మోరంచ మళ్లీ ఉప్పొంగితే..
భూపాలపల్లి: భారీ వర్షాలు కురిసి వాగులు ఉప్పొంగి, చెరువు కట్టలు తెగినప్పడు ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరుకోవాలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. 2023 జూలై 27న భూపాలపల్లి మండలంలోని మోరంచవాగు ఉప్పొంగి మోరంచపల్లిలో 280 ఇళ్లు నీట మునిగాయి. గ్రామానికి చెందిన నలుగురు వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరోమారు ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సోమవారం మోరంచపల్లి గ్రామంతో పాటు, మోరంచవాగులో మాక్ డ్రిల్ నిర్వహించాయి. వాగులు ఉప్పొంగినప్పుడు పశువులు, మనుషులు నీటిలో కొట్టుకుపోతే, ఎలా కాపాడాలో కళ్లకు కట్టినట్లుగా డ్రిల్ నిర్వహించారు. అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించారు. వరద ప్రభావిత కాలనీలను ఎలా తరలించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఎస్పీ సంకీర్త్, అధికారులు పాల్గొన్నారు.
మోరంచ మళ్లీ ఉప్పొంగితే..
మోరంచ మళ్లీ ఉప్పొంగితే..
మోరంచ మళ్లీ ఉప్పొంగితే..


