గణితంపై భయం వీడాలి
● ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల
కాటారం: విద్యార్థులు గణితం పట్ల భయం వీడి ఆసక్తి పెంచుకోవాలని కాటారం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల సూచించారు. మండలకేంద్రంలోని ఆదర్శ హైస్కూల్, గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాల, కేజీబీవీ పాఠశాలల్లో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదర్శ హైస్కూల్‌లో మ్యాథమెటికల్ సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థినులు గణితశాస్త్రంకు సంబంధించిన ప్రాజెక్టులు, నమూనాలు, ఆకృతులు తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ దశ నుంచే విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హైస్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్‌రావు, కరస్పాండెంట్ కార్తీక్‌రావు, కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీత, గురుకులం ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మిల్లర్లు కోత విధిస్తే ఊరుకునేది లేదు
ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి మిల్లర్లు అడ్డగోలుగా కోత విధిస్తే ఊరుకునేది లేదని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం మండలం దామెరకుంట, మల్లారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను సోమవారం చైర్‌పర్సన్ పరిశీలించారు. ధాన్యం నిల్వ, కొనుగోలు ప్రక్రియ, రవాణాపై ఆరా తీశారు. చైర్‌పర్సన్ వెంట మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేశ్‌రెడ్డి, దేవదాసు, మహేశ్, సురేందర్ పాల్గొన్నారు.


