో చికిత్స ఎంతో అవసరం, ఈఎంటీ ప్రాథమిక చికిత్స చేస్తే పైలట్ ట్రాఫిక్ సమస్యను దాటుతూ ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కంటికిరెప్పలా కాపాడుతూ సరైన సమయంలో ఆస్పత్రికి చేర్పించి ప్రాణాలు నిలబెడుతూ వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. 18,886 కేసులకు స్పందన ప్రమాదం, ప్రసవవేదన, జ్వరం, పాముకాటు, శ్వాస ఇబ్బంది, గుండెపోటు, జబ్బు ఏదైనా సకాలంలో వైద్యం అందకపోతే నిండు ప్రాణాలు గాలిలో కలవక తప్పదు. ఏ అత్యవసర పరిస్థితి అయినా మేమున్నామంటూ.. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు రక్షిస్తూ మెరుగైన సేవలందిస్తున్నారు. జిల్లాలో 2025 మార్చి 31 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు 18,886 కేసులకు స్పందించి వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తూ సకాలంలో ఆస్పత్రికి చేర్చారు. 1,569 రోడ్డు ప్రమాద కేసులు, 2,461 గర్భిణుల కేసులు, 827 మంది సృహ కోల్పోయిన కేసులు, 2,437 కడుపునొప్పి కేసులు, 1,251 శ్వాసకోస సంబంధిత కేసులు, 953 డొమెస్టిక్ ప్రమాదాలు, 932 గుండెనొప్పి సంబంధిత కేసులు, 863 పాయిజన్ కేసులు, 647 ఫిట్స్ కేసులు, 368 ఆత్మహత్యాయత్నం కేసులు, 271 పెరాలసిస్ కేసులు, 445 జంతు దాడి కేసులు, 46 బర్నింగ్ కేసులు, 5,816 ఇతర సంబంధిత కేసులకు సకాలంలో స్పందించి వైద్యసేవలు అందించారు. పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలు ఆపదలో ఆదుకుంటున్న 108 సిబ్బంది ఏడాదిలో 18,886 కేసులకు స్పందన అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యసేవలు గిరిజన ప్రాంతంలో ఘనమైన సేవలు -
జయశంకర్ భూపాలపల్లి
Iనేడు శ్రీరామనవమిని సందర్భంగా గురువారం రాత్రి కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం రామాలయం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవ మూర్తుల ఎదుర్కోలు సేవా కార్యక్రమం పురవీధులగుండా ఘనంగా నిర్వహించారు. హనుమాన్మాలధారణ భక్తులతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్.మహేష్, సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, హనుమాన్ మాలదారన స్వాములు పాల్గొన్నారు. – కాళేశ్వరంశుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026తల్లిదండ్రులు పిల్లలకు టూ, ఫోర్ వీలర్స్ ఇవ్వొద్దు కాళేశ్వరం: వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత బడి లేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటా పాటల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులు గ్రహించాలి. దీంతో వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారికి టూ, ఫోర్ వీలర్ వాహనాలు ఇచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. జిల్లాలోని కాటారం డివిజన్లోని పలు మండలాల్లో బావులు, చెరువులు, గోదావరి తీర ప్రాంతాలు ఉన్నాయి. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టిసారించాలి. బావులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు.. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో నీరు నిల్వ ఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదులసంఖ్యలో ఉంటున్నాయి. డ్రైవింగ్ మోజులో టూ, ఫోర్ వీలర్స్, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆడుతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దృష్టి లోపాలతో పాటు మానసిక బలహీనులుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటల వైపునకు దృష్టి మళ్లించాలి. పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైనా పిల్లలు ఆహారం తీసుకోరు. వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకోవాలి. డీహైడ్రేషన్ కాకుండా చూడాలి. – సుస్మిత, కాళేశ్వరం పీహెచ్సీ వైద్యాధికారి●18 ఏళ్లు నిండని విద్యార్థులకు టూ, ఫోర్ వీలర్స్ వాహనాలు ఇవ్వొద్దు. తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాం. –ఎన్.వెంకటేశ్వర్లు, సీఐ మహదేవపూర్ జాగ్రత్తలు తప్పనిసరి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఆటలపై దృష్టి సారించేలా చూడాలిస్ట్రీట్.. ట్రీట్.. వీధి కుక్కల సంరక్షణకు పలువురు జంతుప్రేమికులు ముందుకొస్తున్నారు. సెంటర్‌స్ప్రెడ్‌లో uఒంటిపూట బడిసమయంలోనూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి వసతితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
పనులు పూర్తిచేయాలి
● ఎంఆర్ఐ ఏర్పాటులో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం భూపాలపల్లి అర్బన్: ఎంఆర్ఐ యంత్రం అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ సందర్శించారు. ఎంఆర్ఐ పరికరం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు. జిల్లా జనరల్ ఆస్పత్రి ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సరఫరా పనుల్లో జాప్యం జరుగుతుండటంపై కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఐ యంత్రం కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో ఆలస్యం జరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించిన కలెక్టర్ అధి కారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై షోకాజ్ నోటీస్ జారీచేయాలని ఆదేశించారు. ఎంఆర్ఐ పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్డీఓను నియమించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలు ఇప్పటికీ సమకూర్చకపోవడంపై ప్రశ్నిస్తూ, పనులు పూర్తికా వడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో అని అసహనం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేష్, టీజీఎంఎస్ఐడీసీ ఏఈ రవికిరణ్ పాల్గొన్నారు. -
సరఫరా నిరంతరం చేయాలి
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా, పారదర్శకంగా కొనసాగాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం భూపాలపల్లిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, పెట్రోల్, డీజిల్ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, అమ్మకాల విధానం, భద్రతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించారు. పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, వినియోగదారులకు సమయానికి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆయిల్ కంపెనీలు ఇండెంట్ల ఆధారంగా నిరంతర సరఫరా కొనసాగిస్తున్నాయని తెలిపారు. వదంతుల నేపథ్యంలో అక్రమంగా నిల్వలు చేయడం, అక్రమంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేపడితే చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో పౌర సరఫరాల అధికారి శరణ్ కుమార్, ఇన్స్పెక్టర్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
భూ సమస్యలు వేగంగా పరిష్కరించాలి
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీల్లోని లెక్కించగా రూ.23.12 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. కోటంచ దేవస్థానంలో వారం రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించినట్లు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 28 గ్రాములు, మిశ్రమ వెండి 1.3 కిలోలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు అనిల్‌కుమార్, సర్పంచ్ సావటి మెగిళి, జీపీఓ రవీందర్, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి, కొడవటంచ భజన బృందాలు పాల్గొన్నారు. ప్రమాద బీమా చెక్కు అందజేత భూపాలపల్లి అర్బన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డ్ నేరుపాటి మొగిలి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కును బుధవారం అందజేసినట్లు బ్రాంచీ మేనేజర్ రామస్వామి తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి చేతుల మీదగా బ్యాంక్ ఆవరణలో చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం విశేషమని తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో ఇంకా సుమారు 60 మంది ఉద్యోగులు ఈ సౌకర్యం లేని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారని, వారు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లోని కార్పొరేట్ శాలరీ ఇన్సూరెన్స్ పథకంలోకి మారాలని సూచించారు. గనులు, విభాగాల వారీగా ఖాతాలు మార్చుకోవాల్సిన వారి సంఖ్యను వివరించారు. డిపార్ట్మెంట్లలో 12 మంది, కేటీకే–1లో 12 మంది, కేటీకే–5లో 9 మంది, కేటీకే–6లో 13 మంది, కేటీకే–8లో 8 మంది, కేటీకే ఓసీ–2లో ఆరుగురు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, కావూరి మారుతి, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ మధుకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భూగర్భ జలాల అభివృద్ధి, వినియోగంపై అవగాహన భూపాలపల్లి రూరల్: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లా భూగర్భ జల శాఖ అశ్రీత ఎన్జీఓ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలం నాగారంలో గ్రామంలో బుధవారం ప్రజలు, రైతులకు నీటి ప్రాముఖ్యత, వినియోగం అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులు కాలే.కుమార్, మండల రాజయ్యను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా భూగర్భజల శాఖ అధికారులు శ్రీనివాసరావు, విక్రమ్, వ్యవసాయ శాఖ అధికారులు సతీష్ కుమార్, ఉద్యానవన శాఖ ఏఈఓ సుమలత, మిషన్ భగీరథ ఇన్చార్జ్ సాయి, ఎలిగేషన్ విభాగం ఏఈఓ క్రాంతి, సర్పంచ్ అంబాల దుర్గమ్మ, మాజీ సర్పంచ్ నాంపల్లి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ సెగ్గం మల్లేష్, అంబాల జగదీష్ పాల్గొన్నారు.భూపాలపల్లి రూరల్: తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, హైదరాబాద్ ద్వారా 2025–26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాలోని అర్హులైన అభ్యర్థుల నుంచి వివిధ ఆర్థిక సహాయ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడుపు పెంచినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం చైర్మన్, బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 671 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. భూపాలపల్లి: భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూ వివాదాలకు సంబంధించిన అన్ని రికార్డులు, పొజిషన్ సమగ్రంగా పరిశీలించి నివేదికలను అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన భూ వివాదాల విషయంలో సంయుక్త సర్వేలు నిర్వహించి హద్దులను నిర్ణయించాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్ఓ నవీన్‌రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలి తాడిచర్ల నుంచి కేటీపీపీ వరకు ఏర్పాటు చేయనున్న కన్వేయర్ బెల్ట్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులతో నెగోషియేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, కేటీపీపీ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రాజెక్టు పురోగతిని, భూ సేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు అమలులో భాగంగా ప్రభావితం అవుతున్న రైతుల సమస్యలను పరిగణించి, వారికి న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, చట్ట బద్ధంగా కొనసాగాలని, రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్ఓ నవీన్‌రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు. మరింత చేరువలో బ్యాంకింగ్ సేవలు బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో భూపాలపల్లిలోని మంజూరునగర్లో కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఎస్బీఐ బ్రాంచ్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎల్డీఎం తిరుపతి, ఎస్బీఐ అధికారులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలి మల్హర్(కాటారం): విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మండలంలోని మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థుల వసతి గహం, భోజన శాలను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, ఆహార నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల వసతి గృహం నిర్వహణ, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల పరిస్థితి తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, బోధనా నాణ్యత మెరుగు, వసతి గృహాల్లో శుభ్రత పాటించడం, పోషకాహారం సమయానికి అందించడం వంటి విషయాల్లో సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాబు, నాయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతులతో ప్రజలు ఆందోళనకు గురి కావొద్దని తెలిపారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ఎస్పీ సంకీర్త్ తెలిపారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
గిరిజనులకు ఆరోగ్య సేవలు సామాజిక బాధ్యత
మల్హర్(మహాముత్తారం): గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం మండలంలోని మహాముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో పోలీస్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు 6,200 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. ఈ మెగా మెడికల్ క్యాంప్‌కు కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులు కొనసాగిస్తామని వెల్లడించారు. యశోద హాస్పిటల్ (హైదరాబాద్), ఏకశిల హాస్పిటల్ (హనుమకొండ), సిగ్మా హాస్పిటల్, కూరపాటి హాస్పిటల్స్, శరత్ లేజర్ ఐ కేర్ (హనుమకొండ), భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మొత్తం 34 మంది వైద్యులు 9 విభాగాల్లో సేవలు అందించాని ఎస్పీ వివరించారు. ఈ శిబిరంలో గుండె, మూత్రపిండాలు, జనరల్ మెడిసిన్, సీ్త్ర వ్యాధులు, కంటి, చర్మ, చెవి–ముక్కు–గొంతు, ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అలాగే అదనంగా రక్త పరీక్షలు, 2డీ ఎకో, ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఎఫ్ఓ నవీన్‌రెడ్డి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీదేవి, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎసైలు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో పోలీస్ మెగా మెడికల్ క్యాంప్ 6,200 మంది గిరిజనులకు చికిత్స -
పెరిగిన రుణ పరిమితి
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం పంటల రుణ, పరిమితిని పెంచడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి వానాకాలం, యాసంగి పంటల రుణ పరిమితి పెంచింది. ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలని ఖరారు చేస్తూ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ కి పంపించింది. దీంతో పంట రుణాల వరిమితిని పెంచుతూ ఎస్ఎల్బీసీ జిల్లా, మండలాల బ్యాంకర్లకు సర్క్యులర్ పంపించింది. దీంతో ఈ రుణ పరిమితిని ఏప్రిల్ నుంచి వర్తింపజేయనున్నట్లు సమాచారం. 128 రకాల పంటలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, తేనెటీగలు, చేపల పెంపకం తదితర యూనిట్లకు ఈ రుణపరిమితి వర్తించనుంది. సాగు విస్తీర్ణం ఇలా.. జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 1,26,407 మంది పంట రుణాలకు అర్హులు. కాగా, వీరిలో 78 శాతం మందికే రుణాలు అందుతున్నాయి. మిగతా రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకర్లు ఇస్తున్న పంట రుణాలకు తక్కువ వడ్డీ ఉండగా పట్టా పాస్‌బుక్ కలిగిన ప్రతీ రైతు సమీపంలోని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.ప్రభుత్వం పంట రుణపరిమితి పెంచడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. నాకు ఐదెకరాల సాగుభూమి ఉంది. ఏటా అవసరానికి సరిపడా పంట రుణం తీసుకుంటున్నాను. రుణ పరిమితి పెంచడం సాగును ప్రోత్సహించడమే. – తరాల విష్ణు, రైతు, కొత్తపల్లి (ఎస్ఎం) పంటల రుణ పరిమితి పెంచడంతో వరికి గతేడాది ఎకరాకు రూ.46 వేలు ఉండగా ప్రస్తుతం రూ.48 వేలు అందనుంది. పత్తికి రూ.4 వేలు, మిర్చికి రూ.4 వేలు, కందికి రూ.2 వేలు, సోయాకు రూ.2 వేలు, పెసర, జొన్న, మక్క, పంటలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు అదనంగా రానున్నాయి. దీంతో పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా ఉపశమనం కలగనుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కాగా, ఐదెకరాలకు పైగా ఉన్న రైతులకు రూ.2 లక్షలకు మించి రుణాలివ్వడంలేదని.. బ్యాంకర్లు కండిషన్లు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల నేపథ్యంలో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రటించి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో చాలామంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ కాలేదు. దీంతో రైతులు రూ.2 లక్షల లోపు పరిమితితోనే రుణాలు తీసుకుంటున్నారు.పెంచిన రుణ పరిమితి సౌకర్యాన్ని రైతులు వినియోగించుకోవాలి. తీసుకున్న రుణాలు గడువులోపు చెల్లించిన రైతులకే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. రుణ పరిమితి పెంపుతో రైతులకు ఉపయోగంగా ఉంటుంది. – తిరుపతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏప్రిల్ 10 నుంచి రుణాల పంపిణీ 1,26,407 లక్షల మంది రైతులకు మేలు -
డ్రైవర్లకు కంటిచూపు ప్రధానం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: వాహన డ్రైవర్లకు కంటిచూపు ప్రధానమని, కంటిచూపు మందగింపుతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సింగరేణి ఫంక్షన్ హాల్లో శరత్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో జిల్లాలోని వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్ల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, వారి ప్రాణ భద్రతను కాపాడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా ఆటో, లారీ డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, స్థానిక సీఐ డి.నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు. రాజీతో సమస్యలను పరిష్కరించుకోండి ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసులను పరస్పర సమ్మతితో త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. చిట్యాల: మండలకేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన సరిగొమ్ముల నాగరాజ్ ఇంట్లో అక్రమంగా ఎనిమిది గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచారు. దీంతో నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లయీస్ ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో ఏఎస్సైలు సమ్మిరెడ్డి, మధుసూదన్, కానిస్టేబుల్ లాల్‌సింగ్, హోంగార్డ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
టీబీపై పోరాటం అందరిబాధ్యత
భూపాలపల్లి అర్బన్: ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని, టీబీపై పోరాటం మన అందరి బాధ్యత కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. మంగళవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఉచిత టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీబీపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్మికులు, ఆశ సిబ్బందికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి, మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్ అప్పం కిషన్, ప్రోగ్రాం అఽధికారిణి డాక్టర్ ఉమారాణిలు పాల్గొన్నారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి
మల్హర్(మహాముత్తారం):పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మహాముత్తారం మండలంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాలలో పిచ్చిమొక్కలు తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నారు. చేపట్టిన పారిశుద్ధ్య పనుల ఫొటోలను తనకు పంపించాలని సూచించారు. అదనంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచాలన్నారు. రో డ్డు, విద్యుత్ పనులను వెంటనే వేగవంతం చేసి, వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత శాఖ ల అధికారులను ఆదేశించారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు రాశారు? ఎలా రాశారు? ఇంకా ఎన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థుల ను ప్రోత్సహించారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రకాష్, సర్పంచ్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధులు కీలకం గ్రామాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కీలకమని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం మండలంలోని మండల పరిషత్ పాఠశాలలో హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్మార్ట్ తరగతి గదులు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు, ఎమ్మార్సీ భవనం, చిన్నారుల కోసం ఏర్పాటు చేసి న ఆట పరికరాలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో సీఎస్ఆర్ నిధుల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో అయి త ప్రకాష్‌రెడ్డి, డీఈఓ రాజేందర్, హెచ్డీఎఫ్సీ జోనల్ మేనేజర్ రుణాకర్రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు, విద్యుత్ పనులు వేగవంతం చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
గ్యాస్ కష్టాలు!
భూపాలపల్లి అర్బన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. వంటగ్యాస్ కొరత తీవ్రతరం కాకపోయినా.. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తగ్గించారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్లపై తినుబండారాలు, టిఫిన్లు అమ్మేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని వంటలు చేస్తుండగా కమర్షియల్ గ్యాస్‌పైనే ఆధారపడిన టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్ల వ్యాపారులు వాటిని మూసివేసుకోవాల్సి న పరిస్థితి ఏర్పడుతుంది. కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.2వేలు ఉండగా బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ రూ.4వేల నుంచి రూ.5వేల వరకు అమ్ముతుండడంతో చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 400పైగా హోటళ్ల, టిఫిన్ సెంటర్ల, తోపుడు బండ్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో సుమారు 10కిపైగా హోటళ్లు మూడపడ్డాయి. మూత పడుతున్న టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులుబతుకుదెరువు కోసం బజ్జ్జీల బండి ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాం. పది రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ కొరతతో ఇబ్బందులు పడుతున్నాం. కమర్షియల్ సిలిండర్లు రావడం లేదు. దీంతో రెండు రోజుల నుంచి బజ్జీల బండి తీయడం లేదు. రోజు వారి ఖర్చులు, గిరి గిరి చిటీలు కట్టడం ఇబ్బందిగా మారింది. – ఉపాధ్యాయ్ శుభం, బజ్జీల బండి నిర్వాహకుడు -
– వివరాలు 8లోu
– సాక్షిప్రతినిధి, వరంగల్ ‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్‌లో ఐదు... మానుకోటలో నాలుగు... జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులలో యఽథాతఽథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం... ఆ ప్రకారమే 2029 ఎన్నికలు... కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా పునర్విభజన -
సమస్యల పరిష్కారానికి ‘సేవ్ సింగరేణి’ బస్సు జాతా
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ‘సేవ్ సింగరేణి’ బస్సు జాతా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. మంగళవారం ఏరియాలోని కేటీకే ఓసీ2 గనిలో సేవ్ సింగరేణి బస్సు జాతాకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ సింగరేణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బస్సు జాతా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సేవ్ సింగరేణి పిలుపులో భాగంగా నేడు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో బైక్ ర్యాలీ, కార్నర్ సభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఇన్చార్జ్ రామ్‌చందర్, బ్రాంచ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యం క్షయం
భూపాలపల్లి అర్బన్: రెండు వారాలకు మించి దగ్గు ఉందా.. అయితే టీబీ(క్షయ) అయ్యిండొచ్చు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి ఉచిత పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యులు మందులిస్తారు. చిన్నపాటి దగ్గే కదా అని నిర్లక్ష్యం చేస్తే అదే రేపు ప్రాణాంతకం అవ్వొచ్చు. ముందుగా జాగ్రత్త పడితే ఆరోగ్యం మీ చేతుల్లోనే భద్రంగా ఉంటుంది. జిల్లాలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న క్షయ వ్యాధికి కళ్లెం వేయాలి. అందరం కలిసి క్షయను నిర్మూలించగలం అనే నినాదంతో అధికారులు ఈ ఏడాది ముందుకెళ్తున్నారు. నేడు ప్రపంచ క్షయ నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. అవగాహన కార్యక్రమాలు.. టీబీ నిర్మూలనకు ప్రభుత్వం నడుంబిగించింది. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నా క్షయ వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో చాపకింద నీరులా క్షయ విస్తరించడం, కొన్నేళ్లుగా వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నా, ఏటా బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి టీబీని నిర్మూలించడమే లక్ష్యంగా ఐదేళ్లుగా కృషి చేస్తున్నా, ఏటా వీరి సంఖ్య వెయ్యికి దగ్గరగా నమోదవుతోంది. 680 క్షయవ్యాధి కేసులు 2025 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 680 క్షయవ్యాధి కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 482 మంది రోగులు చికిత్స పూర్తి చేసి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 281 మంది రోగులు చికిత్సలో కొనసాగుతున్నారు. 12 మంది రోగులు మరణించారు. మరోవైపు క్షయ పోషణ పథకం కింద కేవలం 114 మంది మాత్రమే లబ్ధి కలిగింది. వ్యాధి గుర్తింపు ఇలా.. టీబీ.. మైకో బ్యాక్టీరియా ట్యూబర్కిలోసిస్ ద్వారా సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులకు లేదా శరీరంలోని ఇతర భాగాలకు రెండు రకాలుగా వ్యాపిస్తుంది. 85 శాతం మందికి ఊపిరితిత్తులకే సోకడం గమనార్హం. రెండు వారాలకు మించి దగ్గు ఉండడం, సాయంత్రం వేళ జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతినొప్పి, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తెమడ వస్తే వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బాధితులకు వ్యాధి తీవ్రతను బట్టి ఆరు, ఎనిమిది నెలలు, రెండేళ్ల కోర్సు ప్రకారం మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తుడు దగ్గినా, తుమ్మినా తుంపర్లు వాతావరణంలో కలిసి బ్యాక్టీరియా ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు దీని బారిన పడే ప్రమాదం ఉంది. హెచ్ఐవీ, షుగర్ వ్యాధిగ్రస్తులు, అతిగా మద్యం సేవించేవారు, పొగతాగేవారు, గర్భిణులు, బాలింతలు, సరైన పోషకాహారం తీసుకోనివారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు త్వరగా దీని బారినపడే ప్రమాదం ఉంది. చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు ప్రతీరోజు ట్యాబ్లెట్లను వేసుకునేలా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్ఎసీ) చికిత్స విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యాధిని నిర్ధారణకు అధునాతన సీబీనాట్ (క్యాట్రేజ్ బేస్డ్ న్యూక్లిస్ ఆసిడ్ ఆంప్లీ క్లీన్ టెస్టు) విధానం (క్షయ నివారణ విభాగం కేంద్రం) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఉండగా కాటారం, మహాదేవపూర్, చిట్యాల, రేగొండలో తెమడ పరీక్షల మిషన్లను అందుబాటులో ఉన్నాయి. జిల్లా ఆస్పత్రిలో టీబీ టెస్టుల కోసం ప్రత్యేక గదిని కేటాయించి, సీబీనాట్ పరీక్ష చేసి చికిత్స అందిస్తున్నారు. టెస్టుల కోసం ట్రూనాట్ మిషన్‌ను ఏర్పాటు చేయగా, అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించి, వ్యాధిని నిర్ధారిస్తున్నారు. చిన్నారులకు బీసీజీ టీకా వేయడం వల్ల వారు క్షయ బారిన పడే అవకాశాలు తక్కువ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేసి వ్యాధి సోకిన వారికి మందులు అందిస్తున్నాం. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉండి, సాయంత్రం జ్వరం వచ్చే వారు ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. క్షయ నివారణ జిల్లాగా మార్చేందుకు అందరి సహకారం ఉండాలి. – డాక్టర్ ఉమాదేవి, ప్రోగ్రాం అధికారి గతేడాది 680 కేసులు నమోదు 12 మంది మృతి అవగాహన కల్పిస్తున్నా.. అంతంతే.. నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినంక్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స పూర్తయ్యే వరకు నిక్షయ పోషణ యోజన కింద నెలకు రూ.వెయ్యి ఇస్తారు. ఈ డబ్బును వారి ఖాతాల్లో జమచేసి, ఆధార్, బ్యాంక్ ఖాతాలతోని క్షయ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ల్యాబ్‌లో పరీక్షలు చేసుకుని, వ్యాధి నిర్ధారణ అయితే వ్యాధిగ్రస్తుల వివరాలను సమీప ప్రభుత్వ ఆస్పత్రిలోని టీబీ యూనిట్ సిబ్బందికి తెలియజేయాలి. ఈ డబ్బులతో వ్యాధిగ్రస్తుడు బియ్యం, పప్పుదినుసులు, గుడ్లు, పాలు, కూరగాయలు కొనేందుకు గాను ఈ మొత్తాన్ని ఉపయోగించాలి. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా దాతలు పౌష్టికాహార పదార్థాలు అందజేస్తారు. -
ఏర్పాట్లలో ఆలస్యం చేయొద్దు
భూపాలపల్లి: కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. సరస్వతి అంత్య పుష్కరాల పనులపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఇరిగేషన్, పీఆర్, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ, విద్యుత్, వైద్య శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డెడ్‌లైన్ ప్రకారం జాప్యం లేకుండా కచ్చితంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గాలికుంటుపై అప్రమత్తంగా ఉండాలి.. జిల్లాలోని పశుపోషకులు గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ ప్రచార రథాన్ని, కర పత్రాలను ఆవిష్కరించారు. తక్షణ చర్యలు తీసుకోవాలి.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 55 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతిపాదనలు పంపాం.. 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, దేవాదాయ తదితర శాఖల ద్వారా చేపట్టనున్న పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులపై హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో సోమవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టు
టేకుమట్ల: విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల వేదిక(లోకల్ కోర్టు)లను నిర్వహిస్తునట్లు టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్వీ వేణుగోపాలచారి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో విద్యుత్ సమస్యలు–పరిష్కారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి 19 దరఖాస్తులను స్వీకరించి, మూడు సమస్యలను అక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లూజ్ లైన్లు, రోడ్డు క్రాసింగ్‌లు, ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్లు వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు విద్యుత్ అధికారులకు రాత పూర్వకంగా వినతి పత్రాలు అందించాలన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే స్థానికంగా ఉండే విద్యుత్ అధితకారులతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన వినియోగదారుడి విద్యుత్ సమస్యను 45రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు విద్యుత్ అధికారులకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫైనాన్ష్ మెంబర్ దేవేందర్, టీఎం రమేష్, భూపాలపల్లి డీఈ నాగరాజు, చిట్యాల ఏడీఈ సుందరకుమార్, ఎస్ఏఓ లక్పతి, ఏఏఓ సతీష్, ఏఈలు మణిదీప్, చంద్రశేఖర్, సంజయ్, సబ్ ఇంజనీర్లు వెంకటేష్, శ్రీనివాస్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు మెగా పోలీస్ మెడికల్ క్యాంప్
భూపాలపల్లి: పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25న(రేపు) పోలీసు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహాముత్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో క్యాంపు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సుమారు 5000 మంది గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ క్యాంపులో హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం, భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు సేవలు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని మారుమూల ప్రాంత ప్రజలు సద్వినియోగిం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. తక్షణ పరిష్కారమే లక్ష్యం.. ప్రజాదివస్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌లో ఆయన 10 ఫిర్యాదులకు స్వీకరించారు. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం.. భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్ పక్కన గల సింగరేణి కమ్యూనిటీ హాల్లో నేడు (మంగళవారం) డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. జిల్లాలోని ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ● గిరిజనులకు ఉచితంగా వైద్యసేవలు ● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
అవగాహనతో కుష్ఠు నివారణ
● జిల్లా వైద్యాధికారి మధుసూదన్రేగొండ: అవగాహన పెంచుకోవడం ద్వారా కుష్ఠు వ్యాధిని కొంతవరకు నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని సబ్ సెంటర్లో కుష్ఠు వ్యాధి గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధి సంక్రమణ వ్యాధి అయినప్పటికీ ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి లక్షణాలున్న వ్యక్తిని గుర్తించి, పరీక్షలు చేసి ఉచిత చికిత్స అందిస్తామన్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి హిమబిందు, పీఎంఓ మల్లయ్య, ఏపీఎంఓ ఎర్రయ్య నాయక్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు ● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్‌శర్మ భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ జిల్లా కేంద్రంలోని సింగరేణి, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈఓ రాజేందర్ స్థానికంగా ఉన్న నాలుగు పరీక్ష కేంద్రాలను, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయాన్ని తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 3,544 మంది విద్యార్థులకు గాను ఐదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ రాజేందర్ తెలిపారు. జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీన జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు తెలిపారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 8గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నాలుగవ తరగతి చదువుతున్న బాలబాలికలకు ఎత్తు, బరువు, 800 మీటర్ల పరుగు, షటిల్ రన్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఫ్లయింగ్ స్టార్ట్, మెడిసిన్ బాల్ పుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ వంటి తొమ్మిది రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన వారిలో నుంచి 10 మంది చొప్పున బాలబాలికలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. మండలస్థాయిలో ఎంపికై న విద్యార్థులే జిల్లాస్థాయి ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే వారు జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. -
ఒకేసారి మూడు నెలల రేషన్
● జిల్లాలో 1,38,234మంది తెల్లరేషన్‌కార్డులు భూపాలపల్లి: భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి నెలలోనే ఎండలు మండిపోతుండటంతో రానున్న మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు చేస్తున్న పౌరసరఫరాల అధికారులు సాధారణంగా ప్రతీ నెల కేటాయించే కోటాను కాకుండా రాబోయే మూడు నెలల బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 277 రేషన్‌షాపులు ఉండగా 1,38,234 మంది రేషన్‌కార్డుదారులు, 3,91,353 మంది లబ్ధిదారులు(యూనిట్లు) ఉన్నారు. సర్కారు తీసుకున్న నిర్ణయంతో వీరందరికీ మూడు నెలల రేషన్ బియ్యం అందనుంది. పౌరసరఫరాల అధికారులు ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అంత్యోదయ, అన్నపూర్ణతో పాటు తెల్లరేషన్‌కార్డుల కుటుంబాల్లో సభ్యులందరికీ మూడు నెలలకు సరిపడా బియ్నాన్ని అందించేందుకు గోడౌన్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న బియ్యం నిల్వలు, కావాల్సిన బియ్యం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించి సకాలంలో బియ్యం దిగుమతి జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాక ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం అందించనుండటంతో రేషన్ డీలర్ల వద్ద క్యూ కట్టడం.. తదితర ఇబ్బందులు తలెత్తే దృష్ట్యా, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. -
మక్కలకు లేదు మద్దతు
ఉమ్మడి వరంగల్‌లో యాసంగి సాగు వివరాలు..సాక్షిప్రతినిధి, వరంగల్: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మొక్కజొన్న రైతులకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకడం లేదు. యాసంగి మక్కల కొనుగోళ్ల కోసం ప్రతీసారి మార్చి మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే మార్క్‌ఫెడ్, ‘ప్యాక్స్’, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈసారి వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఎక్కడా కూడా మార్క్‌ఫెడ్ ఇంకా కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో సిండికేట్‌గా మారిన కొందరు ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.2,400 కాగా.. కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,950 చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎంఎస్పీతో పోలిస్తే క్వింటాలుకు రూ.500 నుంచి రూ.650 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు.. ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అంచనాలను మించి రైతులు 88 శాతం అధికంగా సాగు చేశారు. వాస్తవానికి 2025–26 యాసంగిలో మొత్తం సాగు అంచనా 68,67,407 ఎకరాలు కాగా, 81,20,332 (118 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. ఇందులో మొక్కజొన్న సాగు అంచనా 6,45,574 ఎకరాలకు 12,13,914 (188 శాతం) ఎకరాల్లో వేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌లో 3,43,732 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. సాగైన మొత్తం విస్తీర్ణంలో సగటున ఎకరానికి 18 క్వింటాళ్లు వస్తే 6,18,717 టన్నులు.. 25 క్వింటాళ్లు వస్తే 8,59,330 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 26 కేంద్రాలను ప్రతిపాదించిన మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖలు ఈసారి ఇంకా కొనుగోలు కేంద్రాల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో రైతులు అవసరాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 18న మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో చర్చకు తేగా.. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పురోగతి లేదు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400.. వ్యాపారుల ధర రూ.1,950 ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 3.43 లక్షల ఎకరాల్లో సాగు అసెంబ్లీలో ఈనెల 18న చర్చ.. మంత్రి ఆదేశించినా పురోగతి లేదు మొక్కజొన్న రైతుకు తప్పని దళారుల బెడదపై ఫొటోలో ఉన్నది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు నకీర్త మధు. మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగళ్లకు కొంత మేరకు దెబ్బతింది. మిగిలిన పెరడు కోసి కంకి కొట్టాడు. అమ్మేందుకు మక్కలను కల్లం వద్ద ఆరబోశాడు. బయట అమ్ముకుందామంటే ధర తక్కువ. కొనుగోలు కేంద్రాలు అగొచ్చే ఇగొచ్చే అని అధికారులు అంటుంటే ఐదారు రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితి ఒక్క నకీర్త మధుదే కాదు.. అనేక మంది మక్క రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
‘ట్రామా’.. ధీమా
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో ట్రామాకేర్ సేవలను మరింత పకడ్బందీగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే మెరుగైన చికిత్స అందించేందుకు మూడుస్థాయిల్లో ట్రామా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా లెవల్–1, లెవల్ –2, లెవల్–3గా విభజించి వైద్యారోగ్య శాఖ సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎంజీఎం ఆస్పత్రిలో కూడా నిపుణులైన వైద్యులతో ట్రామా చికిత్సలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తోంది. మూడేళ్ల క్రితం ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ (ఈఎండీ)ను అందుబాటులోకి తీసుకురావడంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. అయితే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఈఎస్‌ఐసీతోపాటు లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎంకు చోటు కల్పించడంతో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు అన్ని విభాగాల వారు ఒకే సమయంలో 24 గంటలు అందుబాటులో ఉండడం ద్వారా సత్వర వైద్యం అంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్‌లో నిర్మితమవుతున్న మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 నుంచి 12 పడకలతో ట్రామా ఐసీయూ అందుబాటులోకి రానుండడం కూడా క్షతగాత్రులకు ఎంతో ఉపయుక్తం కానుంది. న్యూరో, ఆర్థో, జనరల్ సర్జరీ, కార్డియాక్ స్పెషలిస్టులు, అనస్థీషియా నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులతో పాటు డెంటల్, ఈఎన్టీ నిపుణులు కూడా అందుబాటులో ఉండడం వల్ల రోడ్డు ప్రమాద బాధితులకు అవసరమైన వైద్యం అందించే వీలుంటుంది. ఈ లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి క్షతగాత్రులకు భరోసా కల్పించేలా చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌తో పాటు రేడియాలాజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటీస్కాన్ సేవలు ఎంజీఎంలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. రోజుకు 200 వరకు ట్రామా కేసులు.. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి రోజుకు 500 నుంచి 700 వరకు కేసులు వస్తుంటాయి. వీటిలో 150 నుంచి 200 వరకు ట్రామా కేసులు ఉంటాయి. 30 నుంచి 50 వరకు మేజర్ కేసులుంటే, మిగిలినవి మైనర్. శని, ఆదివారాల్లో ఈ కేసులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందేలా చేస్తున్నారు. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం ద్వారా ఎంజీఎంలో మరిన్ని సౌకర్యాలు పెరిగి 24 గంటలపాటు అన్ని విభాగాల వైద్యులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడం ద్వారా సమయానుకూలంగా స్పందించే అవకాశముంటుంది. ఇలా గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు మెరుగైన సత్వర చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి. లెవల్–1లో ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ట్రామా ఐసీయూ -
బీపీ.. షుగర్
జీవనశైలి మార్పుతో దీర్ఘకాలిక వ్యాధులు ● నలుగురిలో ఒకరికి బీపీ.. ఐదుగురిలో ఒకరికి మధుమేహం ● నియంత్రణ కోసం వైద్యారోగ్య శాఖ చర్యలు ● పల్లెల్లోనూ పెరుగుతున్న కేసులుజిల్లా జనాభా : 4.50లక్షలు (2011 జనాభా లెక్కల ప్రకారం)ఎన్సీడీ ద్వారా స్క్రీనింగ్ 1,40,000బీపీ వ్యాధిగ్రస్తులు 27,660షుగర్ వ్యాధిగ్రస్తులు 12,245భూపాలపల్లి అర్బన్: ప్రస్తుతకాలంలో దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి.. ఇలా పలు కారణాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. బీపీ, షుగర్(మధుమేహం) బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదివరకు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జబ్బుల బారిన పడేవారు. ప్రస్తుతం పల్లెల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రత అంచనా వేయవచ్చు. ఈ స్థాయిలో బీపీ, మధుమేహ బాధితులు ఉండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు పేర్కొంటున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేకపోవడంతో వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు మృత్యువాత పడుతున్నారు. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సుఖమయమైన జీవితం గడపవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. యోగాతో పాటు వ్యాయామం చేస్తే ఒత్తిడిని జయించవచ్చంటున్నారు. సమీకృతాహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఎన్సీడీ ప్రోగ్రాం ద్వారా 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్, మహిళలకు రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్‌కు సంబంధించి పరీక్షలు చేస్తున్నారు. మూడో విడతలో ఇప్పటివరకు లక్షా 40వేల మందికి స్కీన్రింగ్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో 27,660 మంది బీపీ, 12,245 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంటున్నారు. క్యాన్సర్‌కు సంబంధించి మహిళలు దాదాపు 382 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వీటితో నష్టాలు.. బీపీ, షుగర్ వల్ల జనం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలు పోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన శైలితోనే 90 శాతం మందికి బీపీ వస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రైమరీ, సెకండరీ హైపర్‌టెన్షన్ ఉంటుంది. బీపీతో గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్, శరీరంలోని ఇతర అవయవాలు చెడిపోవడం, కంటి సమస్యలు రావడం, రక్తం గడ్డకట్టడంతో పక్షవాతం వస్తుంది. బీపీ ఎక్కువై నరాలు చిట్లిపోయి చనిపోతున్నారు. షుగర్ వల్ల నరాలు బలహీనమవడం, కాళ్లకు తిమ్మిర్లు రావడం, కిడ్నీలు చెడిపోవడం, కంటి సమస్యలు, శరీరంలో అన్ని అవయవాలకు ఇన్ఫెక్షన్ రావడం, రోగనిరోధక శక్తి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. 30ఏళ్లు పైబడిన వారికి షుగర్ వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులెన్ రిలీజ్ చేయకపోవడంతో షుగర్ పెరిగి డయాబెటిస్‌కు దారి తీస్తుందంటున్నారు. ఇక రొమ్ము క్యాన్సర్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ లైంగిక సంబంధాలతో వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నాం.. ఎన్సీడీ ప్రోగ్రాంలో భాగంగా బీపీ, షుగర్, రొమ్ము, సర్వైకల్, నోటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నాం. బీపీ, షుగర్ ఉన్నవారికి నెలనెలా మందులను పంపిణీ చేస్తున్నాం. క్యాన్సర్ అనుమానాలు, లక్షణాలు కనిపిస్తే స్థానికంగా ప్రాథమిక నిర్ధారణ చేసి రొమ్ము, ఇతర క్యాన్సర్‌ను గుర్తించేందుకు పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నాం. జీవనశైలితో వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యాయామంతో రోగాలు దరిచేరకుండా ఉంటాయి. – డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వారికి అధిష్టానం పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్‌కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్‌కు ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్‌కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్‌లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా గందరగోళం పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీలు ఖరారు ఉమ్మడి వరంగల్‌లో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ -
ఏఐ శిక్షణ పూర్తి
భూపాలపల్లి: ఉత్తరాఖండ్ రాష్ట్రం మసూరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మక ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ విజయవంతంగా పూర్తి చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు నిర్వహించిన ‘డిజిటల్ రూపాంతరణ కోసం ఏఐ చాంపియన్స్ ప్రోగ్రాం’లో రాహుల్ శర్మ పాల్గొన్నారు. భవిష్యత్‌లో జిల్లాలో పరిపాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఈ శిక్షణ ఉపయోగపడనుంది. రాష్ట్రం నుంచి ఎంపికై న కలెక్టర్లలో రాహుల్ శర్మ ఒకరు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రజలకు త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఏఐ శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రం నుంచి ఈ ప్రతిష్ఠాత్మక శిక్షణ కార్యక్రమానికి తనను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఆధునిక సాంకేతికతలను వినియోగించి ప్రజాసేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గెలుపోటములు సహజం భూపాలపల్లి అర్బన్: క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కృష్ణకాలనీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను శనివారం జీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. గెలిచిన వారు వినయంగా ఉండాలని.. ఓడిన వారు నిరుత్సాహ పడకుండా మరింత శ్రమించి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్కుమార్, సింగరేణి అధికారులు శ్యామ్‌సుందర్, శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రచారి, కార్యదర్శి రమేస్, సభ్యులు శ్రీను, అభి, హేమంత్, రాజ్‌కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. రామప్పలో అమెరికన్లు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన రోలండో అలెక్టెరియా, రేటా హెంగ్‌లు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. -
ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
మల్హర్: మండలంలోని తాడిచర్లలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు జీవనోపాధి పెంపొందించడానికి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో మంత్రి శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ, రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, తాడిచర్ల ఉప సర్పంచ్ బబ్బిలి రాజు, డీపీఎం గోవింద్ చవాన్, ఏపీఎం హనుమంతరావు, సీసీలు, వీఓలు పాల్గొన్నారు. మహిళలకు ఆర్థిక చేయూత కాళేశ్వరం: కుట్టు మిషన్ల ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలం పలుగుల గ్రామంలో కుట్టు మిషన్ కేంద్రాన్ని సర్పంచ్ గారె విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఏపీఓ రాజన్న, ఐకేపీ సిబ్బంది శశి, ఉప సర్పంచ్ చంద్రయ్య, దేవస్థానం మాజీ డైరెక్టర్ మెంగాని అశోక్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
రేపే రైతు భరోసా
భూపాలపల్లి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో రేపు జమ కానున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి పెట్టుబడి సహాయం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 22నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు ఉపశమనం.. యాసంగి సీజన్ ప్రారంభమై సుమారు మూడు నెలలు కావస్తుంది. జిల్లాలోని 1,08,418 మంది రైతులు ఈ సీజన్లో వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయలు తదితర పంటలను సాగుచేశారు. సరిగ్గా పెట్టుబడి సమయంలో రైతు భరోసా అందలేదు. దీంతో రైతులంతా స్థానిక అడ్తీ, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ప్రస్తుతం పంటలు చేతికొచ్చే దశలో ఉండగా, ఇప్పటికీ మొక్కజొన్న, అరటి, కూరగాయలు లాంటి పంటలు సాగుచేస్తున్న రైతులు ఇంకా ఎరువులు, క్రిమిసంహారక మందులకు డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయనుండటంతో రైతులకు కొంతమేరకు ఉపశమనం కలగనుంది. ప్రతీ ఒక్కరికి ఎకరాకు.. గతంలో ఎకరం వరకు ఉన్న రైతులకు తొలుత, తరువాత రెండెకరాలు.. ఇలా పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించేది. ఈసారి ఎన్ని ఎకరాలు ఉన్నా.. తొలుత ఒక ఎకరానికి, తరువాత రెండు ఎకరాలకు.. ఇలా విస్తీర్ణం ఆధారంగా దఫాల వారీగా పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఫలితంగా జిల్లాలోని 1,08,418 రైతులకు తొలిరోజు అనగా రేపు(ఆదివారం) ఒక ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా సహాయం అందనుంది.మండలం రైతుల జమకావాల్సిన సంఖ్య డబ్బులు(రూ. కోట్లలో)భూపాలపల్లి 14,128 రూ. 16.12 చిట్యాల 13,068 రూ. 15.80 మొగుళ్లపల్లి 12,093 రూ. 13.16 రేగొండ 12,353 రూ. 12.31 టేకుమట్ల 10,949 రూ. 11.04 గణపురం 8,433 రూ. 7.30 కొత్తపల్లిగోరి 7,251 రూ. 6.58 మహాముత్తారం 7,987 రూ. 7.38 కాటారం 8,566 రూ. 6.93 మల్హర్ 6,924 రూ. 5.88 మహదేవపూర్ 5,080 రూ. 4.08 పలిమెల 1,586 రూ. 1.38 రైతుల ఖాతాల్లో జమ కానున్న డబ్బులు తొలుత ప్రతీ రైతుకు ఒక ఎకరాకు.. జిల్లాలో 1,08,418 మంది లబ్ధిదారులు -
కూరగాయల సాగుతో అధిక లాభాలు
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్కుమార్మల్హర్(కాటారం): రైతులకు తక్కువ కాలంలో ఆదాయం అందించే ముఖ్యమైన పంటగా కూరగాయల సాగు నిలుస్తుందని, సరైన ప్రణాళికతో సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్ అన్నారు. శుక్రవారం కాటారం మండలం గంగారం గ్రామంలో సునీల్ ఆధ్వర్యంలో ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజన్‌కు అనుగుణంగా సరైన రకాలు ఎంపిక చేసుకోవడం, నాణ్యమైన విత్తనాల వినియోగం, సమతుల్య ఎరువుల వినియోగం, తగినంత నీటి నిర్వహణ, మల్చింగ్ విధానం వంటి ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుబడి, నాణ్యత పెరుగుతుందని చెప్పారు. ఇంటి వద్ద చిన్న స్థాయిలో కూరగాయల తోటలు (కిచన్గార్డెన్) ఏర్పాటు చేసుకోవడం ద్వారా కుటుంబానికి పోషకాహారం అందడమే కాకుండా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని సూచించారు. గంగారం గ్రామంలో దాదాపు ప్రతి కుటుంబం కూరగాయల సాగుపై ఆధారపడి జీవనోపాధి పొందుతుందని చెప్పారు. కూరగాయల పంటలలో కనిపించే ముఖ్యమైన చీడపీడలు, వ్యాధులను సమయానికి గుర్తించి సమగ్ర కీటక నియంత్రణ (ఐపీఎం) పద్ధతులను అనుసరించడం ద్వారా ఖర్చు తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చని రైతులకు వివరించారు. అనంతరం పందిరి నిర్మాణం చేపట్టిన రైతులకు అందించే ప్రోత్సాహకాలు, ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న ఉచిత కూరగాయల మినీ కిట్లను సర్పంచ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యా న విస్తరణాధికారి రాందాస్, రైతులు పాల్గొన్నారు. మంగపేట: మండలంలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో ఆల య కార్యనిర్వాహణ అధికారి రేవెల్లి మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మందరగిరి వేంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్ పర్యవేక్షణలో స్వామివారి ప్రధాన ఆలయం, ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 9 హుండీల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను కల్యాణ మండపంలో లెక్కించారు. డిసెంబర్ 3 నుంచి ఈనెల 19వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.12,59,594ల ఆదాయం వచ్చినట్లు ఈఓ మహేష్ తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఎస్సై టీవీఆర్ సూరీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ పూజారులు శ్రీవారి సేవాసమితి బృందం, భక్తులు పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు షాక్!
