శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
151 స్థానాలు ‘చేతి’లోకి..
జిల్లాలోని 12 మండలాల్లో 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలకు గాను మూడు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ఇందులో 21 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్ధతుదారులు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. దీంతో మిగిలిన 226 సర్పంచ్ స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. భూపాలపల్లి నియోజకవర్గం, కాటారం డివిజన్‌లో మూడు దఫాలుగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థుల్లో 130 మంది గెలుపొందారు. ఎన్నికల అనంతరం రేగొండ మండలంలో గెలుపొందిన ఓ సర్పంచ్ తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఏకగ్రీవం 21, గెలుపొందిన 130, పార్టీలో కలిసిన ఒక అభ్యర్థితో కలిపి కాంగ్రెస్ సర్పంచ్‌ల సంఖ్య 152కు చేరుకుంది.
బీఆర్‌ఎస్‌కు 68 స్థానాలే..
జిల్లాలో వాడీవేడిగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 68 స్థానాలకే పరిమితం అయింది. ఎన్నికల అనంతరం భూపాలపల్లి మండలంలోని ఓ సర్పంచ్ ఇటీవల బీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీ సర్పంచ్‌ల సంఖ్య 69కి చేరుకుంది. కాగా జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిచినప్పటికీ భూపాలపల్లి నియోజకవర్గంలోని రెండు ప్రధాన మండల కేంద్రాల సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోవడం గమనార్హం. చిట్యాల మండలంలో ఏకగ్రీవం పోనూ, పోటీ జరిగిన స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు సమానంగా 10 చొప్పున సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నాయి.
ఆరింటికే బీజేపీ పరిమితం..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. జిల్లాలో మాత్రం ఉనికిని చాటుకోలేకపోయింది. భూపాలపల్లి నియోజకవర్గంలో తమ పార్టీ మద్ధతుదారులు ఐదుగురు, కాటారం మండలంలో ఒకరు గెలుపొందారు. మొత్తంగా ఆరింటికే బీజేపీ పరిమితమైంది. స్వతంత్రుల సంఖ్య కంటే బీజేపీ తక్కువ స్థానాలను కై వసం చేసుకుంది.
స్వతంత్రులు, రెబల్స్ హవా..
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రులు, తమ పార్టీల నుంచి మద్ధతు లభించక రెబల్స్‌గా బరిలో నిలిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలను చేజిక్కించుకన్నారు. మల్హర్ మండలంలో ఒక స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవం కాగా, జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన రెబల్స్, స్వతంత్రులు 22 మంది బరిలో నిలిచి గెలుపొందారు. మొత్తంగా స్వతంత్రుల సంఖ్య జిల్లాలో 23కు చేరుకుంది. టేకుమట్ల, కాటారం మండలాల్లో అత్యధికంగా ఐదుగురు చొప్పున స్వతంత్రులు సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. భూపాలపల్లి మండలంలోని ఒక స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరగా, రేగొండ మండలంలోని ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


