హస్తం హవా
సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్న పార్టీల మద్దతుదారులు..
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు
భూపాలపల్లి: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు సత్తా చాటారు. పలు జీపీలను ఏకగ్రీవంతో చేజిక్కించుకోవడంతోపాటు బరిలో నిలిచిన స్థానాల్లోనూ అధిక స్థానాలను కై వసం చేసుకున్నారు. రెండో స్థానంలో బీఆర్‌ఎస్ నిలువగా, నాలుగు స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
అధికార పార్టీ జోరు..
తొలి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటారు. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 9 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంతో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. అలాగే ఎన్నిక జరిగిన స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు.
గంటగంటకు పెరిగిన పోలింగ్..
గణపురం, రేగొండ, గోరికొత్తపల్లి, మొగుళ్లపల్లి మండలాల్లో గురువారం మొదటి విడత పంచాయ తీ ఎన్నికలు జరిగాయి. ఈ మండలాల్లో మొత్తం 1,07,690 మంది ఓటర్లు ఉండగా, 88,588 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. మొత్తంగా 82.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే పోలింగ్ ఉద యం 7 గంటలకు ప్రారంభం కాగా గంటగంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. గణపురం మండలంలో 77.05, కొత్తపల్లి గోరిలో 84.82, మొగుళ్లపల్లిలో 84.08, రేగొండలో 84.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
గణపురం 17 11 5 0 1
రేగొండ 23 11 6 1 5
కొత్తపల్లిగోరి 16 12 1 2 1
మొగుళ్లపల్లి 26 17 8 1 0
మొత్తం 82 51 20 4 7
అధిక సర్పంచ్ స్థానాలు
అధికార పార్టీ కై వసం
రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్
పలుచోట్ల అర్ధరాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు
గంటగంటకూ పెరిగిన పోలింగ్ శాతం
హస్తం హవా
హస్తం హవా
హస్తం హవా
హస్తం హవా