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026రాష్ట్ర బడ్జెట్2026–2027బడ్జెట్లో అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం ఓరుగల్లుకు కీలకంగా 10 ప్రాజెక్టులు... జరగని ప్రత్యేక కేటాయింపులు.. కొత్తగా ప్రాజెక్టులను ప్రకటించలేదు. అయితే బడ్జెట్ (ప్రగతి పద్దు)లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, విద్యాసంస్థలకు నిధులు కేటాయించారు. ప్రధానంగా వరంగల్ నగరాభివృద్ధి, ఉన్నతవిద్య, పర్యాటక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపించింది. అయితే, కీలకమైన 10 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించినా.. ప్రత్యేకంగా కేటాయించే నిధులను ప్రస్తావించలేదు. రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్కు, మామునూరు ఎయిర్పోర్ట్, ఐటీ టవర్, రింగ్‌రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాతీయస్థాయి యూనివర్సిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, టూరిజం సర్క్యూట్‌కు ప్రత్యేక కేటాయింపులు లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా వరంగల్ స్మార్ట్‌సిటీకి గత బడ్జెట్లో రూ.156.52 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సహాయం కోసం రూ.40 కోట్లు కేటాయించింది. పథకం కింద వరంగల్ స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల కోసం రూ.44,137.02 లక్షలు కేటాయించారు.● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● కేటాయింపుల్లో ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళా సంక్షేమానికి పెద్దపీటసాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. శాసనసభలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రగతిపద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ వరంగల్ పేరుతో ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైన ఈ బడ్జెట్‌పై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రచారం చేసిన టెక్స్టైల్ పార్కు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు కేవలం కొనసాగింపు నిధులే కేటాయించగా.. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు పూర్తిగా కనిపించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్లో కొత్తగా మెగా ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించకపోవడం.. ప్రత్యక్ష కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం యూనిట్‌గా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, రైతు, కార్మికవర్గాలకు ప్రయోజనం కలగనుంది. కాగా, ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపుల ద్వారా ఉమ్మడి వరంగల్‌కు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు పరోక్షంగా లాభం చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ● వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ● ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ● ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్‌లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. ● గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్‌మెంట్‌కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్‌లోని రీజినల్ సైన్స్ సెంటర్‌కు రూ.30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు -
కాళేశ్వరాలయంలో ‘పంచాంగ పఠనం’
కాళేశ్వరం: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో వేదపండితులు భక్తులకు ‘పంచాంగ పఠనం’ చేశారు. గురువారం సాయంత్రం ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి పణీంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు బైకుంఠపాండాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాశులవారీగా ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలను వివరించారు. అనంతరం ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, ఉప సర్పంచ్ చెమ్మాల సుధీర్, మాజీ సర్పంచ్‌లు వసంత, రాంరెడ్డి, మాజీ డైరెక్టర్లు సమ్మయ్య, శ్యాందేవుడా, కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, గందెసిరి సంతోష్, రామన్న, రమేష్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణాకాలనీ సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ విశ్వనాధ మహర్షి హాజరుకానున్నట్లు తెలిపారు. చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండెదడ, బీపీ, ఘగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, ఆస్తమా, సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటుందని తెలిపారు. మల్హర్/మల్హర్(కాటారం): మండలంలోని కాటారం గ్రామానికి చెందిన విద్యారంగం, సామాజిక సేవలో నాలుగు దశాబ్దాలుగా విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ విద్యావేత్త జనగామ కరుణాకర్‌రావుకు రాష్ట్రస్థాయి ఉగాది ఉత్తమ సేవారత్న పురస్కారం లభించింది. గురువారం జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో కరుణాకర్‌రావు రాష్ట్ర స్థాయి సేవారత్న పురష్కరాన్ని అందుకున్నారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన సాయివాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ వీరమేని సంపత్‌రావుకు రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార అవార్డు అందుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తదితరులు కరుణాకర్‌రావు, సంపత్రావులను అభినందించి, సత్కరించారు. పోచమ్మ బోనాలు టేకుమట్ల: మండలకేంద్రంలోని పోచమ్మతల్లి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. భక్తులు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. మహాముత్తారంలో వడగళ్ల వాన మల్హర్(మహాముత్తారం): మండలంలోని పోలారం, కనుక్కునూరు, నిమ్మగూడెం, యత్నారం, సింగంపల్లి తదితర గ్రామాల్లో గురువారం వడగళ్ల వాన కురిసింది. తోటల్లోని మిర్చి నేలరాలింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోయింది. తడిసిన పత్తి నల్లబారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రామప్పలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ అధికారులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌పై శిక్షణ ఇచ్చే అధికారులు సచిన్ బాద్షా, తరుణ్‌గుప్తా, ఇవాన్ అలెగ్జాండర్, అంజన వశిష్టలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని వారు కొనియాడారు. వారి వెంట కోఆర్డినేటర్ సందీప్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు, ఏఎస్సై సాంబారావు, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, భద్రు పాల్గొన్నారు. -
ఉదయ భాస్కర్‌కు అర్చకరత్న అవార్డు
గోవిందరావుపేట: బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ దక్షిణ భారత కాన్ఫరెన్స్‌లో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ అర్చకుడు తిరుక్కోవల్లూరు ఉదయ భాస్కర్‌కి అర్చక రత్న అవార్డు ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పండితులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని, అర్చక వృత్తి పరిరక్షణలో ఉదయ్ భాస్కర్ చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ అర్చక రత్న అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్చకుల స్థాయి పెంపు, వారికి అవసరమైన శిక్షణ, మద్దతు అందించాల్సి ఉందని వివరించారు. -
రంజాన్ మాసం క్రమశిక్షణకు ప్రతీక
భూపాలపల్లి: రంజాన్ మాసం క్రమశిక్షణ, త్యాగం, దాతృత్వానికి ప్రతీక అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సాయంత్రం పోలీసు అధికారులు, సిబ్బందికి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఇఫ్తార్ విందు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో మతసామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పండుగలను సమష్టిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో ఐక్యతను మరింత బలపరిచే పండుగగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్‌చైర్మన్ అంబాల శ్రీనివాస్, అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
గుంతలమయంగా రహదారి రేగొండ మండలంలో రహదారులు పూర్తిగా గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినటం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరపరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేమి చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, చీమ చింత, మల్బరీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటుచేసి అక్కడక్కడ డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్, పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడి కక్కడ సిమెంటు ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
మొబైల్, మద్యం మాయలో..
● ఆన్లైన్ గేమ్స్‌తో కష్టాలు ● పలు కేసుల్లో మైనర్లు అరెస్ట్ ● అప్పులతో పెరుగుతున్న ఆత్మహత్యలుమొబైల్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంట్లో ప్రతీఒక్కరికి మొబైల్ సాధారణమైంది. కొందరు మొబైల్‌ను మంచి కోసం ఉపయోగిస్తుంటే మరికొందరు మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్‌కు, చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువగా వాహనాలను నడిపేవారు మొబైల్లో మాట్లాడుతూ నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యువత లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తేనే సమాజంలో తమకంటూ గుర్తింపు వచ్చి తమ జీవితాలను అందంగా మార్చుకునే వీలుందని అభిప్రాయపడుతున్నారు. -
ఉగాది సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
భూపాలపల్లి రూరల్: ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మంజూర్‌నగర్‌లో ఇల్లందు క్లబ్ హౌజ్‌లో శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉగాది పురస్కారాలు–2026 సంజీవనం పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, సంప్రదాయ విలువలను పెంపొందిస్తాయన్నారు. ‘సంజీవనం’ వంటి పుస్తకాలు మన సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్ తరాలకు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యగౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కౌన్సిలర్లు, ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
హక్కులు, బాధ్యతలపై అవగాహన ఉండాలి
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ భూపాలపల్లి: వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సురక్షితమైన ఉత్పత్తులు–నమ్మకమైన వినియోగదారులు’ అనే నినాదంతో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యత లేని వస్తువులు కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కొనుగోలు సమయంలో బిల్లులు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచాలన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, డీఎం రాములు, డీఎంహెచ్ఓ మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సకాలంలో సరఫరా చేయాలి ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో సీరియల్ క్రమాన్ని పాటించాలని, వినియోగదారులకు సకాలంలో సిలిండర్ సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల సమావేశంలో జిల్లాలోని అన్ని ఎల్పీజీ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఏజెన్సీల వారీగా స్టాక్ లభ్యత, రోజువారి సరఫరా పరిస్థితి, ఆయిల్ కంపెనీలకు పంపిన ఇండెంట్లు, పెండింగ్ బుకింగ్స్ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ ప్రతీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టే శుభదినమన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రజలందరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ పండుగ ప్రతిఒక్కరికి సు ఖసంతోషాలను తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం పరిధిలోని పురాతన విగ్రహాల పరిరక్షణకు పు రావస్తు శాఖ, దేవాదాయశాఖ సంయుక్తంగా శ్రీకారం చుట్టారు. బుధవారం ఈఓ మహేష్‌తో కలిసి పు రావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మా ధవి, డిప్యూటీ సూపరింటెండెంట్ కోటయ్యలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందుగా కాళేశ్వరంలోని పురాతనమైన నృసింహస్వామి, సోమేశ్వరాలయం, చంద్రశేఖరాలయాలు, కాళేశ్వరాలయం ఆవరణలోని పురాతన విగ్రహాలను, వివిధ ప్రాంతాల్లో నిరాధరణకు గురైన చారిత్రక విగ్రహాలను అధికారులు పరిశీలించారు. నిబంధనల మేరకు విగ్రహాలను రసాయన పదార్థాలతో శుభ్రం చేసి మెరుగులు దిద్దడం, భక్తులు, పర్యాటకుల సందర్శనార్థం దేవాలయ ఆవరణలోనే ప్రత్యేకంగా భద్రపరస్తామని అధికారులు తెలిపారు. రూ.120 కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. -
ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు
మొగుళ్లపల్లి: ఉద్యాన పంటల సాగుతో అధిక లా భాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఇస్సిపేట గ్రామంలో ఉద్యాన పంటల సాగుపై అవగాహన, శిక్షణ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యత, తక్కువ నీటితో అధిక ఆదాయం పొందే విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సురేందర్‌రెడ్డి, జైన్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధి శ్యాంసుందర్, సర్పంచ్ యార ముకుందం, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు వాసు, ప్రీతం, అజయ్, రమేష్, జైన్, ఫినోలెక్స్ కంపెనీ ప్రతినిధులు శ్యామ్ కు మార్, రజనీకాంత్, రైతులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్ -
ఉగాది భవిష్యత్‌కు పునాది
వేప పూత పులకరింతలు, మామిడి పిందెల పలకరింతలు, మోదుగచెట్ల మధురిమలు. తీరొక్క పూల పరిమళాలు.. నూతనత్వానికి ఆనవాళ్లు.. నూతన సంవత్సరాది వేడుకలు. – హన్మకొండ కల్చరల్తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ పండుగ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. సౌభాగ్యానికి , ప్రేమ, ఆధ్యాత్మిక చింతనకు, పల్లెల్లోని జానపదుల జీవనశైలికి సంకేతంగా నిలుస్తోంది. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడుతారు. పంచాంగం విని భవిష్యత్‌కు పునాది వేసుకుంటారు. కొత్త మజిలీలను వెతుక్కుంటారు. ‘శ్రీపరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నేడు (గురువారం) ఉగాది పర్వదినం జరుపుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పచ్చడి ప్రత్యేకత.. కాలాన్ని బట్టి వచ్చే పండుగల్లో ఆయా కాలాల్లో పండించిన వాటిని దేవుడికి నివేదించడం ప్రకృతిపై ప్రేమతో మనిషి ఏర్పర్చుకున్న నియమావళి. అదేవిధంగా చైత్రమాసం నాటికి ప్రజలు తాము కొత్తగా పొందే చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేప పూతను కొత్తకుండలో వేసి పచ్చడిగా చేసి భగవత్ నివేదనలుగా సమర్పిస్తారు. తెలంగాణలో ఉగాది పచ్చడిని పానీయంలా చేయడం సంప్రదాయం. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు. కానీ నీళ్లలో కలిపి పానీయంగా తాగితే ఎండాకాలంలో మండుటెండల నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళస్నానం.. కొత్త సంవత్సరంలో కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ శరీరంలోని పాత మురికిని తొలగించుకోవడం కోసం పండుగనాడు విధిగా నువ్వుల నూనెతో శరీరమంతా రుద్దుకొని ఒకగంట ఆగిన తర్వాత తలస్నానం చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. పండుగనాడు నువ్వుల నూనెతో చేసే స్నానాన్ని మంగళస్నానంగా పిలుస్తుంటారు. మంగళస్నానం ఆచరిస్తే శరీర, మనసులోని మలినం పోతుందని హిందువులు నమ్ముతుంటారు. వేయిస్తంభాల గుడిలో ప్రత్యేకం.. చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి ఆలయంలో 48 ఏళ్లుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి మహాన్యాసకపూర్వక పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, కాళికాపూజ, శ్రీసీతారాముల విగ్రహప్రతిష్ఠాపన పూజలు, భక్తులకు ఆరోగ్య ఐశ్వర్య విద్యశాంతి ఒనగూరాలని సంకల్పిస్తూ సుదర్శన హోమం నిర్వహిస్తున్నట్లు.. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెబుతున్నారు. సాయంత్రం సంస్కృత పండితులు సముద్రాల శఠగోపాచార్యులుచే పంచాంగశ్రవణం, కూచిపూడి నృత్యాలు, కవి సమ్మేళనం జరుగుతాయని వేయిస్తంభాల దేవాలయం ఈఓ అనిల్‌కుమార్ తెలిపారు. రోడ్ల రద్దీ.. ఉగాది పండుగను పురస్కరించుకుని పండుగకు కావాల్సిన కొత్త బెల్లం, కొత్త చింతపండు, నోము దండలు, జంద్యాలు, కొత్త కుండలు, దీపాంతలు, వివిధ రకాల పూలు, మోదుగపూలు, మోదుగాకులు, ఇసుక, మర్రి ఊడలు, పసుపు కుంకుమ గంధం, మామిడాకులు తదితర వస్తు సామగ్రి కొనుగోలు చేయడానికి అమ్మడానికి వచ్చిన వారితో నగరంలోని పలు కూడళ్లలో రద్దీ ఏర్పడింది. శ్రీపరాభవ సంవత్సరంలో రాజు ‘గురువు’ శ్రీపరాభవ నామ సంవత్సరంలో గురువు రాజుగా, మంత్రిగా కుజగ్రహాలు ఉన్నాయి. ఫలితంగా గురువు రాజైతే పాలకులు కర్మాయుక్తులు, ధర్మయుక్తులు అవుతారు, ప్రభువులు సన్మార్గులు, నీతివేత్తలుగా జీవిస్తారు. ప్రజలు సుభిక్షం, ఆరోగ్యం, సుఖం కలుగుతాయి. మంత్రి కుజుడు కావున అగ్నిచేత దహనాలు, యుద్ధాలు తప్పవు. ఈ సంవత్సరం పాడి అభివృద్ధి, సుగంధ ద్రవాలు, బంగారం, ముత్యాలు, వస్తువుల ధరలు పెరుగుతాయి, రస జాతి వస్తువుల ధరలు తగ్గుతాయి. – గంగు ఉపేంద్రశర్మ రుషులు అందించిన అద్భుత విజ్ఞానమే పంచాంగం.. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు కలది పంచాంగం. దీన్ని మహా విష్ణుస్వరూపంగా భావించి పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి. నేటి ఆధునిక కాలపు నవీన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో భారతీయులు పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకునేవారు. ఎక్కడో ఉన్న గ్రహాలను వాటి దూరాలను ఎలాంటి టెలిస్కోప్ లాంటి ఖగోళ విజ్ఞాన శోధన పరికరాలు లేకుండా భారతీయ మేధావులు సృష్టించిన ఒకానొక అద్భుతమే పంచాంగం. – డాక్టర్ శ్రీఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి, ఆస్ట్రాలజర్పంచాంగ శ్రవణానికి ముస్తాబైన ఆలయాలు జిల్లాలో పండుగ సందడి జోరుగా వేపపువ్వు, కుండలు కొనుగోళ్లుబంచ్కు రూ.50 పలుకుతున్న ధర సాక్షి, వరంగల్: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వుకు ఈసారి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడడంతో కొమ్మలు మోడువారిపోయాయి. ప్రస్తుతం వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. కానీ ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేసుకునే వేప పువ్వుకు ఈసారి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. గ్రేటర్ వరంగల్‌లో బుధవారం రూ.20 నుంచి రూ.50 వరకు (చిన్న కట్ట, ఆకులతో కూడుకున్నది) వేప పువ్వును వ్యాపారులు విక్రయించారు. -
ర్యాగింగ్ శిక్షార్హ నేరం
భూపాలపల్లి అర్బన్: తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయడం శిక్షార్హ నేరమని ఎస్పీ సంకీర్త్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో మంగళవారం యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు పరస్పర గౌరవంతో, స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలన్నారు. ర్యాగింగ్‌తో మానసిక, శారీరక ఒత్తిడి కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ర్యాగింగ్ ఘటనలు గమనించిన వెంటనే ప్రొఫెసర్లు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అవసరమైతే హెల్ప్‌లైన్ 18001805522, డయల్ 100 వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఎస్పీ సంకీర్త్ -
నిలిచిన నిధులు..
భూపాలపల్లి రూరల్ : లాభసాటి వ్యవసాయం, చీడపీడల నివారణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. కొన్ని నెలలుగా నిధులు మంజూరు నిలిచిపోవడంతో వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 2022 వరకు నిర్వహణ నిధులు మంజూరు చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయాయి. జిల్లాలో 45 రైతువేదికలు గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌కు ఓ రైతు వేదిక నిర్మించింది. ప్రతీ 5వేల మంది కర్షకులకు రెండు నుంచి నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి వ్యవసాయశాఖ ద్వారా రూ.12 లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10లక్షలు వెచ్చించారు. జిల్లాలో 45 రైతువేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3వేల చొప్పున మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులు చాలవని వ్యవసాయశాఖ నివేదించడంతో రూ.9వేల చొప్పున విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్‌లో ఐదు నెలలకు సంబంధించి ఒక్కో వేదికకు రూ.45 వేల చొప్పున విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. సుమారుగా 40 నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఒక్కో రైతు వేదికకు ఇప్పటివరకు రూ.3.60లక్షల నిధులు రావాల్సి ఉంది. అంటే జిల్లాలోని 45 రైతువేదికలకు నిర్వహణ నిధుల కింద రూ.కోటి 62లక్షల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ రైతువేదికల నిర్వహణ తప్పనిసరి కావడంతో ఏఈఓలు సొంతంగా వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారు. క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు.. జిల్లాలోని 12 మండలాల్లో 45 క్లస్టర్లలో రైతువేదికలు నిర్మించి ఏఈఓలకు విధులు అప్పగించారు. వీటి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో రైతువేదికకు రూ.9వేలు మంజూరు చేసి నిర్వహణ కొనసాగించింది. ఈ నిధులతో రైతువేదికల్లో తాగునీటి కోసం రూ.500, పారిశుద్ధ్య నిర్వహణకు రూ.3వేలు, స్టేషనరీ కోసం రూ.వెయ్యి, కరెంట్ బిల్లు కోసం రూ.వెయ్యి, మరమ్మతుల కోసం రూ.వెయ్యి, నెలలో ఎనిమిదిసార్లు రైతులతో సమావేశాలు నిర్వహించనుండగా టీ, స్నాక్స్ కోసం రూ.2,500 ఖర్చు చేయాల్సి ఉంది. కొన్ని నెలలుగా రైతువేదికలకు నిర్వహణ నిధులు ఆగిపోయాయి. కలెక్టర్ ఆదేశానుసారం నిర్వహణ లోపం లేకుండా చూస్తున్నాం, రైతులకు సేవలు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా ఏఈఓలు చూస్తున్నారు. నిధులు మంజూరు కాగానే రైతు వేదికల పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేస్తాం. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారిమండలాలు 12 రైతువేదికలు 45 ఒక్కోదానికి బకాయి 3.60లక్షలు మొత్తం బకాయిలు 1.62 కోట్లుజిల్లాలోని రైతువేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈఓలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు కంప్యూటర్లు ఉన్న విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈఓలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు వారే చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాలని సూచించినా ఎక్కడా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగమయ్యాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా రైతువేదికల పెండింగ్ నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఇప్పటి నుంచి నెలనెలా నిధులు విడుదల చేయాలని ఏఈఓలు, రైతులు కోరుతున్నారు. అధికారులకు భారమైన నిర్వహణ కనీస వసతుల కల్పనపై పట్టింపేది? ఇబ్బందుల్లో రైతులు, ఏఈఓలు -
శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు
రేగొండ: రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని గాంధీనగర్ గ్రామంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగు ద్వారా మార్కెట్లో మంచి రేటు లభించి రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు. డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించడం ద్వారా పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి సురేష్ పాల్గొన్నారు. -
గ్యాస్ సరఫరాలో పారదర్శకతకు ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్, సింగరేణి కాలరీస్‌కు చెందిన భారత్ గ్యాస్ ఏజెన్సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, గ్యాస్ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల నిల్వ, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పాటించాలని సూచిస్తూ, గ్యాస్ సరఫరాలో జాప్యం లేకుండా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఎల్పీజీ డీలర్లు వినియోగదారుల బుకింగ్ సీక్వెన్స్‌ను తప్పనిసరిగా పాటిస్తూ గ్యాస్ రీఫిల్స్‌ను సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమాన్ని అతిక్రమించకూడదని ఆదేశించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మి కొందరు వినియోగదారులు అవసరానికి మించి బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. గ్యాస్ నిల్వలు, బుకింగ్స్, ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సిన సరఫరాపై పర్యవేక్షణ కోసం కలెక్టర్ రాహుల్‌శర్మ అధ్యక్షతన ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ రోజువారీ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్, ఇన్స్పెక్టర్ సురేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 6 గృహవినియోగ సిలిండర్ల స్వాఽధీనం జిల్లాలోని వివిధ బేకరీలు, చికెన్ సెంటర్లపై సివిల్ సప్లయి ఇన్స్పెక్టర్లు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి గృహ వినియోగ ఆరు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లయి ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లను వాణిజ్య వంటలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ వినియోగం వల్ల ప్రభుత్వానికి నష్టం కలగడమే కాకుండా, అర్హులైన గృహ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ -
కాళేశ్వరంలో అర్చకుడి నియామకం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అర్చకుడిగా కొడమంచిలి ఫణికుమార్శర్మను నియమించారు. మంగళవారం దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు పలు అభియోగాల నేపథ్యంలో కశ్యప్శర్మ నియామకాన్ని నిలిపివేశారు. ఆయన స్థానంలో కొడమంచిలి ఫణికుమార్ శర్మను నియమించినట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. పోలీస్‌స్టేషన్ తనిఖీ మల్హర్(మహాముత్తారం): మహాముత్తారం పోలీస్ స్టేషన్‌ను మంగళవారం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించి స్టేషన్ పరిసర ప్రాంతాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎస్సై మహేందర్‌కుమార్, ఎస్సై– 2 మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి పలిమెల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి మొదటి విడత గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ లోకిలాల్ లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని పలిమెల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్, పైలట్ ప్రాజెక్టు విలేజ్ పంకెన గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని అధికారులతో కలిసి అయన పరిశీలించారు. ఈ సందర్భంగా లోకిలాల్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాగె వైకుంఠం, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ సందీ ప్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంఘం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ పన్నులు ఆన్లైన్లో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాపారస్తులు ఈ నెల 31వ తేదీలోపు పెనాల్టీ లేకుండా పన్ను చెల్లించాలని సూచించారు. గడువు తరువాత ఏప్రిల్ 30 వరకు 25శాతం, మే 1 తరువాత 50 శాతం పెనాల్టీ విధించనున్నట్లు హెచ్చరించారు. పన్ను చెల్లింపును కార్యాలయంలో లేదా సీడీఎంఏ తెలంగాణ ఆన్లైన్ ద్వారా చేయవచ్చని తెలిపారు. -
నల్ల బ్యాడ్జీలతో నిరసన
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పాత విధానంలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలని ఏఐటీయూసీ బ్రాంచీ సెక్రటరీ మోటపలుకుల రమేశ్ డిమాండ్ చేశారు. సేవ్ సింగరేణి బస్ యాత్రలో భాగంగా మంగళవారం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ఈ నెల 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గనుల కార్మికులు, యూనియన్ నాయకులు శ్రీనివాస్, ఆసిఫ్‌పాషా, శంకర్ పాల్గొన్నారు. -
న్యూ కనెక్షన్ ఇక ఈజీ..
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026గతంలో కొత్తలైన్లకు జౌట్ రైట్ కంట్రిబ్యూటర్ చార్జీలు వసూలు చేసేది. దీంతో కొత్తలైన్లు, కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి చార్జీలు చెల్లించలేని వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యూలేషన్ కమిషన్ సులభతరంగా పారదర్శకంగా ఒక కిలోమీటర్ వరకు ఉచితంగా సర్వీస్ లైన్లు అందే విధంగా ఆదేశాలు జారీచేసింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.హన్మకొండ: నూతన విద్యుత్ సర్వీస్‌ల మంజూరును విద్యుత్ పంపిణీ సంస్థలు సులభతరం చేశాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రెగ్యులేషన్ నంబర్ 1 ఆఫ్ 2026 జారీ చేసింది. దీని ప్రకారం విద్యుత్ వినియోగదారులకు మరింత సులభతరంగా, పారదర్శకంగా సర్వీస్ పొందే అవకాశం కలిగింది. కొత్త ఎల్టీ కనెక్షన్లు, అదనపు లోడ్ కోసం సర్వీస్ లైన్చార్జీలను సరళంగా, ఏకరీతిగా నిర్ణయించారు. ఒక కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి చార్జీలూ వర్తించవు. కిలోమీటర్ దూరం తర్వాత పొందే విద్యుత్ సర్వీస్‌కు మాత్రమే సర్వీస్ లైన్, ఇతర చార్జీలు చెల్లించాలి. లోడ్ ఆధారంగా మాత్రమే చార్జీలు విధిస్తారు. క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన అవసరం లేకుండా త్వరితగతిన కొత్త సర్వీసులు మంజూరు చేస్తారు. ఈ విధానం టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో అమలు చేస్తున్నారు. ఈ నూతన విధానం ద్వారా వినియోగదారులు విద్యుత్ కనెక్షన్‌ను వేగంగా పొందుతారు. చార్జీల చెల్లింపులో స్పష్టత ఉంటుంది. 20 కిలోవాట్ వరకు డెవలప్మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలు వర్తింపు. 20 కిలోవాట్ పై వాటికి కేవలం సర్వీస్ లైన్చార్జీలు మాత్రమే వర్తిస్తాయి. డెవలప్మెంట్ చార్జీలు ఉండవు. – మల్చూర్ నాయక్, ఎస్ఈ, జయశంకర్ భూపాలపల్లి నూతన విద్యుత్ సర్వీస్‌ల మంజూరు నిబంధనలు మరింత సులభతరంకిలోమీటర్ దూరం వరకు ఎలాంటి చార్జీలు లేవు.. సర్వీస్ లైన్ చార్జీలను సరళం చేసిన విద్యుత్‌పంపిణీ సంస్థలు అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీ స్టోర్ భవనాలకు మొత్తం కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు విధిస్తారు. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు భారం వినియోగదారునిపై పడదు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు బాధ్యత విద్యుత్ సంస్థదే. నూతన ఏకరీతి విధానం రైతులకు ఎంతో ఉంటుంది. అధిక ఖర్చుల భారం పడదు. ఒక కిలో వాట్‌కు కేవలం రూ.1000 మాత్రమే చెల్లించాలి. కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు -
నకిలీ హాజరుకు చెక్
భూపాలపల్లి రూరల్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా నిధుల దుర్వినియోగం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో పథకంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు. ఇక నకిలీ హాజరు నమోదుకు చెక్ పెట్టేందుకు పనులకు హాజరయ్యే కూలీలకు ముఖగుర్తింపు హాజరు(ఎఫ్ఆర్ఎస్) చేస్తున్నారు. మార్చి 2 నుంచి కొత్త యాప్‌లో కూలీల హాజరు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కూలీల హాజరు తీసుకునే సమయంలో కూలీ ఫొటో, ఈకేవైసీ ప్రక్రియలో పొందుపరిచిన ఫొటో ఒకేలా ఉంటేనే హాజరు నమోదవుతుంది. నూతన యాప్‌తోనే.. గతేడాది ఆగస్టు నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్‌లో జిల్లాలోని కూలీల ఈ కేవైసీ ప్రక్రియ ఉపాధి హామీ సిబ్బంది పూర్తి చేశారు. తర్వాత ఎన్ఎంఎంఎస్ నూతన యాప్‌ను క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, మేట్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నూతన యాప్‌లో కూలీల హాజరును నమోదు చేస్తున్నారు. నమోదు ఇలా.. పని ప్రదేశానికి వెళ్లిన క్షేత్ర సహాయకులు ముందుగా యాప్‌లో పనులకు వచ్చిన వ్యక్తి పని ఐడీ నంబర్ ఎంచుకుని మాస్టర్‌లో కనిపించే పేర్లపై కూలీ ఫొటో తీసి నమోదు చేస్తున్నారు. అప్పుడు ఈ కేవైసీ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం తీసిన ఫొటో ఒకరిదే అయితే కూలీ హాజరు నమోదు అవుతుంది. పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కూలీ పనులకు వచ్చిన మొత్తం సభ్యుల గ్రూపు ఫొటో మరోసారి తీసి యాప్‌లో నమోదు చేస్తారు. ఇలా రెండుసార్లు ఫొటో తీసి ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియ ద్వారా నిత్యం కూలీ పనులకు వచ్చేవారి హాజరును నమోదు చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదుతో కూలీలకు డబ్బులు చెల్లింపు సమయంలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో అనేక సంఘటనలు.. జిల్లా వ్యాప్తంగా 1,06,033 జాబ్ కార్డులు ఉన్నాయి. 2,26,233 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 6,97,226 యాక్టివ్ జాబ్ కార్డులు, 1,24,549 మంది కూలీలు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఒకరికి బదులు మరొకరు కుటుంబ సభ్యులు పనులకు వెళ్లి హాజరు వేసుకున్నట్లు ఘటనలు సామాజిక తనిఖీల్లో పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధ్యుల నుంచి నిధులు రికవరీ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో నకిలీ హాజరు నమోదుకు ఆస్కారం ఉండదని అధికారులు అంటున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన యాప్‌తో నకిలీ హాజరు ఉండదు. అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. పనులకు వచ్చిన వారికే కూలీ వస్తుంది. హాజరు శాతంలో పారదర్శకత ఉంటుంది. – బాలకృష్ణ, డీఆర్డీఓగ్రామపంచాయతీలు 248 జాబ్ కార్డులు 1,06,033 కూలీల సంఖ్య 2,26,270 యాక్టివ్ జాబ్ కార్డులు 69,726 యాక్టివ్ కూలీల సంఖ్య 1,24,349 నూతన యాప్‌తోనే నమోదు ముఖం ఫొటోతోనే గుర్తింపు ఈ కేవైసీతో సరిపోతేనే కూలీ నమోదు -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని, అన్యాయానికి గురైన వారికి అండగా నిలవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా దివస్ కార్యక్రమంలో 15 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పీపీ వాదనలతో నిందితులకు శిక్షలు జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలతో చాలా మంది నిందితులకు శిక్షలు పడ్డాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. క్రిమినల్ కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్న పీపీ శ్రీనివాస్‌ను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అభినందించి ప్రశంస పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీపీ శ్రీనివాస్ కృషి ద్వారా మొత్తం 12 కేసుల్లో దోష నిర్ధారణ జరిగిందన్నారు. అందులో ఏడు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో కనీసం 10 సంవత్సరాల కారాగార శిక్షను కోర్టు విధించిందని ఎస్పీ వెల్లడించారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
లక్ష్మీదేవర బోనాలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల పంచాయతీలో లక్ష్మీదేవర బోనాల పండుగను గ్రామస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో ఆటపాటలతో బోనం సమర్పించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారె విజయలక్ష్మి శంకర్, ఉపసర్పంచ్ ఓద్ది చంద్రయ్య, నాయకులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ మేనేజర్‌కు వినతి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో రెండు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సింగరేణి సెక్యూరిటీ గార్డులకు రన్నింగ్టెస్ట్ నిబంధన తొలగించాలని సోమవారం కొత్తగూడెం కార్పొరేట్ సెక్యూరిటీ మేనేజర్‌కు ఏఐటీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది ప్రతినిధి బౌతు కమలాకర్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా సంస్థ ఆస్తుల రక్షణలో నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్త టెండర్ ప్రక్రియలో భాగంగా రన్నింగ్ టెస్ట్ నిర్వహించే నిబంధనతో 45నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అనుభవజ్ఞులైన పాత సిబ్బంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత సిబ్బందికి రన్నింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ సిబ్బంది మేరుగు రమేష్, కుమారస్వామి, రాజు, కటకం సతీష్, భోగి రాజేందర్, మారం రామిరెడ్డి, సతీష్ పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ పరిస్థితుల పేరుతో గ్యాస్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. క్రూడాయిల్ ధరల మార్పులను కా రణంగా చూపుతూ ప్రజలపై భారాన్ని మో పడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, యాకుబ్ పాషా, గోలి లావణ్య, ఎండీ సాబీర్, పొనగంటి లావణ్య పాల్గొన్నారు. రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేటలో ఓ ఇంటి వద్ద గుడుంబా తయారు చేసి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్సై సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఆ ఇంట్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేసి అమ్ముతున్న మంద పరుశురాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా గుడుంబా అమ్మినట్లయితే తమకు సమాచారం అందించాలని కోరారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో 2023లో జరిగిన హత్య కేసులో కోర్టు విచారణకు హాజరు కాని ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన పాగే అనిల్, భూపాలపల్లికి చెందిన గోల్కొండ శివ పలుమార్లు కోర్టు విచారణకు హాజరు కాలేదు. మెజిస్ట్రేట్ వారిపై నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. సోమవారం ఎస్సై పవన్ కుమార్ నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. -
పెండింగ్ సమస్యలపై వినతి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఎంఓఏఐ భూపాలపల్లి అధికారుల సంఘం ప్రతినిధులు సోమవారం ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు ఎండీ నజీర్ మాట్లాడుతూ..కోలిండియా లిమిటెడ్‌లో అమలవుతున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణి అధికారులకు కూడా అమలు చేయాలని కోరారు. కోలిండియాలో చెల్లిస్తున్న అన్ని భత్యాలు, పే అప్‌గ్రేడేషన్, పీఆర్పీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు ప్రకటించిన ఇతర భత్యాలను అధికారులకు కూడా అమలు చేయాలని, వివిధ పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. చార్జ్‌షీట్ విచారణలను పారదర్శకంగా నిర్వహించి త్వరితగతిన ముగించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ ఏరియా కార్యదర్శి అరుణ్, జాయింట్ ట్రెజరర్ సాయికృష్ణ, జాయింట్ సెక్రటరీ మన్నాన్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మిర్జా యాసిన్ బేగ్, అధికారులు శ్రీనాథ్, సమ్మిరెడ్డి, మహేందర్, జ్యోతి పాల్గొన్నారు. -
వ్యర్థాలు తిని వంద గొర్రెల మృత్యువాత
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారంలో భక్తులు పడేసిన వ్యర్థాలు (ఎండి పోయిన అన్నం) తిని సుమారు వంద గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా మరికెల మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు కొద్ది రోజుల క్రితం తనకున్న 200 గొర్రెలను తీసుకుని మేత నిమిత్తం తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతానికి వచ్చాడు. ఊరట్టం పంచాయతీ పరిధిలోని పెట్రోల్ బంక్ సమీపంలో గొర్రెల మంద పెట్టుకుని సమీప అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా గొర్రెలు అస్వస్థకు గురై సుమారు వంద మృత్యువాత పడ్డాయి. మేడారం వనదేవలతను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పడేసిన వ్యర్థాలు తినడంతో గొర్రెలు అస్వస్థకు గురై మృత్యువాత పడినట్లు బాధిత గొర్రెల యజమాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల పైగా నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరయ్యాడు. మిగతా గొర్రెలు కూడా అనారోగ్యంగానే కనిపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించాలని వేడుకున్నాడు. ములుగు: బాలల రక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు పేర్కొన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌రావు హాజరై మాట్లాడారు. జిల్లాలో నూతనంగా బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, 14 మంది జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. బాలల రక్షణపై అవగాహన కల్పించడం, ఆరేళ్లకు పైబడిన బాలలందరూ బడికి వెళ్లేలా చూడడం, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి బడిలో చేర్పించడం కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. -
అంతర్మథనం
భూపాలపల్లి అర్బన్: కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు గ్రామ సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదు. గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలలో సర్పంచ్‌లు తమ గ్రామ సమస్యలు అధికారులకు తెలిపేవారు. దీంతో అధికారులకు సర్పంచ్‌లకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు లేక మండల సభలు జరగడం లేదు. గత డిసెంబర్లో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు తమ గ్రామ సమస్యలు ఎలా తెలుపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకోసారి మండల సభలు గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్‌లు హాజరయ్యేవారు. డివిజన్ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యేవారు. మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమ శాఖ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయ, విద్య, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్దక, రెవెన్యూ ఇలా 11 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారి అధికారులు తమ నివేదిక చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. దీంతో సర్పంచ్‌లకు, మండల అధికారులకు మధ్య మంచి సంబందాలు ఏర్పడేవి. డివిజన్ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికలు అయ్యేవి. గడువు ముగిసిన వెంటనే గ్రామపంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీ రహదారులు, మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచ్‌లు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. మండలసభ ఏర్పాటుచేస్తే అధికారులకు, సర్పంచ్‌లకు మధ్య సమన్వయం ఏర్పడుతుందని అంటున్నారు. మండల పరిషత్ పాలక వర్గాలు లేక ఇబ్బందులు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో.. -
కలెక్టరేట్ ఎదుట ధర్నా
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో మూడంచెల పోరాట కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. 20న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. -
వినతులు పరిష్కరించండి..
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో బాధితుల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్ తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో 46 వినతులు రాగా అదనపు కలెక్టర్ సంపత్‌రావు స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 11 వినతులు రాగా డీడీ జనార్దన్, ఏవో రాజ్‌కుమార్‌లు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని అధికారులకు సూచించారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని భూపతిపురానికి చెందిన రైతు, వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన మరో రైతు ఇందిర సౌర జలగిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యాపురంలో కంటేజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి 28 నెలలుగా వేతనం రావడం లేదని ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లికి చెందిన రైతు రైతుబంధు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన ప్రజలు పెసా గ్రామసభ నిర్వహించాలని కోరారు. మిగిలిన వారు ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్(ఎస్డీసీ)అనిల్, మేనేజర్ శ్రీనివాస్, కొండల్రావు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్ ప్రజావాణిలో 46, గిరిజన దర్బార్‌లో 11 వినతులు స్వీకరణ -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
భూపాలపల్లి: సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 52 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, ఆ దరఖాస్తుల పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ -
కాన్షీరాం జయంతి వేడుకలు
భూపాలపల్లి రూరల్: కాన్షీరాం మహారాజ్ 92వ జయంతి వేడుకలు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏ సీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ మాట్లాడు తూ భారతదేశ రాజకీయ వ్యవస్థలో సామాజిక రాజకీయ, సాంస్కృతిక సమానత్వానికి పునా ది వేసిన బహుజన యోధుడు కాన్షీరాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నా యకులు సామల శ్రీనివాస్ కనకం మల్లయ్య, చిట్యాల శ్రీనివాస్, మంద రమేశ్, కోరళ్ల శ్యా మ్, పుల్ల అశోక్, చిర్ర శ్రీకాంత్ పాల్గొన్నారు. ‘గిరిజనేతరుల భూములను పంచాలి’ వాజేడు: వలస గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివాసులకు పంచాలని నవ నిర్మాణ సేన జిల్లా కన్వీనర్ ఎట్టి విద్యాసాగర్ అన్నారు. మండల పరిధిలోని గుమ్మడి దొడ్డిలో ఆదివారం హరినాథ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్టలో ఆచార్య వినోబాబావే భూదాన్ ట్రస్ట్ బర్డ్ ద్వారా పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం అక్రమంగా గుంజుకోవడం దారుణమన్నారు. పేదల భూములను లాక్కున్న ప్రభుత్వం షెడ్యూల్ ఏరియాలో ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి వలస గిరిజనేతరులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. వలస గిరిజనేతరుల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆదివాసులకు పంచాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు అశోక్, సునీల్, సూర్యం, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. పోచమ్మతల్లికి బోనాలు వాజేడు: మండల కేంద్రంలోని ప్రజలు ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ప్రతీ ఇంటి నుంచి బోనంతో మహిళలు తరలివెళ్లారు. పోచమ్మతల్లికి చీరె, సారె సమర్పించారు. కోళ్లను కోసుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా పోచమ్మ చెట్టు వద్దకు చేరుకున్న భక్తులు సల్లంగా సూడు పోచమ్మ తల్లి అంటూ మొక్కుకున్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ములుగు: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లిం మత పెద్దలతో, సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి నుంచి మత సామరస్యానికి, లౌకిక వాదానికి కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ, రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తిని కాపాడుతుందని వెల్లడించారు. పాలకులు ప్రజలందరినీ సమానంగా చూడాలన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలే తప్పా విద్వేషాలు రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. అనంతరం కలెక్టర్ దివాకరతో కలిసి ఈద్ కా తోఫా కానుకలను అందజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, నాయకులు భగవాన్‌రెడ్డి, వంగ రవియాదవ్ పాల్గొన్నారు. -
ప్రాదేశికం ఎప్పుడు?
రేగొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి దాదాపు 9 నెలలు కావస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఆ పదవులపై కన్నేసిన వారికి ఉత్కంఠ తప్పడం లేదు. గతేడాది జూలై 4వ తేదీన జెడ్పీ, మండల పరిషత్ సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి జిల్లా, మండల పరిషత్‌లు ప్రత్యేధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో 12 జెడ్పీటీసీ, 119 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఓటరు జాబితా సిద్ధం చేసింది. మారనున్న రిజర్వేషన్లు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు (42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం) కేటాయించినా, ప్రస్తుత పరిస్థితులతో అవి మారే అవకాశాలే అధికంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అప్పటి రిజర్వేషన్లను రెండు సార్లు అమలు చేయాలి. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాజకీయ సమీకరణాలతో కొత్త మండలం ఏర్పాటు కావడం, ఓటర్ల సంఖ్య పెరగడం లాంటి కారణాలతో రిజర్వేషన్లలో మార్పులు ఖాయమంటున్నారు. మూడు నెలలు ఆగాల్సిందేనా? ఇటీవల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం ఆ వెంటనే ప్రాదేశిక సమరానికి సిద్ధపడుతుందని ఆశావాహులు భావించారు. కానీ ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేస్తుందనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. అంతే కాదు ఎంపీపీ, జెడ్పీ చైర్ పర్సన్ స్థానాలకు పరోక్ష పద్ధతి కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఏ పద్ధతి అయినా ఎన్నికలు ఇప్పుడు నిర్వహించే పరిస్థితులైతే కనిపించడం లేదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వం చేపట్టడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. ఇంకా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఆశావహుల ఎదురుచూపు -
హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించారు. కలెక్టర్ దివాకర దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతుల గోత్ర నామాలతో స్వామివారికి అర్చనలు జరిపించి స్వామివారి, అమ్మవార్ల శేష వస్త్రాలను బహుకరించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
పలుగుల రోడ్డుకు మోక్షం
మల్లన్న బోనాలుమల్లన్న పట్నాలు వేస్తున్న భక్తులు మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలోని గోదావరి ఒడ్డున వెలిసిన మల్లన్న దేవుడి ఆలయంలో ఆదివారం మల్లన్న పట్నాలు, బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులతో పట్నాలు నిర్వహించి మల్లన్న దేవుడికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. భక్తులు డప్పుచప్పుళ్ల మధ్య శివశక్తుల పూనకాలతో భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్తులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. – కాళేశ్వరంకాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామానికి వెళ్లే ఆరు కిలోమీటర్ల ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. దశాబ్దకాలంగా ఇసుల రీచుల గుండా తరలివచ్చిన లారీలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రహదారిని పునర్నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రూ.22 కోట్లతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రహదారి అభివృద్ధి పనులకు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. కొన్నేళ్లుగా వర్షాకాలంలో రాత్రి ఆపదొస్తే కనీసం 108 అంబులెన్స్ వెళ్లలేని దుస్థితిలో ఈ రహదారి ఉంది. కీలక రవాణా మార్గం.. పలుగుల రహదారి పలుగుల టు కుంట్లం గ్రామాల ప్రజలకు కీలక రవాణా మార్గంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా రహదారి తీవ్రంగా దెబ్బతిని ప్రయాణికులకు నరకయాతనగా మారింది. ముఖ్యంగా ఇసుక రీచ్‌ల నుంచి వచ్చే భారీ లారీల రాకపోకలతో రహదారి ఆనవాళ్లు కోల్పోయి పూర్తిగా చెడిపోయింది. మోకాలు లోతు గుంతలు, దుమ్ము కారణంగా వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రయాణం చేయడం కూడా కష్టంగా మారేది. రహదారి నిర్మాణం పూర్తయితే పలుగుల, పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించుకునే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు రవాణా మెరుగుపడి కాళేశ్వరం పాఠశాలకు రానున్నారు. కొత్త రహదారి నిర్మాణంతో ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.22 కోట్లతో మంత్రి శంకుస్థాపన పదేళ్ల నరకయాతనకు చెక్ ఇసుక రీచుల లారీలతో ఆనవాళ్లు కోల్పోయిన రోడ్డు -
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
జిల్లాలో క్యాన్సర్ కేసుల వివరాలుభూపాలపల్లి అర్బన్: జిల్లాలో క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐదేళ్లలో 358 కేసులు నమోదయ్యాయి. పేదరికం, నిరక్షరాస్యతతో గ్రామీణులకు క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో ఏటా పదుల సంఖ్యలో మృతిచెందుతున్నారు. మొదట్లో గుర్తించకపోవడంతో చివరి దశలో ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. జిల్లాలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు.. జిల్లాలో ప్రతీ ఏట పదుల సంఖ్యలో క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దురలవాట్లు, జీవన శైలిలో మార్పులతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వ్యాధిపై అవగాహన ఉంటే ఆదిలోనే అరికట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. పురుషుల్లో నోటి, వివిధ రకాల క్యాన్సర్లు వస్తుండగా, మహిళల్లో రొమ్ము, సర్విక్ రకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ లేకపోవడంతో వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేసుకొని వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఇలా గుర్తించండి.. నోటి, రొమ్ము, సర్విక్ క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. రొమ్ములో గడ్డలు ఏర్పడితే మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. మలం, యూరిన్‌లో రక్తం, తెల్లబట్ట, ఎర్ర బట్ట, ఒక్కసారిగా బరువు తగ్గడం జరిగితే సర్విక్ క్యాన్సర్‌గా భావించి హెచ్‌పీవీ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి స్క్రీనింగ్ చేసుకోవడం ద్వార ముందస్తుగా గుర్తించే వీలుంటుంది. నోటి అల్సర్లు, దగ్గితే రక్తం పడటం, బరువు తగ్గడం లక్షణాలు కనిపిస్తే నోటి క్యాన్సర్ పరీక్ష చేయించాలి.హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో అప్రమత్తం క్యాన్సర్ దరిచేరకుండా ఉండేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు హెచ్‌పీవీ రెండు డోసుల్లో వేసుకోవాలి. 21 ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, చిట్యాల, మహదేవపూర్ సీహెచ్‌సీలో 14 నుంచి 15 ఏళ్ల పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మహిళల్లో అధికంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు అధికంగా నమోదుతున్నాయి. ఈ క్యాన్సర్‌ను నివారించాలని ముందస్తుగా బాలికలను వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాయామం చేయాలి.. క్యాన్సర్‌ను మొదట్లో గుర్తిస్తే నయం చేయొచ్చు. రొమ్ము, సర్విక్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే తొలి దశలోనే ఆస్పత్రికి వెళ్లాలి. నిత్యం అర గంట వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. రెడ్‌మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. – డాక్టర్ శ్రీదేవి, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి -
‘మేడిగడ్డ’ వినాశనానికి బాధ్యత వహించాలి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వినాశనానికి అప్పటి కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ప్రతినిధుల బృందం సభ్యులు పి.సుదర్శన్, బి.వెంకట్, సాయిబాబు, నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మహదేవపూర్ మండలంలో నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి), పెద్దపల్లి జిల్లా సుందిళ్లలో పార్వతి (సుందిళ్ల) బ్యారేజీలతో, పంపుహౌస్‌ను వారు ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. అక్కడ కుంగిపోయిన పియర్లు, దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు రూ.90 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ప్రజాధనాన్ని వెచ్చించిన ఈ ప్రాజెక్టులో జరిగిన నష్టం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ భారీ వైఫల్యానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వమే ప్రాథమిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కేవలం కమీషన్లు, ప్రచారం కోసం శాసీ్త్రయత లేకుండా పనులు చేయించడంతో మేడిగడ్డ బ్యారేజీలో 19 నుంచి 22 వరకు ఉన్న గేట్ల ప్రాంతం కుంగిపోయిందని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన వారి ఆస్తులను జప్తు చేసి, ఆ నిధులతోనే జరిగిన నష్టాన్ని పూడ్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను కేవలం గత ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసేందుకే పరిమితం చేయకూడదని సూచించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, నిపుణుల కమిటీ సూచనల మేరకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంటలకు సకాలంలో నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టు కేవలం ప్రచారానికే పరిమితమైందా అని నాయకులు ప్రశ్నించారు. సీఎం రేవంత్ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరమ్మతు చేయాలి అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి రైతు, కూలీ, కార్మిక సంఘాల డిమాండ్ -
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
మల్హర్(కాటారం): మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని ఎల్జీ గార్డెన్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చెర్మన్ కోట రాజబాబు, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేశ్, ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు -
‘జైన గుడిని పరిరక్షించాలి’
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప ఆలయ పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య కోరారు. ఆదివారం వారు రామప్ప పరిసరాల్లోని కాకతీయ కట్టడాల ఆనవాళ్లను పరిశీలించిన అనంతరం జైన ఆలయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గర్భాలయం, అర్ధమండపం, రెండింటికి ద్వారాలు, వాటిపైన జైన చిహ్నమైన పూర్ణకలశం, గర్భాలయంపై నాగర శైలి విమాన శిఖరం, దానికి అనుసంధానంగా సుకనాసి, కాకతీయ ఆలయ వాస్తుకు అద్ధం పడుతున్నాయని వివరించారు. గర్భాలయం లోపల పీఠంపై గల సింహం, శిల్పం, చివరి జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుడి లాంఛనమని తెలిపారు. అందువల్ల ఈ ఆలయం వర్ధమాన మహావీరుడికి అంకితం చేశారన్నారు. వాస్తు నైపుణ్యం ఉన్న ఈ ఆలయాన్ని సైతం పదిలపరిస్తే సందర్శకులకు ఆకర్షణగా నిలుస్తుందని వివరించారు. రామప్ప ఆలయ సమీపంలోని రెండు సమకాలీన ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను వారు అభినందిస్తూ, జైనుగుడిని కూడా ఆ జాబితాలో చేర్చాలని వారు కోరారు. -
పిలవని పేరంటానికి వెళ్తే..
శుభకార్యాలకు పిలవకున్నా వెళ్లి భోజనం చేసేవారికి ఆదివారం భూపాలపల్లి పట్టణం సుభాష్‌కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ ఎదుట హెచ్చరిక బోర్డు పెట్టారు. సింగరేణి ఫంక్షన్ హాల్లో ఆదివారం వివాహం జరిగింది. ఫంక్షన్ హాల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఫంక్షన్‌కు సంబంధం లేనివారు వందలాది మంది వచ్చి భోజనాలు చేస్తున్నారని నిర్వాహకులు గుర్తించారు. దీంతో ఇతరులెవరూ రాకుండా ఫంక్షన్ హాల్ ఎదుట ‘వివాహానికి సంబంధం లేనివారు వస్తే రూ.5వేల జరిమానా, 3నెలల జైలు’ అని ఫ్లెక్సీ పెట్టారు. భోజన ప్రియులు బోర్డును చూసి వెనుదిరిగి వెళ్లారు. గతంలో శుభకార్యాలు చేసినప్పుడు భోజనాలు సరిపోక ఇబ్బందులు అయ్యేవని.. ఫ్లెక్సీ ఏర్పాటుతో అందరికీ భోజనాలు సరిపోయాయని నిర్వాహకులు అన్నారు. – భూపాలపల్లి రూరల్ -
జాతీయ సంఘాలు సమాధానం చెప్పాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు ఆలస్యంగా ఇవ్వడం, ప్రమోషన్ పాలసీ అమలు చేయకపోవడం, కార్మికులను వివిధ స్కీముల పేరుతో తొలగించడం వంటి సమస్యలపై జాతీయ కార్మిక సంఘాలు సమాధానం చెప్పాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో హామీలను ఎంతవరకు అమలు చేశారో బహిరంగ చర్చలో చెప్పాలని ఐఎన్టీయూసీ నాయకత్వానికి సవాల్ చేశారు. కార్మికుల ఐక్య పోరాటాలతో సాధించిన హక్కులను కొన్ని జాతీయ సంఘాలు ప్రభుత్వాలు, యాజమాన్యాలతో కుమ్మకై ్క తాకట్టు పెట్టాయని ఆరోపించారు.ఈ సమావేశంలో నాయకులు కాసర్ల ప్రసాద్‌రెడ్డి, దాసరి జనార్దన్, నామల శ్రీనివాస్, రాళ్లబండి బాబు, జయశంకర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి
● జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత ఏటూరునాగారం: సర్పంచ్‌లు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రేమలత హాజరై మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, సేవల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ హెల్ప్‌లైన్–1098, జిల్లా హబ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వంటి విభాగాల ద్వారా మహిళలు, బాలికలు, పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించారు. మహిళలు ఎదుర్కొనే గృహహింస, వేధింపులు, అత్యాచారం వంటి సమస్యలపై సఖి కేంద్రం ద్వారా అందించే వైద్యం, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను సర్పంచ్‌లు గుర్తుంచుకొని కావాల్సిన వారికి సాయం చేయాలన్నారు. అలాగే ప్రమాదంలో ఉన్న లేదా సహాయం అవసరమైన పిల్లల కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ద్వారా 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా డీహెచ్ఈడబ్ల్యూ ద్వారా మహిళల సాధికారత, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తదితర అంశాలపై సర్పంచ్‌లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ, ఏఓ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీఈ పురుషోత్తం, ఈజీఎస్ ఏపీఓ చరణ్‌రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీవిద్య, వసంత, బాలల పరిరక్షణ విభాగం అధికారి రాజు, సఖి కౌన్సిలర్ కల్పన, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్ విక్రమ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఎవరికీ పట్టని ‘సీఎంఆర్’!
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైస్‌మిల్లును ఏడాది క్రితం డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. 2021–22, 2022–23 సంవత్సరాలకు సీఎంఆర్ కింద కేటాయించిన సుమారు రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం ఎగవేయడమే ఇందుకు కారణం. డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినా ఇప్పటికీ నూరు శాతం సీఎంఆర్ రికవరీ కాలేదు. హసన్‌పర్తి మండలంలోని ఓ రైస్‌మిల్లు నిర్వాహకులు 2,200 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది. దాడులు, తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడంతో 1,300 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 900 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. .. ఇలా ప్రతీసారి కస్టం మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) దారి మళ్లుతోంది. వ్యాపారం, వృత్తి మీద నిబద్ధత ఉన్న సుమారు 75 శాతం మంది రైస్‌మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ చెల్లిస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి, మరికొందరు అక్రమార్జన కోసం సీఎంఆర్ బకాయి పెడుతున్నారు. ఓ సీజన్‌కు చెల్లించాల్సింది మరో సీజన్‌కు ఇస్తూ.. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. కొందరైతే మొత్తానికే ఎగవేస్తున్నారు. సర్కారు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి ‘రియల్’ వ్యాపారం చేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువ చేసే ధాన్యం దారి మళ్లుతుండగా అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు, రైస్‌మిల్లర్లకు సీఎంఆర్ వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. స్కాం ఇలా వెలుగులోకి.. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని సివిల్ సప్లయీస్/మార్కెటింగ్ శాఖ ద్వారా రైస్ మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాలి. ఒప్పందం ధాన్యం మిల్లింగ్ చేసి సుమారు 67 శాతం బియ్యం ఎఫ్‌సీఐ/సివిల్ సప్లయీస్ గోదాములకు ఇవ్వాలి. ఇక్కడే అసలు స్కాం మొదలవుతుంది. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ చేయరు.. లేదా కొంత మాత్రమే మిల్లింగ్ చేస్తారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ప్రైవేట్‌కు అమ్మేయడం, లేదంటే మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఫేక్ మిల్లింగ్ రికార్డులు, స్టాక్ రిజిస్టర్ మార్పులు చేసి తక్కువ బియ్యం చూపించడం.. బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ధాన్యం తడిగా ఉండడం, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సమస్యలను చెప్పి దాటవేయడం పరిపాటి. తీరా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మిల్లుల్లో ఉన్న ధాన్యం, సరఫరా చేసిన బియ్యం లెక్కల్లో భారీ తేడా కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్ బకాయిలు, పక్కదారి పట్టించిన స్కాంలు బయట పడుతున్నాయి. 33మంది మిల్లర్ల నిర్లక్ష్యం 2021–22లో రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్‌మిల్లర్లకు సరఫరా చేశారు. ఆ ధాన్యానికి సంబంధించిన బియ్యం సరఫరా చేయడంలో ఉమ్మడి వరంగల్‌లోని 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం వహించారు. బియ్యం చెల్లించని వారికి పౌరసరఫరాలశాఖ నోటీసులు ఇచ్చింది. స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2023లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్‌లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు.. తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇంకా సుమారు రూ.107 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు కొందరు రైస్‌మిల్లర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంఆర్ బకాయిలు రాబట్టడంపై కొందరిపై కఠినంగా, మరికొందరిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌లో సీఎంఆర్ బకాయిలపై కమిషనర్ కార్యాలయం తాజాగా ఆరా తీయడం రైస్‌మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది. డిఫాల్టర్ రైస్మిలర్లపై చర్యలు లేవు.. వారి వద్దే కస్టం మిల్లింగ్ రైస్ నోటీసులకే పరిమితమైన రికవరీ.. ‘తిలా పాపం తలా పిడికెడు’లా పరిస్థితి మూడేళ్లు గడిచినా ఇంకా మౌనమే.. మిల్లర్ల వ్యాపారానికి సర్కారు ధాన్యం అధికారుల ఉదాసీనతపై కమిషనర్ సీరియస్.. మళ్లీ తెరపైకి బకాయిల వ్యవహారం -
టెన్త్ పరీక్షలు ప్రారంభం
● నలుగురు విద్యార్థులు గైర్హాజరు ● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సింగరేణి పాఠశాల, ఆశ్రమ పాఠశాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ జంగేడు పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పరీక్ష నిర్వహణ, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గణపురం మండలకేంద్రంలోని మోడల్ స్కూల్‌ను సందర్శించారు. 3,544 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ రాజేందర్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్ మహాముత్తారం, మహదేవపూర్ పాఠశాలలను సందర్శించారు. రెండు ఫ్ల్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణ చేశాయి. -
బుకింగ్ డబుల్
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026భూపాలపల్లి: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో భారత్‌లో గ్యాస్ సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో జిల్లాలో గృహావసరాలకు మినహా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగడం లేదు. ఫలితంగా జిల్లాకేంద్రంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయగా, పలువురు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. డబుల్ అయిన గ్యాస్ బుకింగ్.. జిల్లాలో హెచ్‌పీ, భారత్, ఇండేన్ కంపెనీలకు చెందిన 12 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల్లో డొమెస్టిక్(గృహావసర) కనెక్షన్లు 1,32,330 ఉన్నాయి. ఆయా వినియోగదారులు గతంలో నెలకు సుమారు 1,500 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే వారు. యుద్ధ వాతావరణం నేపథ్యం, గ్యాస్ కొరత తీవ్రం అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రోజుకు 2,800 నుంచి 3వేల మంది సిలిండర్ల కోసం బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకరోజుకు జిల్లాకు సుమారు 2వేల సిలిండర్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో డొమెస్టిక్ సిలిండర్ల కొరత కొంతమేరకు మాత్రమే ఉంది. బుకింగ్ చేసుకున్న వారు ఒకటి రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మూతబడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు.. వంటగ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీని నిలిపివేసింది. దీంతో జిల్లాకేంద్రంతో పాటు కాటారం డివిజన్ కేంద్రంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు గ్యాస్ సిలిండర్లు లేక ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. పలు రెస్టారెంట్ల యజమానులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.. గ్యాస్ కొరత ఎప్పుడు తీరుతుందో తెలియదనే ఉద్ధేశంతో వంటచెరుకును ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. కట్టెలను కొనుగోలు చేసి హోటల్, రెస్టారెంట్ సమీపంలో పొయ్యిలను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. రీసైక్లింగ్ షురూ.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొనడంతో కొందరు వ్యాపారులు కొత్త దందాకు దిగినట్లు సమాచారం. గృహావసరాల సిలిండర్లను రూ.1,500 నుంచి రూ.1,800 వరకు కొనుగోలు చేసి కమర్షియల్ సిలిండర్లలోకి రీసైక్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాకేంద్రంలోని పలు షాపుల యజమానులు సైతం డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి రీసైక్లింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోజుకు 3వేల గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యాపార సంస్థలకు కమర్షియల్ గ్యాస్ నిలిపివేత మూతబడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు పలుచోట్ల కట్టెల పొయ్యితో వంటల తయారీ -
అక్రమ వినియోగంపై నిఘా..
ఎల్పీజీ సిలిండర్లు దాచివేత, బ్లాక్ మార్కెటింగ్, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్యానికి వినియోగించడం వంటి అక్రమాలపై కఠిన నిఘా ఉంచినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో గ్యాస్ సరఫరా అందుబాటును నిరంతరం పర్యవేక్షించేందుకు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలను జిల్లా అధికారులు సమన్వయం చేస్తూ వినియోగదారులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా కొనసాగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు గ్యాస్ సిలిండర్లు ప్రాధాన్యతతో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. – రాహుల్ శర్మ, కలెక్టర్ -
రేపటినుంచి ఒంటి పూట బడులు
భూపాలపల్లి అర్బన్: వేసవికాలం.. పైగా ఎండలు అధికంగా ఉన్న దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్నాయి. అందుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లావ్యాప్తంగా 430 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 24 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒంటి పూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో యథావిధిగా మధ్యాహ్న భోజనం కొనసాగనుంది. అందుకు గాను విద్యాశాఖ అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. తరగతులు పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని సూచించారు. ఎమ్మెల్యే పరామర్శ చిట్యాల: మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామంలో క్రేన్ వైర్ తెగి మృతిచెందిన ముగ్గురి మృతదేహాలను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, చిలుకల రాయకోంరు, గుర్రపు తిరుపతి గౌడ్, బుర్ర శ్రీనివాస్, తక్కళ్లపల్లి రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ రఫీ, అల్లం రాజు ఉన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు మండలంలోని కాటారం ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 13నుంచి ఈనెల 15 (ఆదివారం) వరకు హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీలో జరుగుతున్న సీనియర్ మెన్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో చరణ్, శివబాలాజీ పాల్గొంటున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాడ మాధవి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలారం, పీడీ కుడిమేత మహేందర్, పీటీ మంతెన శ్రీనివాస్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడిమంగపేట: మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి చరిత్ర, ఆలయ పురాణం వివరించి ఆశీర్వచనం ఇచ్చారు. -
వ్యవసాయ బావిలో పడి ముగ్గురి దుర్మరణం
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కొరికశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ముగ్గురు దుర్మరణం చెందారు. వ్యవసాయ బావిలో పూడిక తీసే క్రమంలో ఈ దారుణం జరిగింది. క్రేన్ వ్యవసాయ బావిలో పడటంతో విషాదం నెలకొంది. క్రేన్‌తో సహా నలుగురు వ్యవసాయ బావిలో పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పైడి(50), దేవరావు( 48), అభిలాష్(16) అనే ముగ్గురు మృతిచెందగా, మరో వ్యక్తి మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
28న జాతీయ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీని యర్ సివిల్ జడ్జి నాగరాజ్ తెలిపారు. బుధవారం న్యాయవాదులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ మార్గాన్ని ఎంచుకొని వివాద రహిత జీవితాలను గడిపేలా కక్షిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఎక్కు వ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, చీఫ్ లీగల్ ఎయి డ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, అదనపు పీపీ రఫీక్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, న్యాయవాదులు భిక్షపతి, రమేష్, సుభాష్, విష్ణు, మొయినుద్దీన్, సంధ్య పాల్గొన్నారు. -
టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
