ప్రలోభాల పర్వం | - | Sakshi
Sakshi News home page

ప్రలోభాల పర్వం

Dec 16 2025 4:37 AM | Updated on Dec 16 2025 4:37 AM

ప్రలో

ప్రలోభాల పర్వం

ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం

కాటారం: గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత ఘట్టం తుది దశకు చేరుకుంది. జిల్లాలోని కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లో మూడో విడతలో భాగంగా సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు కొనసాగనున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. మూడో విడతలో భాగంగా నాలుగు మండలాల్లో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ 9న అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు జరిగింది. అభ్యర్థుల ప్రచారాలు సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. వారం రోజుల పాటు మైకుల హోరు.. అభ్యర్థులు, నాయకుల ప్రసంగాల జోరుతో సందడిగా ఉన్న పల్లెలు ప్రస్తుతంగా ప్రశాంతంగా మారిపోయాయి. ఓటింగ్‌కు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేకంగా ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమదైన స్థాయిలో ఓటర్లకు ప్రలోభాలు ఎరవేస్తూ ఓటును దక్కించుకునే పనిలో ఉన్నారు. నగదు, మద్యం, మాంసం పంపిణీ చేస్తూ ఓటర్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు.

4 మండలాలు.. 81 సర్పంచ్‌ స్థానాలు

జిల్లాలో గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లో కొనసాగనున్నాయి. నాలుగు మండలాల్లో 81 సర్పంచ్‌ స్థానాలు, 696 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. తుది జాబితా అనంతరం మూడు సర్పంచ్‌ స్థానాలు, 126 వార్డు సభ్యుల స్థానాలు ఏకగీవ్రం కావడంతో 78 సర్పంచ్‌ స్థానాలకు, 570 వార్డు స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. 297 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 1,423 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ప్రలోభాలు షురూ..

ఓటింగ్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు గెలుపు కోసం నానా పాట్లు పడుతున్నారు. అభ్యర్థులు తమ తమ గ్రామపంచాయతీల్లో ఓటర్లను పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఓటర్లను నేరుగా కలుస్తూ నగదు, మధ్యం పంపిణీ చేయడం ప్రారంభించారు. పెద్ద గ్రామపంచాయతీల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేలు, చిన్న గ్రామ పంచాయతీల్లో రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు సర్పంచ్‌ అభ్యర్థులు పోటాపోటీగా పంపిణీ చేయడం మొదలు పెట్టారు. కాటారం, గంగారం, మహాముత్తారం మండలం మహాముత్తారం, నర్సింగాపూర్‌, మీనాజీపేట, బోర్లగూడెం, మహదేవపూర్‌ మండలం మహదేవపూర్‌, కాళేశ్వరం, అంబట్‌పల్లి, మల్హ ర్‌ మండలం తాడిచెర్ల, అన్‌సాన్‌పల్లి, వలెంకుంట, కొయ్యూర్‌, ఎడ్లపల్లి గ్రామపంచాయతీల్లో పోటీ హోరాహోరీ ఉండగా డబ్బు, మందు, ఇతర గిఫ్టులు ప్రభావం చూపనున్నాయి.

హోరాహోరీగా ప్రచారం..

మూడో విడత గ్రామపంచాయతీల్లో ప్రచారం సోమవారం చివరి రోజు హోరెత్తించారు. సర్పంచులు, వార్డు సభ్యులు గెలుపు కోసం ఇంటింటా తిరిగి ఓట్లు అభ్యర్థించారు. పలు మండలాల్లోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులు పోటా పోటీగా ర్యాలీలు నిర్వహించారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి తమ సొంత మేనిఫెస్టోలను ప్రకటిస్తూ ఓటు వేసి గెలిపించాలని కోరారు.

వలస ఓటర్లను రప్పించే పనిలో...

కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు వలుస ఓటర్లపై నిఘా పెట్టారు. పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను ఓటింగ్‌ రోజు రప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అధిక మంది ఓటర్లు పట్టణ ప్రాంతాల్లో ఒకే చోట ఉంటే అభ్యర్థులు అక్కడికే వెళ్లి నేరుగా వారిని కలుస్తున్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న యువ ఓటర్లకు రవాణా చార్జీలు సైతం పంపించి వారిని ఓటు కోసం ఇక్కడకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

మద్యం దుకాణాలు క్లోజ్‌

మూడో విడత ఎన్నికల్లో భాగంగా సోమవారం సాయంత్రం నుంచి కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లోని మద్యం దుకాణాలు మూసుకున్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత పది వైన్‌ షాపులకు ఎకై ్సజ్‌ అధికారులు సీల్‌ వేశారు. బెల్టు దుకాణాలు, మద్యం సరఫరాపై పోలీస్‌, ఎకై ్సజ్‌ అధికారులు దృష్టి సారించారు.

రేపు కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లో పంచాయతీలకు పోలింగ్‌

ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు

గెలుపు కోసం నానా పాట్లు

నగదు, మందు, మాంసం పంపిణీ

ప్రలోభాల పర్వం1
1/1

ప్రలోభాల పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement