పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
కాటారం: నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ఏవీఎస్ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు అభినందన, సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో అవినీతి రహిత పాలన అందించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం విలాసాగర్ కాంగ్రెస్ యూత్ నాయకులు పూసాల శశికాంత్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజ బాబు, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల, చీమల సందీప్, వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, చిటూరి మహేశ్‌గౌడ్, పంతకాని సమ్మయ్య, ఆంగోతు సుగుణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు
కాళేశ్వరం: మహాదేవపూర్ మండల కేంద్రంలోని నాగేంద్రగిరి శ్రీఆనంద ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల సమక్షంలో స్వామివారికి అభిషేకం చేసి, ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు కురిసి, రైతాంగానికి మంచి దిగుబడులు లభించి, రాష్ట్రం వ్యవసాయంగా, ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ప్రార్ధించినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత వేగం పెరగాలని, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
శ్రీధర్‌బాబు