భూపాలపల్లి అర్బన్: టెన్త్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌తోపాటు ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్ రాబోయే పరీక్షలకు ప్రణాళిక ప్రకారం క్రమబద్ధంగా చదివి సిద్ధం కావాలని సూచించారు. క్రమశిక్షణతో చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్షలపై భయం లేకుండా అవగాహన కల్పించాలని సూచించారు. చదివిన అంశాలపైనే పరీక్ష ఉంటుందని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంత రం పాఠశాలలోని మధ్యాహ్న భోజనశాలను పరిశీ లించిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ దేవానాయక్, సీఎంఓ రమేష్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో మున్సిపాలిటీ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో రెస్టారెంట్లలో కిచెన్ షెడ్లను పరిశీలించారు. పాడైన చికెన్, కలుషితమైన ఆహార పదార్థాలు కనిపించడంతో భూమిలో పూడ్చిపెట్టారు. రెస్టారెంట్, హోటళ్ల నిర్వాహకులు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని కమిషనర్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో నిరంతరం తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకంగా తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షలు అందించనుంది. ఈమొత్తాన్ని పొందేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు www. epass. telangana. gov. inద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చేసుకుని పత్రాలను, సంబంధిత సమగ్ర శిశు, అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందించాలని కోరారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి రేగొండ : పరీక్షల సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్సీఓ రాజుకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఎంజేపీ బాలికల పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకదశ అని అన్నారు. సమయాన్ని వినియోగించుకుని ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ, ఉపాధ్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు. విజయ్‌బాబు మృతి తీరని లోటు భూపాలపల్లి: పోలీసుశాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన విజయ్‌బాబు అకాల మరణం తీరని లోటని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గడ్డం విజయ్‌బాబు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చేరుకొని ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయంగా రూ.30 వేలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 1990లో పోలీసుశాఖలో విధుల్లో చేరిన విజయ్‌బాబు అకాల మరణం తమను కలచివేసిందన్నారు. వారి కుటుంబానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడికి గౌరవ డాక్టరేట్ వాజేడు: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పీర్ల కృష్ణబాబు గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. అమ్మ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఆయన సేవలను గుర్తించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను బుధవారం ప్రదానం చేసింది. -
సోదర భావానికి ప్రతీక రంజాన్
భూపాలపల్లి: సోదర భావానికి ప్రతీక రంజాన్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి బుధవారం జిల్లా కేంద్రంలో సింగరేణి ఫంక్షన్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సహనం, పరస్పర సహకారం, సామాజిక ఐక్యతకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్‌చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏరి యాలోని యూనియన్ కార్యాలయంలో బుధవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కార్మికుల ఐక్యపోరాటాల ద్వారా తిరిగి సాధించుకున్న మెడికల్ బోర్డు నిర్వహణను గత సంవత్సరం నమోదైన ఏసీబీ కేసును సాకుగా చూపుతూ నిలిపివేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సుమారు పది నెలలుగా అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేక మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను పిలవకపోవడం, పైగా వారిపై నిబంధనల పేరుతో చర్యలు తీసుకోవడం అన్యాయమని విమర్శించారు. పాత పద్ధతిలో మెడికల్ బోర్డును కొనసాగిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని తెలిపారు. యాజమాన్యం ఒప్పుకున్న ఒప్పందాలను అమలు చేయకపోవడం, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం, కమిటీల పేరుతో కాలయాపన చేయడం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.50 వేల కోట్ల బకాయిలు రాకపోవడం వల్ల సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న శ్రీరాంపూర్ ఏరియా నుంచి ప్రారంభమయ్యే ‘సేవ్ సింగరేణి జాతా’ ద్వారా కార్మికులను చైతన్యపరుస్తూ 30న కొత్తగూడెం హెడ్ఆఫీస్ వద్ద జరిగే ము గింపు సభను విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్‌లో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోటపలుకుల రమేష్, రామచందర్, సుధాకర్‌రెడ్డి, ఆసిఫ్ పాషా పాల్గొన్నారు.కొరిమి రాజ్‌కుమార్ -
తెల్లకాగితమే రశీదుగా..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పే రూముల్లో గోల్మాల్భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జనరల్ వార్డులు, ఆస్పత్రి నిర్వహణ కోసం 11 పెయింగ్(అద్దె) రూమ్‌లు ఏర్పాటు చేశారు. జనరల్ వార్డులో ఉండడం ఇష్టం లేని పేషెంట్లు రోజుకు రూ.500 చెల్లించి ఉంటారు. ప్రతీ రూమ్‌లో ఒకటి పేషెంట్‌కు మరొకటి అటెండెంట్‌కు కలిపి రెండు బెడ్లు ఉంటాయి. అయితే ఈ అద్దె రూమ్‌లకు ఇన్చార్జ్గా అర్హత లేని శానిటేషన్ సూపర్వైజర్ ఏళ్ల తరబడి కొనసాగుతుండడమే కాకుండా గది కిరాయి.. అడ్వాన్స్ తదితరాలకోసం రశీదులకు బదులుగా తెల్లకాగితాన్ని వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వసూలు చేసిన డబ్బులు గోల్మాల్ జరిగినట్లు ఆస్పత్రిలో బహిరంగ చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. అతనే ఎందుకు..? గతంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో శానిటేషన్ సూపర్వైజర్కు అద్దె గదుల బాధ్యత అప్పగించారు. దీంతో నాటి నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. మెడికల్ కళాశాల ఏర్పడి ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిగా మార్పు చెంది మూడేళ్లు గడిచింది. కావాల్సిన సిబ్బంది నియామకం కూడా జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రికి పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ ఇంకా శానిటేషన్ సూపర్వైజర్తోనే అద్దె గదుల నిర్వహణ కొనసాగిస్తుండడంపై రోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రశీదులు లేకుండానే.. అద్దె గది తీసుకున్న పేషెంట్లకు రశీదులు ఇవ్వకుండా శానిటేషన్ సూపర్వైజర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. రశీదులకు బదులుగా తెల్లకాగితంపై అడ్వాన్ తీసుకున్నట్లు రాసిస్తున్నాడు. డిశ్చార్జి అయి వెళ్తున్న క్రమంలో మిగితా డబ్బులను తీసుకుంటారు. కానీ, రశీదులు అడిగిన కూడా ఇవ్వడం లేదని పలువురు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. అద్దె గదులు 11 ఉండగా ఒకటి ప్రత్యేకంగా శానిటేషన్ సూపర్వైజర్, మరొకటి డ్యూటీలో ఉండే నర్సింగ్ సిబ్బంది వినియోగించుకుంటున్నారు. మిగతా తొమ్మిది రూమ్‌లకు ప్రతీ రోజు రూ.4,500 చొప్పు న ఆదాయం వస్తుంది. అడ్మిట్ అయిన పేషెంట్ల వద్ద ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. వారికి సైతం సంబంధం లేకుండానే పేషెంట్ల సంబంధికుల నుంచి అడ్వాన్స్ రూపకంగా శాని టేషన్ సూపర్వైజర్ డబ్బులు తీసుకుంటున్నాడు. కలెక్టర్ దృష్టిసారిస్తే.. ఆస్పత్రిలో పేదల నుంచి వసూలు చేసిన డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సొంతానికి వినియోగించడంపై కలెక్టర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల తరబడి జమ అవుతున్న డబ్బులు, ఖర్చులపై కలెక్టర్ అడిట్ చేయిస్తే అవకతవకలు బయటపడనున్నాయి. అద్దె గదుల డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు సరికాదు. వసూలు చేసిన డబ్బులను ఆస్పత్రి అవసరాలకు వాడుకుంటున్నాం. ఏమైనా ఆరోపణలు ఉంటే సాక్ష్యాధారాలతో చూపిస్తే చర్యలు తీసుకుంటాం. అద్దె గదులను ఆస్పత్రి కార్యాలయ సిబ్బందితోనే నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి అక్రమాలు జరగలేదు. – డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న శానిటేషన్ సూపర్వైజర్ బిల్లులు, ఖర్చుల లెక్కలు చూపని వైనం ఆస్పత్రి సిబ్బంది ఉన్నా ఇతరులకు బాధ్యతలు కానరాని రశీదు బుక్ అద్దె గదుల నుంచి వసూలైన డబ్బులను ఆస్పత్రి అత్యవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ డబ్బులు వసూలు చేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్తోనే ఆస్పత్రి ఖర్చులు పెట్టిస్తుండడం గమనార్హం. వసూలు చేసిన డబ్బులను ఎవరి ఇష్టానుసారంగా కాకుండా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కమిటీ సమీక్షంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, సూపర్వైజర్ చేస్తున్న ఖర్చులకు సరైన బిల్లులు, పత్రాలు ఉండడం లేదని సమాచారం. చేసిన ఖర్చులకు అధిక ధరలు వేసి నకిలీ బిల్లులు ఆఫీసులో అప్పగించి సొమ్ము చేసుకుంటునట్లు తెలిసింది. అద్దె గదుల ద్వారా వచ్చిన డబ్బుల జమ, ఖర్చుల లెక్కలు లేవనే ప్రచారం జరుగుతోంది. గతంలో కార్యాలయ సిబ్బంది లేకపోవడంతో ఓ వైద్యురాలి అండతో ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు సమాచారం. ఇటీవల ఈ సూపర్వైజర్ను కార్యాలయ సూపరింటెండెంట్ ప్రశ్నించగా సరైన లెక్కలు చూపించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కానీ, అతని పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటనే సందేహం వ్యక్తమవుతోంది. -
కార్మికుల సమస్యలపై ఆరోపణలు సరికాదు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పసునూటి రాజేందర్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేని వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొంతకాలంగా కార్మికుల సమస్యలను పరిష్కరించామని, కార్మిక సంక్షేమానికి యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరిపి పలు ప్రయోజనాలను సాధించామని తెలిపారు. కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు చేయకుండా కార్మిక సంక్షేమానికి కలిసి పని చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు మధుకర్‌రెడ్డి, జోగు బుచ్చయ్య, శశరత్నం, సమ్మిరెడ్డి, అశోక్, హుస్సెన్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.పసునూటి రాజేందర్ -
పంట మార్పిడితో అధిక లాభాలు
టేకుమట్ల: ప్రతీ సీజన్లో రైతులు పంట మార్పిడి చేసి సాగు చేయడం ద్వారా దిగుబడి పెరిగి అధిక లాభాలను పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధి కారి సునీల్‌కుమార్ తెలపారు. మండలంలోని పంగిడిపల్లిలో గ్లోబల్ డ్రిప్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు డ్రిప్ పరికరాలు, పంటల్లో వచ్చే చీడపీడల నివారణపై బుధవారం అవగాహన కల్పించి, ఉ ద్యాన మిషన్ పథకం ద్వారా రైతులకు కూరగాయ ల మినీ కిట్లను పంపిణీ చేశారు. అలాగే డ్రిప్ విని యోగంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృషి విజ్ఞా న కేంద్రం రామకిరికిల్ల కీటక శాస్త్రవేత్త వెంకన్న మా ట్లాడుతూ.. పంటల్లో చీడ పీడల నివారణకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఏఓ కల్యాణి, ఏఈఓలు రాహుల్, రామాచారి తదతరులు పాల్గొన్నారు.ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్‌కుమార్ -
మళ్లీ జనగణన
● కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు ● ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం ● పట్టణీకరణతో వరంగల్, హనుమకొండలో జనాభా భారీగా పెరుగుదల సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021 లో జనగణన చేపట్టాల్సి ఉండగా.. కరోనాతో జరగలేదు. 15ఏళ్ల అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి.. ఉమ్మడి వరంగల్‌ను హనుమకొండ, వరంగల్, జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ము లుగు జిల్లాలుగా విభజించారు. ఇది కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణ నలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది. దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, విద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకుకారణమని చెబుతున్నారు. డిజిటల్‌గా జనగణన.. జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేప ట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్‌ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికా రులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమో దు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగనుంది. రెండో దశలో జనా భా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. మార్చి 1 2027 ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూ డు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీఆర్ఓ, డీఎఫ్ఓ, ఆర్డీఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, మున్సిపల్ అధికారులు, తహసీల్దా ర్లు, ఎంపీడీఓలు పాల్గొంటున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జనగణనను రెండుదశల్లో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, విద్యాశాఖల అధి కారులతో రాబోయే 2027 జనగణన (సెన్సెస్–2027) ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ ఉంటుందని తెలిపారు. ఈదశలో ఎన్యూమరేట ర్లు ఇంటింటికీ వెళ్లి గృహాల వివరాలు సేకరిస్తార ని తెలిపారు. గృహ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కుటుంబాల ఆస్తుల సమాచా రం నమోదు చేస్తారన్నారు. ఈ వివరాలు రెండో దశ జనగణనకు ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ దశలో ఫీల్డ్ వర్క్‌తో పాటు 15 రోజుల స్వీయ నమోదు అవకాశం కూ డా ఉంటుందన్నారు. రెండో దశలో ఎన్యూమరేటర్లు ప్రజల వ్యక్తిగత వివరాలు నమో దు చేస్తారన్నారు. ఫీల్డ్ వర్క్ అనంతరం 5 రోజుల రివిజన్ రౌండ్ నిర్వహించి వివరాలను ధ్రువీకరించాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో సర్వేను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నందున అధి కారులు పొరపాట్లుకు తావులేకుండా లేకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు. కాగా.. జిల్లా కేంద్రంలోని శ్రీనివా స ఫంక్షన్ హాల్లో నేడు(గురువారం) జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో పంచాయతీ, ము న్సిపల్ అధికారులతో శిక్షణ కార్యక్రమ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. కాటారం సబ్ కలెక్టర్ మ యాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, సీపీఓ జవహర్, డీపీఓ శ్రీలత, ము న్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. -
అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి అర్బన్: మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల పనులను వేగంగా చేసి గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అంత్య పుష్కరాల ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య, ప్రణాళిక శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంత్య పుష్కరాల పనులు ఏప్రిల్ 30 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలి ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల శిక్షణా తరగతులు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం, 12వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ చైర్మన్, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమం నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. అందుకు అనుగుణంగా నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి సంబంధించి విభాగాల వారీగా మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో మెడికవర్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా కలెక్టరేట్లో మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సమగ్ర కార్యక్రమాలతో వ్యవసాయాభివృద్ధి వ్యవసాయ రంగం అభివృద్ధికి దోహదపడేలా సమగ్ర కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చేపట్టాల్సిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పంటల దిగుబడి, పంట మార్పిడి, ఎరువుల వినియోగంపై, పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, టీజీఓ కార్యదర్శి సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు డాక్టర్ మధుసూదన్, ఫణికుమార్, డాక్టర్ వెంకన్న, సంతోష్, శ్రీనివాసరావు, స్వాతి, వ్యవసాయ అధికారి బాబూరావు, ఉద్యాన అధికారి సునిల్ కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
జిల్లాలో 9 మంది ఎస్సైల బదిలీ
భూపాలపల్లి: జిల్లాలో 9 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్ ఇన్చార్జ్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొగుళ్లపల్లి ఎస్సై బి.అశోక్‌ను గణపురం ఎస్సైగా, టేకుమట్లలో పని చేస్తున్న ఎస్సై డి.సుధాకర్‌ను రేగొండకు, చిట్యాలలో పని చేస్తున్న జి.శ్రావణ్‌కుమార్‌ను భూపాలపల్లి ఎస్సై 2గా, వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న ఎస్సైలు సాయి త్రిలోక్నాథ్రెడ్డిని కొత్తపల్లి గోరి ఎస్సైగా, పి.సతీష్‌ను చిట్యాల ఎస్హెచ్ఓగా, అమూల్యను టేకుమట్లకు, ములుగు జిల్లాలో వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న ఎం.సురేష్‌ను మొగుళ్లపల్లికి, గణపురం, కొత్తపల్లి గోరి ఎస్సైలు ఆర్.అశోక్, ఎస్.దివ్యలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పలువురు ఎస్సైలు మంగళవారం సాయంత్రమే ఆయా ఠాణాలకు చేరుకొని బాధ్యతలు తీసుకున్నారు. ఆధునిక శిక్షణతో యువతకు ఉపాధి భూపాలపల్లి అర్బన్: ఐటీఐలో ఆధునిక శిక్షణ ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే సత్యనారాయణరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏటీసీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2ఈ, 3ఈ మిషన్, అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషన్, రోబోటిక్ వెల్డింగ్ మిషన్, ఎలకి్ట్రక్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన ఎలకి్ట్రక్ వాహనాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ నడిపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఐటీఐ విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఏటీసీ కేంద్రం ద్వారా విద్యార్థులు ఆధునిక యంత్రాలపై శిక్షణ పొందుతూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలి పారు. ఇటువంటి శిక్షణ కేంద్రాలు యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జమ్మూలాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామప్పలో సింగరేణి బృందంవెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి బృందం సందర్శించింది. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో జరుగుతున్న పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ సాయి నిరంజన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియాల నుంచి కలిసివచ్చిన పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ సందర్శించారు. అనంతరం వారు రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో స్కౌట్స్ లీడర్స్ శ్రీనివాసరావు, స్వామి , మాస్టర్స్ రమేశ్, కుమార్, భాస్కర్, శైలజ, ప్రకాష్, సుమన్, నీలిమ పాల్గొన్నారు. -
ఇళ్లపై సౌర వెలుగులు
హన్మకొండ: సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఉచిత విద్యుత్‌ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను తీసుకొచ్చింది. దేశంలో ఒక కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.75,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులో సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. సౌర శక్తిని వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడం దీని ఉద్దేశం. ఈపథకం ద్వారా వినియోగదారుడు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడంతోపాటు అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించుకునే అవకాశముంది. ఇంటి పైకప్పు సోలార్ ఫలకల ఇన్‌స్టలేషన్‌కు అనువుగా ఉండాలి. 20.16 కోట్ల రాయితీని విడుదల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గృహ విద్యుత్ సర్వీస్‌లు 12,73,350 ఉన్నాయి. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం, సోలార్ ఫలకల బిగింపు కోసం 27.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా 9,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.95 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,939 రూఫ్‌టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చేశారు. ఇందులో 9.42 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2,595 రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టలేషన్కుగాను రూ.20.16 కోట్ల రాయితీని విడుదల చేశారు. విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు.. సౌరశక్తి ఉత్పత్తి ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం వల్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. స్వయం సమృద్ధిని సాధించే అవకాశం ఉంది. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారని విద్యుత్ అధికారులు తెలిపారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా నెలకు రూ.612 చొప్పున ఏడాదికి రూ.7,344 ఆదా చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ప్లాంట్ ద్వారా నెలకు రూ.1,328 చొప్పున ఏడాదికి రూ.15,938, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటు ద్వారా నెలకు రూ.2,252 చొప్పున ఏడాదికి రూ.27,024 ఆదా చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కార్బన్ డయాకై ్సడ్ సమానమైన ఉద్గారాలు తగ్గుతాయి. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.30,000 రాయితీ అందిస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.60,000, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. సోలార్ ప్యానళ్లు 25 ఏళ్ల పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో 4 నుంచి 5 సంవత్సరాల్లో పెట్టుబడి పొందవచ్చు. మిగతా 20 ఏళ్లు పూర్తి లాభదాయకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాయితీ వినియోగించుకోవాలి..ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్‌ప్లాంట్ (ఫలకల) ఏర్పాటుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. విద్యుత్‌ను ఉచితంగా వాడుకోవడమే కాకుండా విక్రయించి సైతం ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. – మహేందర్‌రెడ్డి, రెడ్కో హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల మేనేజర్ఉమ్మడి జిల్లాలో సోలార్ ఫలకల ఏర్పాటు ఇలా.. (సామర్థ్యం మెగావాట్లలో)... దరఖాస్తు ఇలా.. ఆసక్తి కలిగిన వినియోగదారులు పీఎం సూర్యఘర్ డాట్ గోవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో వెండర్‌ను ఎంచుకోవాలి. ఎంచుకున్న వెండర్ సంబంధిత వినియోగదారుడిని సంప్రదించి, ఒప్పందం చేసుకుంటాడు. ఆ వెంటనే సోలార్ ఫలకలు బిగిస్తారు. సంబంధిత డిస్కం నెట్మీటరు బిగించి అనుసంధానం చేస్తుంది. తర్వాత సంబందిత వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు 15 రోజుల్లో సబ్సిడీ మొత్తం జమవుతుంది. పీఎం సూర్యఘర్‌తో ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు వినియోగం ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 27.07 మెగావాట్ల విద్యుత్‌కు 9,058 దరఖాస్తులు ఇప్పటి వరకు 2,939 రూఫ్‌టాప్ ఇన్స్టలేషన్జిల్లా గృహ విద్యుత్ వచ్చిన కెపాసిటీ ఇన్స్టలేషన్ కెపాసిటీ సర్వీస్‌లు దరఖాస్తులుభూపాలపల్లి 2,04,722 1,485 4.63 195 0.63 హనుమకొండ 3,67,999 4,762 13.40 1633 5.53 వరంగల్ 3,04,030 1,587 5.12 668 2.33 జనగామ 1,76,061 491 1.50 211 0.67 మహబూబాబాద్ 2,20,538 733 2.42 232 0.79 -
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
మూడు నెలల క్రితం రేగొండ మండలం బాగిర్ధిపేట క్రాస్‌రోడ్ మీదుగా పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న మూడు ట్రాలీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టేకుమట్ల బూర్నపల్లి వద్ద సివిల్ సప్లయీస్ టాస్క్‌ఫోర్స్ అధికారులు గత నెల 11వ తేదీన రెండు ట్రాలీలను పట్టుకొని సుమారు 90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ప్రతీ నెల ఒకటి రెండు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భూపాలపల్లి: జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కొందరు దళారులు ఏడాది క్రితం వరకు మహా రాష్ట్రకు అక్రమంగా తరలించి రూ.కోట్లు గడించా రు. కాగా ఇప్పుడు అక్కడ దందా బంద్ కావడంతో స్థానిక దళారులు ఆ బియ్యాన్ని నేరుగా జిల్లాలోని రైస్‌మిల్లులకే పంపిస్తుండడం గమనార్హం. మిల్లర్లు అవే బియ్యాన్ని బస్తాలు మార్చి సీఎంఆర్ కింద సివిల్ సప్లయీస్ గోదాంలకు తరలిస్తున్నారని, దళారులకు సివిల్ సప్లయీస్ అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి మిల్లులకు రవాణా.. కూలీలు సేకరించిన, రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏసీ ట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి తిరిగి సివిల్ సప్లయీస్ గోడౌన్లకు పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లయీస్ శాఖలోని కొందరు అధికారులు ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైస్‌మిల్లులకే చేరుతున్న పేదల బియ్యం జిల్లాలో జోరుగా అక్రమ వ్యాపారం రేషన్ డీలర్లు, దళారుల నుంచి మిల్లులకు చేరవేత రీ సైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద సర్కార్‌కు అప్పగింత సహకరిస్తున్న సివిల్ సప్లయీస్ అధికారులు..?జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 1.25 లక్షల తెల్లరేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీ నెల ఒక్కో వ్యక్తికి 6 కేజీల చొప్పున రేషన్ డీలర్ల ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తుంది. అయితే కొందరు దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మండలానికో దళారి ఏర్పడి, వారంతా బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ.10 నుంచి రూ.12 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారులకు విక్రయిస్తారు. అంతేకాక పలువురు దళారులు నేరుగా రేషన్ డీలర్లతో డీల్ కుదుర్చుకొని కేజీకి రూ.10 చొప్పున భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఏడాది క్రితం ఈ దళారులంతా రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రలోని ఓ రైస్‌మిల్లుకు తరలించగా, ప్రస్తుతం ఆ రైస్‌మిల్ బంద్ కావడంతో జిల్లాలోని పలు రైస్‌మిల్లులకే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఏప్రిల్‌లో యూజీడీ పనులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘గ్రేటర్’కు కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం రూ.5,257 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూజీడీతో పాటు ఇతర పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి.. సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నాన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలన్నారు. యూజీడీకి టెండర్ పూర్తిచేయాలి.. వరంగల్‌లో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు ఈనెల 31లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో కరెంట్, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులో అర్హులకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లువరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈఆస్పత్రి నిర్మాణ పనులు, ఆస్పత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, భద్రకాళి చెరువు పూడికతీత అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధుల్లో కృష్ణశిలతో నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు కాళేశ్వరానికి మంత్రి శ్రీధర్‌బాబు రాక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రేపు (బుధవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రానున్నారు. రూ.1.20కోట్ల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ద్వారా జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిసింది. ఈ మేరకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తుంది. రూ.21కోట్ల నిధులు మంజూరు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.35కోట్లతో సరస్వతినది పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సరస్వతీనది అంత్యపుష్కరాలను అదే మాదిరిగా మే నెలలో నిర్వహించడానికి రూ.31.60 కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు పంపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.21కోట్ల నిధులు మంజూరు చేసి పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నిధులతో పుష్కరాల పనులు ప్రారంభం కానున్నాయి. రూ.1.20కోట్లతో మ్యూజియం పనులకు శంకుస్థాపన -
