సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాల నివారణ
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణిలో ఆధునిక పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను వినియోగిస్తూ ప్రమాదాల నివారణ చేపడుతున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం ఏరియాలోని సింగరేణి వర్క్‌షాపులో రక్షణ కమిటీ కన్వీనర్ దామోదర్‌రావు ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జీఎం మాట్లాడుతూ రక్షణ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. ప్రతీ ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ బాగుంటుందని, ప్రతిఒక్కరూ మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎర్రన, దామోదర్, రాహల్, సుధాకర్, నాగసాయి. కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభను వెలికితీసేందుకు వెల్‌బేబీ షో
చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వెల్‌బేబీ షోను నిర్వహించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో వెల్‌బేబీ షో ఏర్పాటు చేశారు. జీఎం, ఏరియా సేవ అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శిశువుల ఆరోగ్యం సమాజ భవిష్యత్‌కు పునాది అని, పుట్టిన మొదటి రోజు నుంచే సరైన వైద్య సంరక్షణ, పోషణ అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, వైద్యులు, కార్మిక సంఘాల నాయకులు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి


