రైతులకు యాప్‌పై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి రూరల్: రైతులకు ఎరువుల పంపిణీ కోసం యాప్‌పై అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఏఈఓలకు సూచించారు. యూరియా యాప్, తదితర అంశాలపై భూపాలపల్లి మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో గురువారం మండలంలోని కొంపెల్లి రైతువేదికలో ఏఈఓలతో పాటు, మండలంలోని ఫర్టిలైజర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలతో పాటు మండలంలోని ఫర్టిలైజర్ డీలర్లు పాల్గొన్నారు.
చిట్యాల: చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా మండలంలోని కై లాపూర్ గ్రామానికి చెందిన దానవేణి రమేశ్‌ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లారీ ఓనర్ల సభ్యులు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా డుడ్డేడి రమేష్, కోశాధికారిగా ముదిరికోళ్ల రాజును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల లారీ ఓనర్ల సభ్యులు అంబాల రాజు, మేతే శ్రీనివాస్, రాకేష్, బోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: సింగరేణి గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల వేలం పాటలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఎందుకు పోరాటాలు నిర్వహించడం లేదన్నారు. భేషరతుగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాములు, కుమారస్వామి, రాజన్న, కుమారస్వామి, జనార్దన్, జైపాల్, ప్రసాద్ పాల్గొన్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ సర్పంచ్‌గా హసీనభానో బుధవారం గెలిచారు. ఆమె మహదేవపూర్ జెడ్పీటీసీగా 2014లో పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల్లో మహదేవపూర్ సర్పంచ్‌గా హసీనభానో గెలుపొందగా, ఆమె భర్త అక్భర్‌ఖాన్ గతంలో మహదేవపూర్ ఎంపీపీగా, సర్పంచ్‌గా పదవులు చేపట్టి ప్రజల మనసును దోచుకున్నారు. ప్రస్తుతం ఆమె సర్పంచ్‌గా 528 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో రోడ్ల వెంట షాపుల ముందు ఏర్పాటు చేసుకున్న పందిళ్లను తొలగించాలని అధికారులు చిరు వ్యాపారులను కోరారు. ఈ మేరకు నాలుగైదు రోజుల నుంచి చిరువ్యాపారులకు చెప్పినా తొలగించకపోవడంతో గురువారం అధికారులు జేసీబీ సాయంతో తొలగించేందుకు వెళ్లారు. దీంతో చిరువ్యాపారులు ఒక రోజు సమయం ఇస్తే తామే తొలగిస్తామని చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.
ములుగు: పీఆర్‌టీయూ బలోపేతానికి సంఘం నాయకులు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వేం యాకూబ్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్‌టీయూ నుంచి సూర్యనారాయణ, మోహన్‌లాల్‌లు పీఆర్‌టీయూలో చేరగా సంఘం సభ్యత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండలాధ్యక్షుడు సానికొమ్ము ముకుందారెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు యాప్‌పై అవగాహన కల్పించాలి