గళమెత్తిన కౌన్సిలర్లు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు, పక్కన కలెక్టర్ రాహుల్శర్మభూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ తొలి సమావేశంలోనే కౌన్సిలర్లు పట్టణంలోని అనేక సమస్యలపై గళమెత్తారు. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కమిషనర్ ఉదయ్‌కుమార్ హాజరయ్యారు. తొలుత వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల నివేదికలను వెల్లడించారు. సమావేశంలో పలువురు కౌన్సి లర్లు పట్టణంలోని సమస్యలను నివేదించారు. ఆమోదం పొందని ఎజెండా అంశాలు.. కౌన్సిల్ సమావేశంలో పొందుపరిచిన ఎజెండాలోని అంశాలకు కౌన్సిలర్లు ఆమోదం తెలపలేదు. తప్పుడు బిల్లులు సమర్పించారని, కౌన్సిల్ ఏర్పాటుకు ముందు ఖర్చు చేసిన బిల్లులకు ఇప్పుడు ఆమోదం కోరడమేంటని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. నిధులు దుర్వినియోగం చేయొద్దు : కలెక్టర్ రాహుల్ శర్మ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పలువురు కౌన్సిలర్లు లేవనెత్తిన ప్రశ్నలకు స్పందిస్తూ.. వీధి వ్యాపారులకు మంజూరుచేసిన రుణాలపై నివేదిక అందించాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే సత్యనారాయణరావు జిల్లాలోని ఏకై క మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి రూ.82కోట్ల నిధులు ఇప్పించానని, త్వరలోనే బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. కౌన్సిలర్లు హుందాగా వ్యవహరిస్తూ గౌరవ మర్యాదలను కాపాడుకోవాలన్నారు. పలు శాఖలకు చెందిన అధికారులు కౌన్సిల్ సమావేశానికి హాజరుకాకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ వార్డు కౌన్సిలర్ బొంతల సతీష్ మాట్లాడుతూ తన వార్డులో తాగునీటి పైప్లైన్లు లీకేజీ అవుతున్నాయని, బోర్లు కాలిపోతున్నాయని అన్నారు. సింగరేణి సంస్థకు చెందిన చెత్తాచెదారం ఇష్టారాజ్యంగా పడేస్తున్నారని, రైతుల పంట పొలాలు కలుషితం అవుతున్నాయని తెలిపారు. 19వ వార్డు కౌన్సిలర్ కురిమిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. లక్ష్మీనగర్‌లో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని, వెంటనే తొలగించాలని కోరారు. 29వ వార్డు కౌన్సిలర్ గండ్ర హరీశ్‌రెడ్డి మాట్లాడుతూ తన వార్డులోని బోరు పని చేయడం లేదని, డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. సీఎస్ఆర్ నిధులతో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. పల్లె దవాఖానల పరిస్థితి అధ్వానంగా ఉందని, కేటీకే 6వ ఇంక్లైన్ ప్రహరీ వెంట ఉన్న యూకలిప్టస్ చెట్టు భారీగా పెరిగి ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 6వ ఇంక్లైన్ బ్యారెక్స్ వెనుక భాగంలో పార్కు, జిమ్ ఏర్పాటు చేయాలన్నారు. కోతుల బెడద తీవ్రంగా ఉందని పలువురు కౌన్సిలర్లు కోరగా.. ఎమ్మెల్యే సత్యనారాయణరావు స్పందిస్తూ... తన నిధుల నుంచి వేయి కోతులు పట్టించేందుకు నిధులు ఇస్తానని, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సింగరేణి జీఎంలు కూడా తమవంతుగా నిధులు కేటాయించి కోతుల బెడద తీర్చాలని సూచించారు. ఎజెండా అంశాలను ఆమోదించని సభ్యులు పట్టణాభివృద్ధికి తోడ్పడాలి : ఎమ్మెల్యే, కలెక్టర్ -
ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు పనుల పరిశీలన
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ఐ యంత్రం కోసం అవసరమైన గదులు, మౌలిక వసతులను కలెక్టర్ రాహుల్‌శర్మ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతాయని తెలిపారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తిచేసి, ఎంఆర్ఐ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో సంబంధిత వైద్య అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన
చిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్, కై లాపూర్ గ్రామ శివారులో జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటలపై సోమవారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్ హాజరై డ్రిప్ పరికరాల పనితీరుపై జైన్ డ్రిప్ కంపెనీ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరించాల్సిన మెలకువలు, పంటల యాజమాన్య పద్ధతులను వివరించారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ వంటి పంటలను సాగు చేసుకుంటే మార్కెట్లో మంచి ధరతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. అనంతరం ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు కూరగాయల మినీ కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
భూపాలపల్లి అర్బన్: ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 45 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. దరఖాస్తులను అధికారులు జాప్యంచేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, అందువల్ల అధికారులు బాధ్యతాయుతంగా దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సీటీ స్కాన్ నిరుపయోగం
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026రూ.3.40 కోట్ల నిధులతో ఏర్పాటు ● టెక్నీషియన్లు, సిబ్బందిని నియమించడంలో నిర్లక్ష్యం ● ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తూ ఆర్థికంగా నష్టపోతున్న రోగులుభూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రం నిరుపయోగంగా మారింది. రూ.3.40 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈసీఐఎల్ సంస్థ యంత్రాన్ని ఏర్పాటుచేసినా టెక్నీషియన్లు, సిబ్బందిని నియమించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతుంది. దీంతో పేద రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. గతేడాది ప్రారంభమైనా.. గతేడాది నవంబర్ 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అస్పత్రిలో సీటీ స్కానింగ్ యంత్రాన్ని కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రోడ్డు ప్ర మాద బాధితులు, తలకు, మెదడు, గుండె సంబంధిత సమస్యలు, అంతర్గత గాయాలు తదితర రోగులకు ప్రయోజనం కలుగుతుందని అనుకున్నారు. కానీ ప్రారంభించి నాలుగు నెలలు అవుతున్నా రేడియాలజీ, సీటీ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఆఫిసర్లను నియమించలేదు. దీంతో సీటీస్కాన్ సేవలు రోగులకు అందడం లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులను పరీక్షిస్తున్న వైద్యులు సీటీస్కాన్ అవసరం ఉంటే వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేస్తున్నారు. లేదంటే ప్రైవేట్‌లో డబ్బులు పెట్టి సేవలు పొందాల్సిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. టెక్నీషియన్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉండగా సీటీ స్కానింగ్ యంత్రం నిర్వహణపై ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టిసారించడం లేదు. కావాల్సిన సిబ్బంది నియామకంపై సంబంధింత అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నట్లు కనిపిస్తుంది.యంత్రాన్ని ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని జిల్లా ప్రజలు అంటున్నారు. రెండు నెలల క్రితమే టెక్నీషియన్ నియామకానికి నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నోటిఫికేషన్ అనంతరం దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థుల ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ ఎంపికలో పారదర్శకత పాటించడం లేదని కలెక్టర్ తిరస్కరించినట్లు తెలిసింది. ఆస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని తనం మూలంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మల్హర్(కాటారం): ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. కాటారం మండలకేంద్రంలో పల్లె ప్రకృతి వనం క్లీనింగ్ పనులను డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్‌రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. 108 వాహనం తనిఖీ రేగొండ: మండలకేంద్రంలో 108 వాహనాన్ని 108 జిల్లా మేనేజర్ రాజునాయక్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనంలోని పరికరాల పనితీరు, మందులు, రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ శంకర్రావు, పైలట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏఐఎఫ్బీ జిల్లా కన్వీనర్‌గా నరసింహారెడ్డి భూపాలపల్లి అర్బన్: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) జిల్లా కన్వీనర్‌గా లక్కిరెడ్డి నరసింహారెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కన్వీనర్, వైస్ ప్రెసిడెంట్ అంబటి జోజిరెడ్డి సోమవారం హైదరాబాద్‌లో నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. నరసింహారెడ్డి నాయకత్వంలో జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయ ఈఓగా బాధ్యతల స్వీకరణవెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయానికి నూతన ఈఓగా (ఆలయ కార్యనిర్వహణాధికారి) ఇమ్మడి భాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ మండలం వేలేరు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న భాస్కర్‌కు రామప్ప ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు కల్పిస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న బిల్ల శ్రీనివాస్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మండలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి అదనపు బాధ్యతలు కేటాయించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈఓ భాస్కర్ రామప్ప రామలింగేశ్వరస్వామికి కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి హరీశ్‌శర్మ ఈఓ దంపతులను శాలువాతో సత్కరించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ఉపయోగించుకోవాలిములుగు: పీఎం విశ్వకర్మ పథకాన్ని అర్హులందరూ ఉపయోగించుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో ఈడీసీర్యాంప్ ఆధ్వర్యంలో పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ రెడ్డి మాట్లాడారు. వడ్రంగులు, కంసాలులు, కుంచెవారు, దర్జీలు, నాయీబ్రాహ్మణులు, మట్టి పనివారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
వరే.. సరి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగువైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్లో వరిసాగు గతంతో పోలిస్తే కొంత మేర పెరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. సాగునీటి లభ్యత, మార్కెట్ డిమాండ్ కారణంగా రైతులు మళ్లీ వరి వైపు మొగ్గు చూపినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం సుమారు 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు ప్రాథమిక అంచనా. గత యాసంగిలో ఇది 5.98 లక్షల ఎకరాల వరకు మాత్రమే నమోదైంది. దీంతో ఈసారి దాదాపు 37 వేల ఎకరాలకు పైగా పెరుగుదల కనిపించింది. యాసంగి సాగు ఇలా... గతంతో పోలిస్తే ఈ యాసంగిలో వరిసాగు పదిశాతం మేర తగ్గుతుందని వ్యవసాయశాఖ అధికారులు మొదట అంచనా వేశారు. ఈ మేరకు ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 9,12,880 ఎకరాలని అంచనా వేసిన అధికారులు 5.75 లక్షల ఎకరాల్లో వరి పంటలకు అవకాశం ఉందన్నారు. అందుకు భిన్నంగా మొత్తం పంటలు 9,82,880 ఎకరాల్లో వేయగా, 6,34,579 (64.56 శాతం) ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొక్కజొన్న, ఇతర పంటలన్నీ కలిపితే 35.44 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే 37 వేల పైచిలుకు ఎకరాల్లో ఈసారి వరి సాగుకాగా, ఈసారి కూడా వరిసాగులో ఉమ్మడి వరంగల్‌ది రికార్డేనని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఒకరు పేర్కొన్నారు. వరి సాగు పెరగడానికి కారణాలు... హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా కొంత మేర విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాగునీటి లభ్యత, సాగు సౌకర్యాలు మెరుగుపడటం, ప్రభుత్వం వరి కొనుగోలుపై హామీ ఇవ్వడం, సన్నరకం మీద బోనస్ ఇవ్వడం వంటి కారణాలతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగును ఎక్కువగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో నీటి కొరత, వాతావరణ మార్పులు వంటి కారణాలతో వరి సాగు విస్తీర్ణం కొంత తగ్గిన ప్రాంతాలు కూడా ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. జిల్లా మొత్తం పంటలు వరి వరంగల్ 1,96,722 95,152 హనుమకొండ 1,77,735 1,11,380 జనగామ 2,07,353 1,79,010 మహబూబాబాద్ 2,13,665 1,07,617 జేఎస్ భూపాలపల్లి 1,17,085 89,000 ములుగు 70,320 52,420 మొత్తం 9,82,880 6,34,579 మొత్తం విస్తీర్ణంలో 64.56 శాతం వరి నమోదు గతంతో పోలిస్తే పెరిగిన వైనం.. మిగతా పంటలతో పోలిస్తే మేలంటున్న రైతులు -
ఆర్చరీలో అనయకు గోల్డ్‌మెడల్
మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో కాటారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రామిళ్ల అనయ గోల్డ్మోడల్ సాధించించి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి–13 విభాగం ఆర్చరీ పోటీల్లో అనయ 360లో 354 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 26వ తేదీ నుంచి విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో అనయ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించనున్నట్లు కోచ్ నగేష్ వెల్లడించారు. కోచ్ నగేష్, కుటుంబ సభ్యులు, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆమెను అభినందించారు. రాబోయే జాతీయ స్థాయి పోటీలలో అనయ మరింత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వంట గ్యాస్ ధరలు తగ్గించాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారం అవుతుందని తెలి పారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అ ప్పగిస్తూ పేద ప్రజలపై భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వ విధానమైందని విమర్శించారు. చేనేత కార్మికురాలికి సన్మానం కాళేశ్వరం: జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహదేవపూర్ టస్సర్ కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు గొర్రె కావ్యను ఆదివారం శాలువాతో సన్మానించారు. ప్రశంస పత్రం అందజేశారు. భూపాలపల్లి జిల్లా నుంచి ఆమెను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. నిరసన సెగ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆది వారం రాత్రి నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్‌కు నిరసన సెగ ఎదురైంది. స్థానిక యూని యన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశాన్ని బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనక్‌ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసగిస్తుండగా యూనియన్ నాయకులు కొందరు నిల్చొని జనక్‌ప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదానాలు చేస్తూ స్టేజీపైకి దూసుకెళ్లారు. ఏడాది కాలంగా మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, సొంతింటి పథకం కల నెరవేర్చడం లేదని, వేజ్‌బోర్డు కోసం నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ విధానాలతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదని మండిపడ్డారు. దీంతో స్పందించిన జనక్‌ప్రసాద్ త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలను ఐఎన్టీయూసీ మాత్రమే పరిష్కరిస్తుందన్నారు. నిరంతర విద్యుత్ ములుగు రూరల్: మండల పరిధిలోని మల్లంపల్లి ట్యాపింగ్ పాయింట్ నుంచి 3/11 కేవీ పత్తిపల్లి వరకు నిర్మించిన 33కేవీ ఇంటర్ లింక్ లైన్‌ను విజయవంతంగా చార్జీ చేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ ఆనందం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఇంటర్ లింక్‌లైన్ ద్వారా కాసిందేవిపేట, పత్తిపల్లి సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించవచ్చని తెలిపారు. -
మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు
భూపాలపల్లి అర్బన్: అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించే మహాశక్తి మహిళలకు ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి నిజమైన దారి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీ్త్రమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని, గ్రంథాలయానికి వచ్చి చదువుకునే మహిళా పాఠకులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి, లైబ్రేరియన్ రాణి, పాఠకులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు -
మహిళల పాత్ర కీలకం
భూపాలపల్లి: సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు ధైర్యంగా ముందుకుసాగుతూ అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. రాణి రుద్రమదేవి, సమ్మక్క–సారలమ్మ, రాణి లక్ష్మీబాయి వంటి మహనీయ మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహిళలు విద్య, ఉపాధి, పరిపాలన, క్రీడలు తదితర రంగాల్లో పురోగతి సాధిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, భూపాలపల్లి సీఐ డి.నరేష్కుమార్, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి యువత గంజాయి, మాదకద్రవ్యాలు లాంటి ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడా రంగాల్లో రాణించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆదివారంతో ముగిశాయి. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులకు వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన టీంలకు జిల్లా పోలీసు కార్యాలయంలో బహుమతులు అందజేశారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ అతిథిగా కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
మేడారంలో భక్తుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. అలాగే సినీనటుడు బాబు మోహన్ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయంగా బాబుమోహన్‌కు పూజారులు అమ్మవార్ల కండువా కప్పి ప్రసాదం అందజేశారు. జంపన్నవాగులో నీరు లేకపోవడంతో పాటు స్నానఘట్టాల వద్ద ఒక షెవర్ కూడా లేకపోవడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు.వనదేవతలకు మొక్కులు -
తగ్గనున్న దూరభారం
మల్హర్: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన కిషన్‌రావుపల్లి రహదారి నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి గతంలో టెండర్ ప్రక్రియ కావడంతో రోడ్డు పనులు నడుస్తుండడంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడిచర్ల మండల కేంద్రం నుంచి భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 2017 సంవత్సరంలో అనుమతి వచ్చింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ భూపాలపల్లి వన్ఇంకై ్లన్ మైన్ ఫారెస్ట్ రోడ్డులో ఫారెస్ట్ అధికారులు నిర్ధారించిన రోడ్డు ప్రదేశంలో మట్టి పనులు చేపడుతున్నారు. మట్టి పనులు పూర్తికాగానే లెవలింగ్ పనులు చేపట్టి అవసరమైన చోట కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. తగ్గనున్న దూరభారం.. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లాలంటే కాటారం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖమ్మంపల్లి–తాడిచర్ల మీదుగా కేవలం 30 కిలోమీటర్లలోనే భూపాలపల్లికి చేరుకోవచ్చు. ప్రస్తుతం నిత్యం వందలాది వాహనాలు మంథని మీదుగా సుదూర ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సగం దూరభారం తగ్గనుండటంతో విద్య, వైద్యం మరింత మెరుగుపడనుంది. సమయంతో పాటు ఇంధన ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో తాడిచర్లతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాలు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతాయి. కిషన్‌రావుపల్లి ఫారెస్ట్‌లో రానున్న ఆరు నెలల కాలంలో రోడ్డు అందుబాటులోకి వస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, మెరుగైన వైద్యానికి అనువుగా ఉంటుంది. ప్రయాణభారం తగ్గుతుంది. జిల్లా కార్యాలయాలకు, ఇతర అవసరాలకు భూపాలపల్లికి వెళ్లడానికి కొయ్యూరు నాగులమ్మ మీదుగా భూపాలపల్లికి పోతున్నాం. ఈ రోడ్డు పూర్తయితే ఉపయోగకరంగా ఉంటుంది. – చింతలపల్లి మల్హల్రావు, మాజీ ఎంపీపీ, మల్హర్● పెరగనున్న రవాణా సౌకర్యం పారిశ్రామికంగా మరింత అభివృద్ధిరిజర్వ్ ఫారెస్ట్ నుంచి రోడ్డు నిర్మాణానికి మోకాలడ్డిన అటవీశాఖ ఎట్టకేలకు ఒక వరస రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్‌రావుపల్లి నుంచి అటవీప్రాంతం గుండా భూపాలపల్లి వన్ ఇంకై ్లన్ మైన్ వరకు ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టవచ్చని.. కాగా ఆ ప్రాంతంలో తాము నష్టపోతున్న చెట్ల సంపదకు గాను రూ.4.67 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సదరు నిధులు చెల్లించింది. కిషన్‌రావుపల్లి నుంచి భూపాలపల్లి సమీపంలోనే వన్ఇంక్లైన్ వరకు 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో టెండర్ ప్రకియ పూర్తయింది. -
భూపాలపల్లిలో ఆస్తిపన్నుల వివరాలు..
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026అసెస్మెంట్లు 12,413 ప్రస్తుత డిమాండ్ రూ. 6.7 కోట్లు ఫెనాల్టీ రూ. 21.33 లక్షలు పాత బకాయిలు రూ. 1.74 కోట్లు పాత బకాయిల ఫెనాల్టీలు రూ. 99.2 లక్షలు ఈ సంవత్సరం వసూలు రూ. 3.5 కోట్లు పాత బకాయిల వసూలు రూ. 22.57 లక్షలు రావాల్సిన మొత్తం బకాయిలు రూ. 3.2 కోట్లు -
ఆటల పోటీలు
భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్లో శనివారం మహిళలతో పాటు మహిళా ఉద్యోగులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. భూపాలపల్లి ఏరియాలోని గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, లేడీస్ క్లబ్ సభ్యులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సింగరేణి సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. గెలుపొందిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. -
పట్టణాభివృద్ధే లక్ష్యం
నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ● కౌన్సిలర్ల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి ● వీఐపీ రిపోర్టర్, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళములుగు: ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్నారు.. తెల్లవారుజాము నుంచి పొద్దుగూకే వరకు పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వీధులు, డ్రెయినేజీలను మున్సిపల్ కార్మికులు శుభ్రపరుస్తున్నారు.. చెత్తాచెదారాన్ని తొలగిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. అరకొర వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సరైన రక్షణ పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ములుగు మున్సిపల్ తొలి చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన చింతనిప్పుల చంద్రకళ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చూపేందుకు శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 4వ వార్డులో పర్యటించి కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చంద్రకళ: ఎలా ఉన్నారు.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? స్వరూప: ప్రభుత్వం అందించే రూ.9,500 వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచి ఆదుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నాం. సెలవురోజుల్లో కూడా పనులు చేస్తూ వీధులు శుభ్రపరుస్తున్నాం. చంద్రకళ: సొంత ఇళ్లు అందరికీ ఉన్నాయా? పూలమ్మ: ఇరవై ఏళ్లకు పైగా కార్మికురాలిగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. కిరాయికి ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. కార్మికులందరికీ ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించి ఇస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. చంద్రకళ: ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? విజయ: డ్రెయినేజీలు శుభ్రం చేయడం, చెత్తను తరలించే క్రమంలో దుర్వాసన వస్తుంది. బ్యాక్టీరియా వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కార్మికులకు గ్లౌస్, మాస్క్‌లు, బూట్లు, భద్రత పరికరాలు పంపిణీ చేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమాతో పాటు శాశ్వత ఉద్యోగ కల్పనతో పాటు వేతనాలు పెంచాలి. చంద్రకళ: తాగునీటి సరఫరా ఎలా ఉంది? రాజక్క: కాలనీలో చేతిపంపులు పనిచేయడం లేదు. తాగునీటి సమస్య ఉంది. ఎండాకాలం ప్రారంభమైనందున తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. చంద్రకళ:అందరికీ పింఛన్లు వస్తున్నాయా? మల్లిక: కాలనీలో చాలామందికి పింఛన్లు రావడం లేదు. పింఛన్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటివరకు రాలేదు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వృద్ధాప్య, వింతంతువు, దివ్యాంగులకు పింఛన్లు అందించాలి. చంద్రకళ:కాలనీలో ఇంకా ఏమైనా సమస్యలు నెలకొన్నాయా? రమ: కోతుల బెడద తీవ్రంగా ఉంది. అన్ని కాలనీల్లో కోతులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. రోడ్డుపై నడిచి వెళ్లేవారితో పాటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. -
బాలికలకు ఆరోగ్య భరోసా
భూపాలపల్లి అర్బన్: మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్భాశయ ముఖద్వారా (సర్వైకల్) క్యాన్సర్ నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యుమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) టీకాలు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గత నెల 28వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నేడు(ఆదివారం) మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించనున్నారు. క్షేత్రస్థాయిలో బాలికలకు టీకా ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ తన కార్యాలయంలో ప్రోగ్రాం అఽధికారులు, వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీచేశారు. 100కు పైగా నమోదు.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌తో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో 100 కేసులకు పైగా నమోదయ్యాయి. హ్యుమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఇది సోకుతుందని చెబుతున్నారు. శరీరంలోనూ వైరస్ కారణంగా ఇది సోకుతుంది. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల తరబడి వృద్ధి చెంది క్యాన్సర్‌కు కారణమవుతుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం కావడానికి అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ అవగాహన లేమితో చాలామంది పరీక్షలు చేయించుకోక దీనిబారిన పడుతున్నారు. మొదటి దశలో గుర్తించలేక వ్యాధి ముదిరిపోయే దశలో బయటపడి మరణానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో 2,400మంది విద్యార్థులు ఇప్పటికే టీకా వేయడంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే జరిపి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు ఉన్న బాలికలు 2,400 మంది ఉన్నట్లు గుర్తించారు. ఒక్కొక్కరికి ఒక డోసు హెచ్‌పీవీ టీకా వేయనుండగా భవిష్యత్‌లో వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు తలెత్తకుండా నియంత్రించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సర్వేకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా 95శాతం వరకు రక్షణ ఇస్తుందని వైద్యులు గుర్తించారు. మొదటి విడత మూడు కేంద్రాల్లో.. మొదటి విడతలో 30 రోజుల పాటు మూడు కేంద్రాల్లో వాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్పెషల్ డ్రైవ్ కింద జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, చిట్యాల, మహదేవపూర్‌లోని సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సిన్లు వేస్తారు. ప్రతీ బుధవారం, శనివారాల్లో మాత్రమే టీకా వేయనున్నారు. ఏర్పాట్లు పూర్తిచేశాం.. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని నేడు జిల్లాలో ప్రారంభిస్తున్నాం. జిల్లాలో 2,400మంది బాలికలను ఇప్పటికే గుర్తించాం. టీకా పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే టీకా తీసుకున్నవారు తిరిగి తీసుకోవద్దు. – డాక్టర్ చల్లా మధుసూదర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మొదటి విడతలో భూపాలపల్లి, చిట్యాల, మహదేవపూర్ 14–15 ఏళ్లలోపు మధ్య వారికి టీకాలు జిల్లాలో 2,400వేల మంది గుర్తింపు -
