‘పంచాయతీ‘పై పోస్టుమార్టం! | - | Sakshi
Sakshi News home page

‘పంచాయతీ‘పై పోస్టుమార్టం!

Dec 19 2025 8:21 AM | Updated on Dec 19 2025 8:21 AM

‘పంచాయతీ‘పై పోస్టుమార్టం!

‘పంచాయతీ‘పై పోస్టుమార్టం!

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

మ్మడి వరంగల్‌ జిల్లాలో మూడు విడతల్లో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు పోస్టుమార్టం చేస్తున్నాయి. పార్టీ గుర్తు లేనప్పటికీ.. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఏ మేరకు సక్సెస్‌ అయ్యారు? ఎక్కడ, ఎందుకు పంచాయతీ స్థానాలు తగ్గాయి? పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి కారణాలు ఏంటి? అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే జరిగిందా? అలాగైతే రెబల్స్‌ ఎందుకు బరిలో ఉన్నారు? ఓటమికి వెన్నుపోట్లు కారణమా? అలాగైతే ఏయే జిల్లాల్లో ఈ వెన్నుపోట్లు ప్రభావం చూపాయి? అన్న కోణాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ విశ్లేషిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌, సింగిల్‌విండో ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు.

ఫలితాలపై విశ్లేషణ..

విడతల వారీగా వెలువడిన ఫలితాలపై ప్రధాన పార్టీలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌లో 1,682 గ్రామ పంచాయతీలకు మూడు వితల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కలిపి అధికార కాంగ్రెస్‌ 1,036 పంచాయతీలను గెలుచుకోగా, బీఆర్‌ఎస్‌ 479 స్థానాలతో వెనుకబడింది. బీజేపీ 31 స్థానాలు, ఇతరులు 136 గ్రామ పంచాయతీలు దక్కించుకున్నారు. మొదటి విడతలో 555 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ 333, బీఆర్‌ఎస్‌ 148, బీజేపీ 17, ఇతరులు 57 మంది గెలుపొందారు. రెండో విడతలో 563కు కాంగ్రెస్‌ 332, బీఆర్‌ఎస్‌ 181 గెలుచుకుని పుంజుకుంది. బీజేపీ 9, ఇతరులు 41 దక్కించుకున్నారు. మూడో విడత 564 స్థానాలకు 371 కాంగ్రెస్‌, 150 బీఆర్‌ఎస్‌, 5 బీజేపీ, 38 మంది ఇతరులను ప్రజలు సర్పంచ్‌లుగా ఎన్నుకున్నారు. ఇంకొంత దృష్టి సారిస్తే మరిన్ని గ్రామ పంచాయతీలు గెలుచుకునే అవకాశం ఉండేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి తగ్గడంపై ఎక్కడ లోపం జరిగింది? అన్న కోణంలో బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు నియోజకవర్గ స్థాయి నాయకులను ఆరా తీస్తున్నారు.

ఎక్కడ ఎందుకు తగ్గాయి.. ఎక్కడ పెరిగాయి?

ఫలితాలపై ఆరా తీస్తున్న అన్ని పార్టీల నాయకులు

గెలుపు గుర్రాల ఎంపికలో

ఏమరుపాటు.. చాలాచోట్ల ఫలితాలు తారుమారు

పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు

వెన్నుపోట్లు.. రెబల్స్‌గా బరిలో

నెగ్గిన పలువురు

భవిష్యత్‌ ఎన్నికలను దృష్టిలో

పెట్టుకుని కసరత్తు

వెన్నుపోట్లు, రెబల్స్‌..

అధిష్టానాలు సీరియస్‌

పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు, కొరవడిన సమన్వయంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సీరియస్‌గానే స్పందించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 65 చోట్ల కాంగ్రెస్‌, 34 చోట్ల బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులపై ఆయా పార్టీలకు చెందిన వారు రెబల్స్‌గా బరిలోకి దిగారు. 41 చోట్ల కాంగ్రెస్‌ రెబల్స్‌, స్వతంత్రులు గెలుపొందారు. మిగతా 24 చోట్లపార్టీ అభ్యర్థులు గెలిచినా.. నానా తిప్పలుపడి 30 నుంచి 50 ఓట్ల మెజార్టీనే వచ్చింది. అదేవిధంగా 20 పంచాయతీల్లో బీఆర్‌ఎస్‌ రెబల్స్‌, స్వతంత్రులు గెలుపొందగా, 14 చోట్ల బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు అతికష్టం మీద గెలిచారు. జనగామ, హనుమకొండ, వరంగల్‌, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా ఇలాంటివి చోటు చేసుకున్నాయని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అధిష్టానాలకు ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ.. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నేతలతో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ అధి ష్టానం కూడా భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలకు తావులేకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌, సింగిల్‌విండో ఎన్నికలు రానున్న దృష్ట్యా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కూడా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలను అప్రమత్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement