22న విపత్తుల నిర్వహణపై మాక్‌డ్రిల్
భూపాలపల్లి అర్బన్: ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి ఈ నెల 22వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాల్లో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్నివేళలా సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు విపత్తుల సమయంలో రక్షణ పొందేలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని తెలిపారు. గత వర్షాకాలం జిల్లాలో కురిసిన వర్షాలకు సంభవించిన వరదలు వల్ల తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. అప్రమత్తత, ముందస్తు ప్రణాళికలు, విపత్తుల అంచన, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాల సమన్వయ చర్యలు, అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతో నష్టాలు లేకుండా వరదలను ఎదుర్కొన్నామని వివరించారు. మున్ముందు నష్టాలు కలుగకుండా సన్నద్ధంగా ఉంటామన్నారు. ప్రజ లకు విపత్తుల సమయంలో రక్షణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, అదనపు ఎస్పీ నరేష్, ఆర్డీఓ రవి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, ఫైర్ అధికారి శ్రీనివాస్, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.


