బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

Dec 25 2025 8:21 AM | Updated on Dec 25 2025 8:21 AM

బాధ్య

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక 28న రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా నియామకం గట్టమ్మ వద్ద దుకాణాల వేలం

భూపాలపల్లి అర్బన్‌: పోలీస్‌ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండల పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను సమగ్రంగా పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజ లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చినప్పుడు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు, త్వరగా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజల విశ్వాసాన్ని పంపొందించే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలకేంద్రంలోని గ్రీన్‌వుడ్‌ పాఠశాల విద్యార్థులు హన్మకొండలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించిన అండర్‌ –14 ఖోఖో బాలుర, బాలికల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు కరస్పాండెంట్‌ చీర్ల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ బాలుర విభాగంలో కే.ప్రశాంత్‌, బాలికల విభాగంలో వి.అక్షర రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ందని, ఈనెల 29, 30, 31న వికారాబాద్‌లోని తాండూర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. హెచ్‌ఎం చీర్ల శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆకుతోట రాజకుమార్‌తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

కాళేశ్వరం: ఈనెల 28న రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు అలీంఖాన్‌, రాజశేఖర్‌లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీడీబీఎల్‌ఏ (తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ లెక్చరర్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో మంథనిలోని పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆర్థిక సహకార సౌజన్యంతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని, డిగ్రీ విద్యార్థినులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందన్నారు. మాతా సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర, నేటి సమాజానికి అన్వయింపుశ్రీ అనే అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుందన్నారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.50వేలు, రెండో బహుమతి రూ.25వేలు, మూడో బహుమతి రూ.15వేలు, ప్రోత్సాహక బహుమతులు రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9492883648, 9491595813, 8466975572 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

భూపాలపల్లి రూరల్‌/మొగుళ్లపల్లి: జిల్లాలోని పలువురు న్యాయవాదులను కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర న్యాయశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల అశోక్‌రెడ్డి, మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన మోరే శశికిరణ్‌రెడ్డిలను తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియామకమయ్యారు. రాబోయే మూడు సంవత్సరాల పాటు తెలంగాణ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించనున్నారు. తమ నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ములుగు రూరల్‌: మేడారం జాతర సందర్భంగా ఆది దేవత గట్టమ్మ వద్ద భక్తుల సౌకర్యార్థం దుకాణాల ఏర్పాటుకు దేవాదాయశాఖ అధి కారులు బుధవారం వేలం పాటలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వే లం పాటలకు వ్యాపారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేలం పాటల్లో కొబ్బరికాయ దుకాణం రూ.12.80లక్షలు, పసుపు–కుంకుమ రూ.4.20 లక్షలుగా పాట నిర్ణయించినట్లు తెలి పారు. అనిల్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

బాధ్యతాయుతంగా  విధులు నిర్వర్తించాలి1
1/2

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

బాధ్యతాయుతంగా  విధులు నిర్వర్తించాలి2
2/2

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement