యమబాధలు తొలగి.. ముక్తి పొంది
కాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్‌జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు. సోమవారం స్వామిజీ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద స్వామిజీని ఈఓ మహేష్ కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ..అలహాబాద్‌లోని గంగా, యమున, సరస్వతి ఎంత ప్రసిద్ధి చెందినవో.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదుల్లో భక్తులు స్నానాలు చేస్తే అంతటి మహాభాగ్యం పొందుతారని అన్నారు. 2026, మే 21నుంచి జూన్ 1వరకు సరస్వతినదికి అంత్యపుష్కరాలు జరుగుతాయని, భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని కోరారు. ఆయా రాష్ట్రాల నుంచి సుమారుగా 600మంది సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులతో కలిసి గోదావరి పరిక్రమణ (ప్రదక్షిణ) యాత్రలో భాగంగా కాళేశ్వరం క్షేత్రానికి విచ్చేశారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డిలు పోలీసు బందోబస్తు నిర్వహించారు.
ఆలయ ఉద్యోగి జేబునుంచి నగదు చోరీ
కాళేశ్వరాలయ ఉద్యోగి జేబులో నుంచి రూ.48వేల నగదును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీఠాధిపతి మలూక్ రాజేంద్రదాస్‌జీ వస్తున్న క్రమంలో ఆలయ ఉద్యోగి రాజశేఖర్ తన ప్యాంటు జేబులో రూ.48వేల నగదు పెట్టుకున్నాడు. దీంతో భక్తజనం గుండా ఓ గుర్తుతెలియని వ్యక్తి తన జేబులోని నగదును దొంగిలించాడు. అక్కడి సీసీ కెమెరాలో ఉద్యోగి వద్దకు దొంగ వచ్చే వరకు మాత్రమే నిక్షిప్తమైంది. తర్వాత జేబు చూసుకొని ఉద్యోగి కంగుతిన్నాడు. ఈఓ మహేష్‌కు తెలుపడంతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు దేవస్థానం గదుల కిరాయికి సంబంధించినవని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు.
అంత్య పుష్కరాల్లో స్నానాలు చేయాలి
యూపీలోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్‌జీ
యమబాధలు తొలగి.. ముక్తి పొంది


