నేడు కొత్త కోర్టుల ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో నేడు(శనివారం) రెండు నూతన కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్ వర్చ్యువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నామవారపు రాజేశ్వర్‌రావు, జస్టిస్ బిఆర్ మధుసూదన్‌రావు వర్చ్యువల్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్‌కుమార్‌ను కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రావణ్‌రావు, విష్ణువర్ధన్‌రావు, శివకుమార్, రమేష్‌నాయక్, రాకేష్, వెంకటస్వామి, దివ్య పాల్గొన్నారు.
మల్హర్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాలుగో మహాసభను విజయవంతం చేయాలని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొయ్యూరు సెంటర్‌లోని కొమురం భీం విగ్రహ వద్ద కరపత్రాలను శుక్రవారం పీక కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28, 29 తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మహాసభకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్యల రాష్ట్ర కార్యదర్శి బాపు, ఆదివాసీ మహిళా నాయకురాలు గడ్డం సమ్మక్క, దళిత నాయకురాలు మేకల కళ, బీసీ మహిళా నాయకురాలు నర్సక్క పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: ఈనెల 21న తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 80 వసంతాల అభ్యుదయోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్‌తో కలిసి కార్యాలయంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెండెం మధుసూదన్, కూచనపల్లి రవీందర్ మాట్లాడుతూ ఈ నెల 21న హైదరాబాద్‌లో విద్యా సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘుకుమార్, రాజు, వేణుగోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టేకుమట్ల: గ్రూప్ త్రీ ఫలితాల్లో మండలంలోని రామకృష్ణపూర్ (టి)గ్రామానికి చెందిన కూలీ కొడుకు బొంపెల్లి బాలకృష్ణ మంచి ర్యాంకు సాధించి గురుకుల విద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. మండలంలోని రామకృష్ణపూర్ (టి) గ్రామానికి చెందిన బొంపెల్లి గోవిందం–విమల దంపతులది రెక్కడితేగానీ డొక్కాడని కుటుంబం. నిత్యం కూలి పని చేసుకుంటూ కుమారుడు బాలకృష్ణను ఉన్నత చదువులు చదివించారు. బాలకృష్ణ చదువులో కష్టపడుతూ సివిల్స్ కోసం సన్నద్ధమయ్యాడు. సివిల్స్ రాకపోవడంతో గ్రూప్ వన్, టూ, త్రీకి సన్నద్ధమయ్యాడు. గ్రూప్ త్రీలో 1,061 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు.
నేడు కొత్త కోర్టుల ప్రారంభం
నేడు కొత్త కోర్టుల ప్రారంభం


