దర్శనాలు నిలిపివేత.. ఆరుబయట పూజలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు మే డారానికి భారీగా తరలివచ్చారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజ స్తంభాల పున:ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పూజారులు దర్శనాల నిలిపివేత ప్రకటించిన విషయం తెలిసిందే. సమాచారం అందని భక్తులు వంద సంఖ్యలో మేడారా నికి తరలివచ్చారు. పూజా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులను గద్దెల వద్దకు రాకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు బయటనే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని పక్కనే ఉన్న చెట్టు వద్ద పసుపు, కుంకుమ, ఒండిబి య్యం సమర్పించి తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలు పూర్తయిన తర్వా త మధ్యాహ్నం 2 గంటల సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. దీంతో భక్తులు సమ్మక్క– సారలమ్మ గద్దెలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, పోలీసులు భక్తులను గద్దెల ప్రాంగణంలో రాకుండా చర్యలు తీసుకున్నారు.
దర్శనాలు నిలిపివేత.. ఆరుబయట పూజలు


