నేడు, రేపు బాల వైజ్ఞానిక ప్రదర్శన
ములుగు: జిల్లా కేంద్రంలోని బండారుపల్లి మోడల్‌స్కూల్‌లో 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన నేడు, రేపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థుల పేర్లను నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ కొరకు స్టెమ్ అనే ప్రధాన అంశాన్ని ఆధారంగా తీసుకొని విద్యార్థులు సుస్థిరమైన వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు, హరిత శక్తి (గ్రీన్ ఎనర్జీ), అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతలు, వినోదకరమైన గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, జల సంరక్షణపై సృజనాత్మకత ప్రాజెక్టులు, నమూనాలు ప్రదర్శించాలని సూచించారు. 2024–25 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ పథకం కింద ఎంపికై న 20 ప్రాజెక్టులతో పాటు బాల వైజ్ఞానిక ప్రదర్శనకు సుమారు 500 ఎగ్జిబిట్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్భథం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరింతగా అభివృద్ది చెందుతాయని వివరించారు. జిల్లా ప్రజలు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సందర్శించి బాల శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, డీసీఈబీ కార్యదర్శి సూర్యనారాయణ, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్లు అర్షం రాజు, శ్యాంసుందర్ రెడ్డి, రజిత, శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు తిరుపతి, సోమారెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థ రెడ్డి