తగ్గని నేరాలు.. అందని న్యాయం
● ప్రతీ ఏటా మహిళలపై దాడులు ● అత్యధిక శాతం కేసులు పెండింగ్‌లోనే.. ● బాధితులకు సకాలంలో అందని న్యాయం భూపాలపల్లి: మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. జిల్లాలో ప్రతీ ఏటా వందల కేసులు నమోదవుతున్నా.. అత్యధిక కేసులు ఠాణాలు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటంతో నేరస్తులకు సకాలంలో శిక్షలు పడటం లేదు. వరకట్న వేధింపుల కేసులే ఎక్కువ.. లైంగిక దాడులు, హత్యలు ఒకటి రెండు మాత్రమే నమోదవుతుండగా.. వరకట్న వేధింపుల కేసులే అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలో మూడేళ్లుగా మహిళలపై నేరాల కేసులు 250కి పైగా నమోదు కాగా.. సగం కేసులు వరకట్న వేధింపులవే ఉన్నా యి. ఇందులో నూటికి 90 శాతం కేసులు చార్జ్‌షీట్ రాక పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉండగా.. పదిశాతం కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించిన కేసులు రెండో స్థానంలో నమోదవుతున్నాయి. లైంగిక దాడులవి ఏటా పదివరకు నమోదవుతున్నాయి. పెండింగ్‌లోనే కేసులు.. వరకట్న హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యయత్నం, వేధింపులు, మహిళల హత్యలు, లైంగికదాడి, కిడ్నాపింగ్, మహిళల గౌరవానికి భంగం, రెండో పెళ్లిళ్లు తదితర కేసులు ప్రతీ ఏటా జిల్లాలో సగటున 250 వరకు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో లోక్ అదాలత్‌లో పరిష్కారం అవుతుండగా, 150 వరకు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలినవన్నీ పోలీస్స్టేషన్లలో పెండింగ్, చార్జిషీట్ కోసం వేచి చూడటం తదితర కారణాలతో ఉన్నాయి. 2025లో నమోదైన కేసుల వివరాలు.. 2025 సంవత్సరంలో వరకట్న ఆత్మహత్య కేసు ఒకటి నమోదు కాగా.. కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆత్మాహత్యాయత్నం కేసులు ఆరు నమోదుకాగా రెండు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వరకట్న వేధింపుల కేసులు 117 నమోదు కాగా 77 కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. మహిళ హత్య కేసులు ఐదు నమోదు కాగా.. ఒకటి కోర్టు పెండింగ్‌లో ఉంది. లైంగిక దాడుల కేసులు 10 నమోదు కాగా.. ఏడు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. కిడ్నాపింగ్ కేసులు 17 నమోదు కాగా ఒకటి కోర్టులో ఉంది. మహిళ గౌరవానికి భంగం కేసులు 97 నమోదు కాగా ఒక కేసులో రాజీ కుదరగా.. 59 కోర్టు పెండింగ్‌లో ఉన్నాయి. భర్తకు రెండో పెళ్లి కేసులు రెండు నమోదయ్యాయి. -
ఉత్తమ గేయ రచయితగా నందకిషోర్
గణపురం : మండలకేంద్రానికి చెందిన తాళ్లపెల్లి నందకిషోర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ 2025 అవార్డులలో ఉత్తమ గేయ రచయితగా ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన కుబేర సినిమాలో నంద కిషోర్ రెండు పాటలు రాయగా అందులో ఆకలితో నువ్వు పస్తుంటే అనే పాటకు ఆయనను ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నందకిషోర్‌ను పలువురు అభినందిస్తున్నారు. విద్యుత్ సమస్య రాకుండా చూడాలి చిట్యాల: వినియోగదారులకు ఎండాకాలంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సుందర్‌కుమార్ విద్యుత్ సిబ్బందికి తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా విద్యుత్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఎక్కడైనా అధిక లోడు ట్రాన్స్ఫార్మర్ ఉంటే దానిని గుర్తించి కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్లు వెంకటేశ్ , రమేశ్, ఎస్కే అక్బర్, ఎస్ఎల్ఐ కుమార్‌స్వామి, లైన్ ఇన్స్పెక్టర్ సతీష్, ఏఎల్ఎం, సిబ్బంది పాల్గొన్నారు. మంజూరు పత్రాల అందజేత హన్మకొండ కల్చరల్: వరంగల్‌జోన్ పరిధి కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరస్వామి దేవాలయంలో పదవీ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ పవన్‌కుమార్, ప్రధానార్చకుడు క్రిష్ణమూర్తిలకు అర్చక సంక్షేమ నిధినుంచి రూ.8లక్షలు మంజూరయ్యాయి. ఆ మంజూరు పత్రాలను శనివారం హనుమకొండలోని రాంనగర్లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వారికి అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జోన్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామల సునీత పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
మంత్రి సీతక్క సహకారంతో ములుగు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. ప్రతీ కాలనీని నేరుగా సందర్శించి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాను. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఇంటింటికీ నల్లానీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీకాలనీలో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మారుస్తాం. ప్రధానంగా డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. డ్రెయినేజీ సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిలర్ల సహకారంతో సంబంధిత అధికారులతో చర్చించి ముందుకెళ్తాం. – చింతనిప్పుల చంద్రకళ, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ -
సొంత నిర్ణయంతోపాటు తల్లిదండ్రుల సూచనతోనే కోర్సు ఎంపిక మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వేలో విద్యార్థినుల మనోగతం
‘మేం రోజువారీ తీసుకునే నిర్ణయాల్లో సగమే స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాం.. ఇటు తల్లిదండ్రుల సూచన, సొంత నిర్ణయంతో ఇప్పుడు చదువుతున్న కోర్సులను ఎంచుకున్నాం. మేం తీసుకునే నిర్ణయాల్లో సగమే మద్దతు వస్తోంది. పూర్తి స్థాయిలో రావాలి. అదే సమయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా మేం ఉండాలి.’ అని అంటున్నారు విద్యార్థినులు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘మీరెంత ఇండిపెండెంట్’.. అన్న అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థినులను ‘సాక్షి’ సర్వే చేసింది. పలు అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. – సాక్షి నెట్వర్క్ ఏ) పూర్తిగా బీ) కొద్దిమేర సీ) లేదు 3. మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది? 2. మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును మీరు కావాలనే ఎంచుకున్నారా?ఏ) నా సొంత నిర్ణయం58ఏ) 50 %44ఏ4. ఒక సీ్త్ర ఇండిపెండెంట్‌గా ముందుకు వెళ్లాలంటే.. ఎవరి సహకారం ఎక్కువ అవసరం? 18బీ) 100%బీ8సీ) సమాజంసీ) 25%ిసీబీ) స్నేహితులు24ఏ) కుటుంబంబీ) మా తల్లిదండ్రుల నిర్ణయం 88సీ) స్నేహితుల సూచనడీ) 0%సర్వే శాంపిల్ : ప్రతీ జిల్లా నుంచి 20 మంది, ఆరు జిల్లాల నుంచి 120 మంది●ఇండిపెండెంట్‌గా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం1. మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. -
క్రీడలతో శారీరక దారుఢ్యం
భూపాలపల్లి: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో అంబేడ్కర్ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్‌తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్య చైతన్యం, ఐక్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అనంతరం ఎస్పీ సంకీర్త్, అదనపు ఎస్పీ నరేష్కుమార్ ఫ్రెండ్లీ వాలీబాల్ మ్యాచ్ ఆడారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాల యువతతో 13 జట్లను తీసుకొని వారికి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, సీఐ డి.నరేష్కుమార్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: ఇన్‌సర్వీస్ అభ్యర్థుల నుంచి ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జుమ్లానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత వృత్తిలో కనీసం మూడు సంవత్సరాల అనుభవంతో పరిశ్రమలలో పనిచేస్తూ జీపీఎఫ్, ఈపీఎఫ్, ఈఎస్ఐ కలిగి ఉన్న ఇన్ సర్వీస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు వరంగల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో దరఖాస్తు ఫారాలు అందించనున్నట్లు తెలిపారు. ఉపసర్పంచ్‌ల జిల్లా కమిటీ ఎన్నిక భూపాలపల్లి రూరల్: జిల్లా ఉప సర్పంచ్ల కమిటీని ఎన్నుకున్నట్లు ఆ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల కార్తీక్ తెలిపారు. జిల్లాకేంద్రంలో రైస్‌మిల్లర్ల అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గట్టు ప్రదీప్ గౌడ్, (గోరి కొత్తపల్లి), జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బొబ్బిలి రాజు (కొయ్యుర్), జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెల శంకర్ (రేగొండ)తో పాటు తదితరులను ఎన్నుకున్నారు. రమేశ్‌కు జాతీయ సేవారత్న అవార్డు భూపాలపల్లి అర్బన్: స్థానిక న్యాయవాది భూక్యా రమేశ్‌నాయక్‌ను జాతీయ సేవా రత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రమేశ్‌నాయక్ న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తూనే సేవా కార్యక్రమాల్లో చేసిన విశిష్ట కృషికి సేవా రత్న నేషనల్ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అటవీశాఖ కార్యాలయంలో వేడుకలు భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కాళేశ్వరం సర్కిల్ మినిస్టీరియల్ ఫోరం అధ్యక్షుడు సలీం రాజిమీర్జా, కోశాధికారి మధుప్రసన్న ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏఓ కొమురయ్య, సభ్యులు పాల్గొన్నారు. వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్‌గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. పనులు పూర్తి చేయండివాజేడు: జాతీయ రహదారి విస్తరణ పనులను పూర్తిచేయాలని నేషనల్ హైవే ఈఈ మనోహర్ అన్నారు. వాజేడు మండలంలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు వరకు 10 కిలో మీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. శుక్రవారం వాజేడుకు వచ్చిన ఆయన రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఆయన వెంట నేషనల్ హైవే ఏఈ రామ్ముర్తి ఉన్నారు. -
సర్వర్ సమస్య
కాళేశ్వరం: ఉపాధిహామీ పథకంలో మరింత పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. పనులకు వచ్చే కూలీలకు (ఎఫ్ఆర్ఎస్) ముఖహాజరు విధానాన్ని అమలు చేస్తుంది. పథకంలో వెలుగుచూసిన అక్రమాలు, అవకతవకలు అరికట్టడంతో పాటు కూలీలకు సరైన న్యాయం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విధానానికి ఆదిలోనే సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. సర్వర్ సమస్య.. ఇంతకు ముందు కూలీలందరినీ ఒక బృందంగా ఫొటో తీసి (ఎన్ఎంఎంఎస్) నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌లో నిక్షిప్తం చేసేవారు. కొత్త విధానం అమలు ద్వారా ప్రతి కూలీ ముఖాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ పూర్తయిన కూలీలకు మాత్రమే పని ప్రదేశంలో సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. తద్వారా వేరొకరి పేరిట హాజరు వేయడం అసాధ్యమవుతుంది. ఈ–కేవైసీ పూర్తి చేసుకుంటేనే ఉపాధిహామీ పథకంలో పనికి తగిన వేతనం లభించే అవకాశం ఉంటుంది. మార్చి 1 నుంచి.. ప్రస్తుతం కొత్త విధానం మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య ముఖగుర్తింపు విధానానికి సవాలుగా మారుతుంది. శివారు ప్రాంతాల్లో కూలీలు పనిచేయాల్సి ఉంది. ఇక్కడ సిగ్నల్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీనిని అధిగమించేందుకు పని ప్రదేశంలో ఫొటోలు తీసుకొని సిగ్నల్ వచ్చే ప్రాంతాలకు వెళ్లి అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తేనే ఇబ్బందులు రావని పలువురు ఫీల్డ్అసిస్టెంట్లు అంటున్నారు. దీంతో ప్రతీ కూలీ ఐరిస్(కంటి ఆధారిత) ద్వారా తీసుకొని తరువాత గ్రూప్ ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. పని ప్రారంభం ముందు..నాలుగు గంటల తరువాత మరో ఫొటో తీయాలని నిబంధన విధించారు. చాలా మంది కూలీలకు ఈకేవైసీ పూర్తయినప్పటికీ యాప్‌లో ఐరిస్ క్యాప్చర్ కావడం లేదు. ఉదాహరణకు 50–60 మంది కూలీలు పనికి వస్తే నాలుగు నుంచి ఐదుగురికి క్యాప్చర్ అవుతుంది. ఫొటోకు ఫొటోకు మధ్యన సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఫీల్డ్అసిస్టెంట్లకు భారం పెరిగిందని అంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కూలీలు మొరపెడుతున్నారు. దీంతో మొదటి రెండు రోజులు కొంత మంది వేచి చూసి వెనుదిరిగారని తెలిసింది. ఉపాధిహామీ పనులకు వచ్చే వారికి సర్వర్ సమస్యలకు అధికారులు కొంత మినహాయింపు ఇచ్చారు. జన్మనరేగా యాప్‌తో మస్టర్లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. చిట్యాల మండలంలో మొదటి రోజు సోమవారం పనికి వచ్చిన కూలీలకు మస్టర్ పడకపోవడంతో తిరిగి వెళ్లారు. దీంతో రెండు రోజుల ముందుగానే మస్టర్ డిమాండ్ ఫా రంలో కూలికి వచ్చే వారి పేర్లు నమోదు చేసి జన్మనరేగా యాప్‌తో మస్టర్లు వేస్తున్నారు. మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో ఐరిస్‌తో ఇబ్బందులు తప్పడం లేదు. టేకుమట్ల మండలం రామకృష్ణపూర్‌లోని సర్వర్ డౌన్ ఉండడంతో టేకుమట్లకు వచ్చి మస్టర్ నమోదు చేస్తున్నారు. కూలీలు పనిచేసి తిరిగి వచ్చి ఫొటోదిగి వెళ్తున్నారు. ఇలా నాలుగుసార్లు వచ్చిపోతున్నారు. పలిమెల మండలంలో సర్వర్ సమస్యతో మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. మహదేవపూర్ మండలంలో బీరసాగర్, ఏన్కపల్లిలో సర్వర్ సమస్యలు వస్తున్నాయి. దీంతో యాప్‌తో మధ్యాహ్నం ఒంటి గంట వరకు మస్టర్లు వేస్తున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు సర్వర్ పని చేస్తుంది. ఆ తరువాత పని చేయడం లేదు. మహాముత్తారం మండలం సింగారం, బోర్లగూడెం, నర్సింగపూర్ గ్రామాల్లో సర్వర్ పని చేయడం లేదు. మల్హర్‌లో చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయి. ఆదిలోనే సమస్యలు కంటిఆధారితంగా తీసుకోని క్యాప్చర్ సర్వర్ సమస్యలు సరిచేయాలని కూలీల మొర ప్రస్తుతం నాలుగువేల మందికి అటెండెన్స్ఉపాధిహామీలో కొత్త విధానంతో సమస్యలు ఉన్నది వాస్తవమే. కానీ త్వరలో అప్డేట్ చేస్తారు. గ్రామాల్లో సర్వర్ సమస్యలతో ఇబ్బందులను గుర్తించాం. కూలీల హాజరుకు ఇబ్బంది లేదు. మొత్తం ఏడు వేల మంది కూలీలు పనికి వచ్చేవారు ఉండగా.. రెండు రోజులుగా నాలుగు వేలకు పైన కూలీలకు అటెండెన్స్ వేశారు. త్వరలో అన్ని పరిష్కారం అవుతాయి. – బాలకృష్ణ, డీఆర్డీఓ -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, చిత్రంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సమావేశానికి హాజరైన కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్‌బాజ్‌పాయ్, సందీప్‌కుమార్ ఝా, దివాకర టీఎస్, అధికారులుసాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. పాత భవనాలకు అవసరమైన చోట రంగులు వేయించాలని సూచించారు. ఇవేకాకుండా ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలించాలని, ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఉపాధి హామీ పథకంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్‌లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నా రు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్‌ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
‘ప్రగతి ప్రణాళిక’ ఘనంగా నిర్వహించాలి
భూపాలపల్లి: జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణకు ప్రతీ శాఖకు సంబంధించి నోడల్ అధికారులను నియమించామన్నారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు శుభ్రత, ఫైల్ క్లియరెన్స్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు రోడ్డు భద్రత అలైవ్–అరీవ్ అనే థీమ్‌తో రోడ్డు భద్రతపై అవగాహన, ఏప్రిల్ 13 నుంచి 18వ తేదీ వరకు మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్ 12వ తేదీ వరకు శాఖలకు కేటాయించిన తేదీల్లో ఆయా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ప్రతీ కుటుంబం పరిశుభ్రత పాటించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని.. ప్రతీ కుటుంబం పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, డ్రెయినేజీలు, కాలనీలు, ఇళ్ల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సౌకర్యాలు, డ్రెయినేజీ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, మిడిల్ పోల్స్ అవసరం వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ మీటర్లు ఏర్పాటుచేసి విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా హెల్త్ మిషన్ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కేజీబీవీ హెల్త్ మిషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జూన్ 9వరకు కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు నాణ్యమైన వైద్యసేవలను నేరుగా చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
బెదిరిస్తే పనెలా చేయాలని ఏఈ నిరసన!
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మార్కింగ్ చేయడానికి వచ్చిన తనను పబ్లిక్ బెదిరిస్తున్నారని, వారు చెప్పినట్లు మార్కింగ్ ఇవ్వాలని అంటున్నారని నిరసిస్తూ హౌసింగ్ ఏఈ బైఠాయించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఏఈ మాట్లాడిన తీరు.. తాను ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేస్తానని.. స్లాబ్ ఏరియా 600 స్క్వేర్‌ఫీట్లు మించొద్దని చెప్పినా కొంతమంది వినిపించుకోవడం లేదన్నారు. తనను బెదిరిస్తున్నారని వాళ్ల డాడీకి ఫోన్ చేసి ఇంటికి ఉద్యోగం వదిలి వెళ్లొస్తానని తెలిపారు. కలెక్టర్, గవర్నర్‌కు చెప్పి ఇక్కడికి తీసుకురావాలని అతడి డాడీతో బాధ వ్యక్తం చేశాడు. లేకపోతే సచ్చిపోతానని తెలిపాడు. మర్యాద లేదని, తనది కోపం కాదు.. బాధ అంటు కష్టపడి చదువుకొని ఉద్యోగంలోకి వచ్చాను.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలువలేదని అన్నాడు. పక్కనే ఉన్నవారంత నచ్చజెప్పి ఏఈని అలా మాట్లాడొద్దని బతిమిలాడారు. అనంతరం ఏఈ జిల్లా ఉన్నతాధికారికి కూడా ఫోన్ చేసి బాధను వివరించాడు. ఇటీవల జరిగిన ఈ విషయం ప్రజల వ్యవహారశైలితో విసుగు చెందిన ఏఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయమై మహదేవపూర్ ఎంపీడీఓ రవీంద్రనాథ్‌కు ఫోన్‌చేయగా అందుబాటులోకి రాలేదు. -
దరఖాస్తు గడువు పెంపు
భూపాలపల్లి అర్బన్: స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు డీవైఎస్ఓ రఘు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షకేంద్రం తనిఖీ చిట్యాల: మండలకేంద్రంలోని మోడల్స్కూల్లో ఇంటర్మీడియట్ పరీక్షలను అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కళాశాల సిబ్బందికి సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ జయశ్రీ ఉన్నారు. కార్మిక చట్టాలపై అవగాహన భూపాలపల్లి అర్బన్: ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు నూతన కార్మిక చట్టాలపై జీఎం కార్యాలయ ఆవరణలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నాగశేషు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన కార్మిక కోడ్ల ముఖ్యాంశాలను కార్మికులకు వివరించారు. నూతన కార్మిక కోడ్ల అమలుతో దేశ కార్మిక చరిత్రలో కొత్త దశ ప్రారంభమైందని తెలిపారు. కార్మిక సంక్షేమం, భద్రత, కనీస వేతనాలు, గౌరవప్రదమైన జీవన విధానానికి ఈ చట్టాలు ప్రాధాన్యం ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (సివిల్) రవికుమార్, డీవైఎస్ఈ అశోక్‌రెడ్డి, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్‌కుమార్, సివిల్ సూపర్వైజర్లు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గండ్ర భూపాలపల్లి రూరల్: హైదరాబాద్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు, రా జ్యసభకు ఎంపికై న వేం నరేందర్ రెడ్డిని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలి మొగుళ్లపల్లి: అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. గురువారం రంగాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం–2లో నిర్వహించిన బారసాల, అక్షరాభ్యాసం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి మాట్లాడుతూ గర్భిణులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మిస్తారన్నారు. స్థానికంగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినడం ద్వారా ప్రతిరోజు అంగన్వాడీలో అందించే పాలు, గుడ్డు, భోజనం చేస్తే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. చిరుధాన్యాలు ఖచ్చితంగా ఒకపూట భోజనంలో చేర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేసు మమత, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
చెత్త కుప్పలు..
● రోడ్ల వెంట చెత్త నిల్వలు ● పట్టించుకోని పాలకవర్గం, అధికారులు ● ఇబ్బందుల్లో పట్టణ ప్రజలుభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ నిర్వహణ అధ్వానంగా మా రింది. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏ మూ లన చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేనితనం మూలంగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నా.. పట్టణ ప్రజలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. కాలనీల ప్రజలతో పాటు విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి పట్టణంలో 30 వార్డులు ఉండగా చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. కాలనీల్లో వారానికి, పదిరోజులకు ఒక సారి చెత్త సేకరించేందుకు పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారని ఆయా కాలనీ ల వాసులు అంటున్నారు. చెత్త సేకరణ రోజువారీగా చేయకపోవడంతో కాలనీ వాసులు రోడ్లు, ఖాళీ స్థలాలు, మురికికాలువల్లో చెత్తను పడేస్తున్నారు. కాలనీలపై అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పది రోజుల పాటు రోడ్లు, ఖాళీ స్థలాల్లో చెత్త కుళ్లిపోవడంతో దోమలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ మాత్రమే ఉంది. పట్టణంలో ఉన్న మురికినీటి కాలువల్లో చెత్తా చెదారం నిండిపోయి నీరు నిలుస్తోంది. చిన్న వర్షం వస్తే ఆ నీటితో కాలువలు పూర్తిగా నిండిపోతాయి. చాలావరకు ఇళ్లనుంచి వచ్చే చెత్తాచెదారాన్ని రోడ్డు పక్కన, కాలువల్లో పారవేయడం పరిపాటిగా మారింది. కొన్నిచోట్ల తాగునీటి కాలువలు పగిలి నీరు బయటకు వచ్చి సమీపంలోని మురికికాలువల్లో కలుసున్నాయి. దీంతో రోడ్డు మార్గంలో వచ్చిపోయే వారు ముక్కు మూసుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెత్త కుళ్లిపోవడం వలన దోమలు వ్యాపించి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. భూపాలపల్లి పట్టణంలోని 30 వార్డుల్లో సుమారు 70వేల మంది నివసిస్తున్నారు. ఇంత పెద్ద పట్టణానికి కేవలం 17 చెత్త కుండీలు మాత్రమే కొనుగోలు చేసి అక్కడక్కడ ఏర్పాటు చేశారు. అవి అక్కడక్కడ ధ్వంసమై నిరుపయోగంగా మారాయి. కాలనీల్లో వారంలో ఒకటి రెండు సార్ల మాత్రమే చెత్తను సేకరించడం వలన చెత్తను నిల్వ చేసుకోలేక కాలనీల్లో ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కన, మురికి కాలవల్లో చెత్తను పడేస్తున్నారు. పట్టణంలో ప్రతీ కాలనీలో రెండు కుండీలను ఏర్పాటు చేయడం వలన రోడ్లు, ఖాళీ స్థలాల్లో చెత్త పడేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. నిరుపయోగంగా మారిన పాడైన చెత్తకుండి -
ఫోరెన్సిక్ నివేదికలు కీలకం
భూపాలపల్లి అర్బన్: కేసుల విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రొబేలాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అడీషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోరెన్సిక్ నివేదికలు, వేలిముద్రల విశ్లేషణ, చేతిరాత పరిశీలన, సైబర్ ఫోరెన్సిక్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఫోరెన్సిక్ నివేదికలపై న్యాయవాదులకు పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పుడే కేసుల విచారణ సులభతరం అవుతుందన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలను సకాలంలో సేకరించి, వాటిని శాసీ్త్రయంగా విశ్లేషించి కోర్టు ముందు సమర్పించినప్పుడు కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రొబేలాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మోహన్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, భూపాలపల్లి ఎస్సై రవళి, సీనియర్ న్యాయవాదులు కూనూరి సురేష్‌కుమార్, పగడాల ఆనందరావు, రాజ్‌కుమార్, చిరంజీవి, రవీందర్, ప్రియాంక పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవాలి..
టీజీ మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలి. ఎకరానికి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి చివరకు రెక్కల కష్టం కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోవాలి. – టి.సారయ్య, ఉపాధ్యక్షుడు, ఎంఏసీఎస్, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి దళారులు ఇబ్బంది పెడుతున్నారు..మార్క్‌ఫెడ్ అధికారులు సరైన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. ఖరీఫ్‌లోనూ రైతులకు మక్కలు అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు యాసంగి మొక్కజొన్నల విషయంలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలి – రామారపు సాంబయ్య, రైతు, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి -
మానసికోల్లాసానికి స్పోర్ట్స్ మీట్
● ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నిత్యం విధులు నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్న పోలీసులకు మానసికోల్లాసం కలిగించడానికే జిల్లా స్థాయి నాలుగో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహణ చేపడుతున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా స్థాయి నాలుగో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను ఈనెల 6తేదీ (శుక్రవారం) నుంచి ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 194 మంది పోలీస్ సిబ్బంది పాల్గొననున్నట్లు చెప్పారు. పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్‌తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీలను పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. నిత్యం విధులు నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్న పోలీస్ సిబ్బందికి ఒత్తిడిని తగ్గించడం, శారీరక ధృఢత్వం పెంపొందించడం ఈ క్రీడా పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీస్ సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, పరస్పర సమన్వయం పెంపొందించడమే ఈ స్పోర్ట్స్ మీట్ ముఖ్య లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల యువతను భాగస్వామ్యం చేయించడం ద్వారా పోలీసులు, ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


