పుణ్యస్నానాలు.. మొక్కులు
● మేడారానికి భారీగా తరలివచ్చిన భక్తులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సమ్మక్క రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి వచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు జరుగుతున్న సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా దగ్గరుండి చూడాలని సిబ్బందిని అదేశించారు.


