క్రీడలతో మానసికోల్లాసం
భూపాలపల్లి అర్బన్: క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం పెరుగుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం సింగరేణి వర్క్ పిపుల్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో రీజియన్ స్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు కేవలం ఆనందం మాత్రమే కాదని, మన ఆరోగ్యానికి, పట్టుదలకు దారితీసే మంచి మార్గమన్నారు. క్రీడల ప్రాముఖ్యతను మనస్ఫూర్తిగా గ్రహించి, పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలన్నారు. సింగరేణి సంస్థ క్రీడల ప్రోత్సాహానికి, యువ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసి కోల్ ఇండియా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది శ్యాంసుందర్, శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, జనరల్ కెప్టెన్ మల్లేశ్, భూపాలపల్లి అథ్లెటిక్ కెప్టెన్ బానోత్ రమేష్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీఎం రాజేశ్వర్‌రెడ్డి
రీజియన్ స్థాయి
అథ్లెటిక్ పోటీలు ప్రారంభం


