సింగరేణి సంస్థ నిర్వీర్యానికి కుట్ర
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కాలరీస్ సంస్థను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ–2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను జెక్కోకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను ఈ విధంగానే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల సింగరేణికి జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఇప్పుడు మణుగూరులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనే ప్రయత్నాలు చేపడుతోందన్నారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, పండ్రాల మల్లయ్య, స్వామి, రమేష్, శంకర్, నారాయణ, రాజు, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు
శ్రీనివాస్


