రాజకీయ కక్ష సాధింపు చర్య
కాళేశ్వరాలయంలో దేవాదాయ, ఎన్పీడీసీఎల్ శాఖల నిర్లక్ష్యం భక్తులకు శాపంగా మారనుంది. రామాలయం వెనుకాల భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన మరుగుదొడ్ల ఎదుట విద్యుత్‌స్తంభం ప్లోరింగ్‌తో కలిసి, ఎర్త్ వైర్ బండరాళ్లకు కట్టి ఉంచి నిర్మాణం చేశారు. దీంతో అధికారులు, ఇంజనీర్ల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు ఎర్త్‌వైర్‌కు విద్యుత్ సరఫరా జరిగితే ప్రమాదం పొంచి ఉంది. అఽధికారుల స్పందించి తొలగించాలని భక్తులు కోరుతున్నారు. – కాళేశ్వరం
భూపాలపల్లి రూరల్: నేషనల్ హెరాల్డ్ కేసు.. కేవలం రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో గురువారం సింగరేణి ఏరియా ఆస్పత్రి సెంటర్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ సీబీఐ, ఈడీలతో కాంగ్రెస్ నాయకులను, గాంధీ కుటుంబాన్ని వేధించాలని బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. పేరు మార్చి ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డీఎస్పీ సంపత్‌రావు, సీఐ నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణ రావు
రాజకీయ కక్ష సాధింపు చర్య
రాజకీయ కక్ష సాధింపు చర్య


