అఽధికారులకు అభినందనలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపీడీఓలు, డీపీఓతో పాటు ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని గురువారం అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లనే ఎన్నికలు సజావుగా నిర్వహించగలిగామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిబంధనల కచ్చితమైన అమలు ఎన్నికల విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన సందర్భంగా డీపీఓ, ఎంపీడీఓలు కలెక్టర్ రాహుల్ శర్మను శాలువాతో సన్మానించారు. విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు అందించిన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


