ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జిల్లా ప్రజలకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 2026 సంవత్సరలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే అధికారులు, అనధికారులు బొకేలు, పుష్పగుచ్ఛాలకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, పరీక్ష ప్యాడ్స్‌ను అందించాలని కలెక్టర్ కోరారు.
‘ఆపరేషన్ స్మైల్’
విజయవంతం చేయాలి
భూపాలపల్లి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో కూడిన రెండు టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా హోటళ్లు, దాబాలు, దుకాణాలు, పరిశ్రమలు, ఇటుకబట్టీలు, నిర్మాణ పనులు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైన బాలలు పనిలో ఉన్నట్లు గుర్తిస్తే డయల్ 100, చైల్డ్‌లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ వీసీలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్ ఉన్నారు. అనంతరం ఏఆర్ ఎస్సై రవీందర్, డీసీఆర్‌బీ ఏఎస్సై సాంబయ్య ఉద్యోగ విరమణ పొందగా వారిని జిల్లా పోలీ స్ కార్యాలయంలో ఎస్పీ సత్కరించారు. శేషజీవితం ప్రశాంతంగా గడపాలని ఆకాక్షించారు.
ఓసీ–3లో వేబ్రిడ్జి ప్రారంభం
గణపురం: గణపురం మండలంలోని ఓసీ–3 ప్రాజెక్టులో నూతనంగా నిర్మించిన వేబ్రిడ్జిని భూపాలపల్లి సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వేబ్రిడ్జి నిర్మాణంతో బొగ్గు రవాణా, కొలతల ఖచ్చితత్వం మెరుగు పడుతుందన్నారు. తద్వారా ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శక పెరుగుతుందన్నారు.
భూపాలపల్లి ఆర్డీఓగా హరికృష్ణ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్డీఓగా హరికృష్ణ బదిలీపై వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న రవి హనుమకొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ కాగా ఆయన స్థానంలో నేడు (గురువారం) హరికృష్ణ బాధ్యతలు స్వీకరించే ఆకాశం ఉంది.
ముగిసిన నాపాక బ్రహ్మోత్సవాలు
చిట్యాల: మండలంలోని నైన్‌పాక గ్రామంలోని నాపాక ఆలయంలో మూడు రోజులుగా వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారం నాటికి ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు కార్యక్రమంలో భాగంగా భక్తులు నవధాన్యాలు సమర్పించి మొక్కుల చెల్లించుకున్నారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో డప్పు చప్పుల్లు, యువకుల కేరింతల మధ్య ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య, సర్పంచ్ నక్క భాస్కర్, అర్చకులు ప్రభాకరాచార్యులు, రమేశ్‌చార్యులు, డైరెక్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మేడారం జాతర చైర్‌పర్సన్‌గా ఇర్ప సుకన్య?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతర కమిటీని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. తాడ్వాయికి చెందిన ఇర్ప సుకన్యను జాతర కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జాతర కమిటీలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. చైర్‌పర్సన్‌తో పాటు కమిటీ డైరెక్టర్లుగా మహిళలను నియమించనున్నట్లు సమాచారం.
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు


