ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సేవలు
భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు అందుతాయని, త్వరలో జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మారై మిషన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఎమ్మారై మిషన్ కొనుగోలు కోసం సీఎస్‌ఆర్ నిధుల నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులు అందించిన చె క్కును బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎమ్మె ల్యే, కలెక్టర్ స్వీకరించారు. అనంతరం వారు మా ట్లాడారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రీజినల్ హెడ్ వెంకటేష్ చల్వర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా అంశంపై కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుక రవాణా కూపన్లలో అక్రమాలకు పాల్పడితే ఎంపీడీఓలు కఠి నంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మ, మున్సిపల్ అధికారులతో పెండింగ్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేవిధంగా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఆస్పత్రిలో త్వరలో
ఎమ్మారై మిషన్ ఏర్పాటు
ఎమ్మెల్యే సత్యనారాయణరావు,
కలెక్టర్ రాహుల్ శర్మ


