ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
భూపాలపల్లి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివస్ కార్యక్రమం నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పదిమంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, ప్రతీ దరఖాస్తుకు సరైన న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.
వెంకటస్వామి సేవలు మరువలేనివి..
ప్రముఖ నాయకుడు, సామాజిక సేవకుడు గడ్డం వెంకటస్వామి సేవలు మరువలేనివని ఎస్పీ సంకీర్త్ అన్నారు. వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వెంకటస్వామి తన జీవితాన్ని పూర్తిగా సమాజసేవకు అంకితం చేశారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


